మాల్దీవుల్లోని సముద్ర తీరంలో షికారు చేస్తున్న, ఎంజాయ్ చేస్తున్న ఈ అందాల భామను గుర్తు పట్టారా? తెలుగులో ఈ భామ 'హిట్' సినిమా చేశారు. ఇంకా గుర్తు రాలేదా? ఆమె ఫేస్ నెక్స్ట్ ఫొటోలో ఉంది చూడండి. సుశాంత్ 'చిలసౌ'తో తెలుగు తెరకు పరిచయమైన హిమాచల్ ప్రదేశ్ బ్యూటీ రుహానీ శర్మ. తెలుగులో 'హిట్', 'డర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాల్లో రుహానీ శర్మ నటించారు. విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న 'సైంధవ్'లో రుహాని కీలక పాత్ర చేస్తున్నారు. రుహానీ శర్మ ఇటీవల పోలీస్ రోల్ కూడా చేశారు... 'హర్' సినిమాలో! అది ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు రుహానీ శర్మ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. షూటింగ్స్ మధ్య గ్యాప్‌లో ఇలా సేద తీరుతున్నారు. రుహానీ శర్మ (All Images Courtesy : ruhanisharma94 / Instagram)