(Source: ECI/ABP News/ABP Majha)
Hitman Telugu Movie : కొత్త హీరోతో భారీ యాక్షన్ సినిమా - టీజర్ విడుదల చేసిన రత్నం!
Hitman chapter 1 Telugu movie teaser : ప్రముఖ నిర్మాత ఎయం రత్నం చేతుల మీదుగా 'హిట్ మ్యాన్' టీజర్ విడుదలైంది.
యాక్షన్ సినిమాలకు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి ఎప్పుడూ తప్పకుండా ఆదరణ ఉంటుంది. అయితే... తెలుగులో, ఆ మాటకు వస్తే భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త హీరోలతో భారీ యాక్షన్ సినిమాలు తీయడం అరుదు. బిష్ణు అధికారి హీరోగా నటించడంతో పాటు దర్శకుడిగా యాక్షన్ సినిమా తీశారు. ఆ చిత్రమే 'హిట్ మ్యాన్'.
'హిట్ మ్యాన్' టీజర్ విడుదల చేసిన ఎయం రత్నం
బిష్ణు అధికారి కథానాయకుడిగా 99 సినిమాస్ పతాకంపై రూపొందిన సినిమా 'హిట్ మ్యాన్' (Hitman Telugu Movie). ఇందులో అదితి శర్మ, ఆంచల్ శర్మ నాయికలు. దీపక్ అధికారి నిర్మాత. బిష్ణు అధికారి దర్శకత్వం వహించారు. ఇదొక స్పై థ్రిల్లర్. వచ్చే నెల (నవంబర్)లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎయం రత్నం ఇటీవల టీజర్ విడుదల చేశారు. బిష్ణు అధికారికి పెద్ద విజయం రావాలని, టీజర్ వైవిధ్యంగా ఉందని ఆయన తెలిపారు.
'హిట్ మ్యాన్' టీజర్ ఎలా ఉందంటే?
Hitman Teaser Review : హీరో, దర్శకుడు... రెండు బాధ్యతలు నిర్వర్తించిన బిష్ణు అధికారి కథను రివీల్ చేయకుండా టీజర్ రిలీజ్ చేశారు. కేవలం కథానాయకుడిని మాత్రమే పరిచయం చేశారు. గాయాల వల్ల ఏర్పడిన రక్తాన్ని తుడుచుకుంటున్న హీరోను అద్దంలో చూపించారు. ఆ తర్వాత టేబుల్ మీద చాలా గన్స్ ఉంటాయి. అయితే... బాణంతో లక్ష్యాన్ని చేధించడం చూపించారు. అతడి కథ ఏమిటి? అనేది నవంబర్ నెలలో విడుదల కానున్న సినిమా చూస్తే తెలుస్తుంది.
Also Read : 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రివ్యూ : అనుష్క, నవీన్ పోలిశెట్టిల సినిమా హిట్టా? ఫట్టా?
'హిట్ మ్యాన్' హీరో, దర్శకుడు బిష్ణు అధికారి మాట్లాడుతూ ఇదొక న్యూ ఏజ్ స్పై థ్రిల్లర్. మన దేశంతో పాటు బూర్జ్ ఖలీఫా, పారిస్, దుబాయ్, అమ్‌స్టర్‌డామ్, నేపాల్, శ్రీలంకలలో షూటింగ్ చేశాం. మూడు భాగాలుగా 'హిట్ మ్యాన్'ను తెరకెక్కిస్తున్నాం. వచ్చే నెలలో ఛాప్టర్ 1 విడుదల కానుంది. నేను మార్వల్ సినిమాలకు ఫ్యాన్. ఆ టైపులో స్పై థ్రిల్లర్ కథను చెప్పడానికి చేసిన ప్రయత్నమే 'హిట్ మ్యాన్'. ఛాప్టర్ 1 చిత్రీకరణ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. హిందీలో కూడా విడుదల అయ్యేలా చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ట్రైలర్ విడుదల చేయడంతో పాటు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం'' అని అన్నారు.
Also Read : జవాన్ రివ్యూ : షారుక్ ఖాన్ మాస్ యాక్షన్ అవతార్ ఎలా ఉంది? ‘జవాన్’ బాక్సాఫీస్ దగ్గర గెలుస్తాడా?
'హిట్ మ్యాన్'కు సంగీతం అందిస్తున్న 'మంత్ర' ఆనంద్ ''ఈ సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. మ్యూజిక్ థీమ్స్ ఇంకొన్ని ఉన్నాయి. ఇదొక న్యూ ఏజ్ మూవీ. యాక్షన్ సీక్వెన్సులు అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి'' అని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత : సిప్రా అధికారి, ఛాయాగ్రహణం : వై.ఆర్ శేఖర్, కూర్పు : బి నాగేశ్వర్ రెడ్డి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial