Bigg Boss Divi: హీరోయిన్‌గా 'బిగ్ బాస్' దివి - 'లంబసింగి' విడుదలకు రెడీ, ఎప్పుడంటే?
Lambasingi movie release date: దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో 'బిగ్ బాస్' దివి వడ్త్య కథానాయికగా నటించిన సినిమా 'లంబసింగి'. ఈ నెలలో విడుదలకు రెడీ అవుతోంది. ఎప్పుడో తెలుసా?
'బిగ్ బాస్' సీజన్ 4తో గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయి దివి వడ్త్య (Divi Vadthya bigg boss). బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడానికి ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి', సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్ ప్రెస్' సినిమాల్లో కనిపించారు. 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్', జగపతి బాబు 'రుద్రంగి'తో పాటు 'క్యాబ్ స్టోరీస్', 'నయీమ్ డైరీస్'లో నటించారు. 'మా నీళ్ల ట్యాంక్', 'ఏటీఎం' వెబ్ సిరీస్ సైతం చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... దివి కథానాయికగా ఓ సినిమా చేశారు. ఆ సినిమా పేరు 'లంబసింగి'. ఎ ప్యూర్ లవ్ స్టోరీ... అనేది ఉప శీర్షిక. అది ఈ నెలలో విడుదలకు రెడీ అయ్యింది.
మార్చి 15న 'లంబసింగి' విడుదల
Lambasingi movie release date: 'సోగ్గాడే చిన్ని నాయన', 'రారండోయ్ వేడుక చూద్దాం', 'బంగార్రాజు' చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల 'లంబసింగి' సినిమాతో చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టారు. ఆయన సమర్పణలో కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్ తన్నీరు ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో భరత్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.
View this post on Instagram
'లంబసింగి' చిత్రాన్ని మార్చి 15న విడుదల చేయనున్నట్లు కళ్యాణ్ కృష్ణ కురసాల తెలిపారు. స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని ఆయన చెప్పారు.
ఆంధ్రా కశ్మీర్ లంబసింగి నేపథ్యంలో తొలి సినిమా!
వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్లకు విహార యాత్రలకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు! అటువంటి కూల్ హిల్ స్టేషన్ ఒకటి ఆంధ్రాలోనూ ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులరైన ఆ ఊరి పేరు 'లంబసింగి'. ఆ పేరుతో తెలుగు భాషలో రూపొందుతోన్న తొలి సినిమా దివిది కావడం విశేషం. ఈ సినిమా గురించి దర్శకుడు నవీన్ గాంధీ మాట్లాడుతూ "విశాఖ సమీపంలోని లంబసింగి నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది. చిత్రీకరణ అంతా పూర్తి అయ్యింది. సినిమాలో లొకేషన్లు, ఆర్ఆర్ ధృవన్ అందించిన పాటలు హైలైట్ అవుతాయి" అని చెప్పారు.
Also Read: ప్రభాస్ ఒక్కడి కోసమే అలా చేశారంతే - పాన్ ఇండియా ఫిల్మ్స్, 'భీమా' గురించి గోపీచంద్ ఇంటర్వ్యూ
భరత్, దివి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య ఇతర తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: కె. విజయ్ వర్ధన్, ఛాయాగ్రహణం: కె. బుజ్జి (BFA), సాహిత్యం: కాసర్ల శ్యామ్, సంగీతం: ఆర్ఆర్ ధృవన్, నిర్మాణం: కాన్సెప్ట్ ఫిల్మ్స్, సమర్పణ: కళ్యాణ్ కృష్ణ కురసాల, కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: నవీన్ గాంధీ.