Chiranjeevi Nayanthara: చిరంజీవి నయనతారలపై షూటింగ్ వీడియో లీక్ - మూవీ టీం స్ట్రాంగ్ వార్నింగ్
Mega 157 Movie: మెగాస్టార్, అనిల్ రావిపూడి 'మెగా 157' మూవీ షూటింగ్ నుంచి లీక్డ్ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై టీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలాంటి వాటిని ప్రోత్సహించొద్దని కోరింది.

Chiranjeevi Nayanthara Romantic Song In Boat Video Leaked: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మూవీపై ఇప్పటికే హైప్ మామూలుగా లేదు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆ సాంగ్ వీడియో లీక్
ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా... వీరిద్దరి మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేరళలో మూవీ షూటింగ్ జరుగుతుండగా... ఓ బోటు వద్ద షూటింగ్ సన్నివేశాలు లీక్ అయ్యాయి. ఈ సీన్స్ చూస్తుంటే ఇద్దరి మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ఉందని అర్థమవుతోంది. చిరు, నయనతారలపై ఓ బోటులో షూట్ చేస్తుండగా... మెగాస్టార్ పంచెకట్టులో ఉండగా... నయన్ చీరలో అందంగా కనిపించారు.
బోటును అందగా పువ్వులతో అలంకరించడం, ఇద్దరూ పట్టువస్త్రాల్లో మెరవడంతో ఫస్ట్ నైట్ సీన్ లేదా రొమాంటిక్ సాంగ్ ఉందా? అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అయితే, ఇది పెళ్లి సీన్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా... రొమాంటిక్ సీన్ అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా... ఇలాంటి లీక్స్ వద్దని మేకర్స్ అలర్ట్‌గా ఉండాలంటూ మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ మూవీలో చిరంజీవి, నయనతార భార్యభర్తలుగా కనిపించనున్నారు. ఇందులో హస్బెండ్ అండ్ వైఫ్ కాన్‌ఫ్లిక్ట్ డిఫరెంట్‌గా ఉంటుందని అనిల్ ఇదివరకూ ఇంటర్వ్యూల్లో చెప్పారు.
Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - పవన్ బర్త్ డేకు 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి సాలిడ్ ట్రీట్!
టీం స్ట్రాంగ్ వార్నింగ్
షూటింగ్ సెట్ నుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో లీక్ చేయడంపై మూవీ టీం స్పందించింది. అలా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 'మెగా 157 సెట్‌ల నుంచి అనధికారిక వీడియోలు, ఫోటోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నట్లు మేము గమనించాం. సరైన అనుమతి లేకుండా ఇలా కంటెంట్ ప్రసారం చేయడం సరికాదు. ఈ చర్యలు మా క్రియేటివిటీని దెబ్బతీయడమే కాకుండా మా టీం కృషి, ప్రయత్నాలను దెబ్బతీస్తాయి.
ఎవరైనా అలాంటి లీక్డ్ కంటెంట్, వీడియోలు, ఫోటోలు ఎంకరేజ్ చెయ్యొద్దు. లీక్ అయిన విషయాలు ప్రసారం చేసినా, ఇతరులకు షేర్ చేసినా కాపీరైట్స్, పైరసీ నిరోధక చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. సరైన సమయంలో టీం నుంచి అధికారిక అప్డేట్స్ వస్తాయి. అంతవరకూ మాకు సపోర్ట్‌గా ఉండండి.' అని ప్రకటించారు.
వచ్చే ఏడాది సంక్రాంతికి...
ఈ మూవీలో చిరంజీవి ఒరిజినల్ నేమ్ శివశంకర్ వరప్రసాద్ పేరుతోనే కనిపించనుండగా... టైటిల్ కూడా 'మన శంకర్ వరప్రసాద్ గారు..' అనే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. చిరు, నయన్‌లతో పాటు కేథరిన్, వీటీవీ గణేష్, 'బలగం' మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ చేయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నారు.





















