అన్వేషించండి

Bhairava Dweepam Re Release : ఆగస్టులో 'భైరవద్వీపం' రీ రిలీజ్ - బాలకృష్ణ ఫ్యాన్స్ రెడీనా!

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. ఆగస్టులో ఆల్ టైమ్ క్లాసిక్ 'భైరవ ద్వీపం' రీ రిలీజ్ కానుంది. అది ఎప్పుడంటే?

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రయోగాలకు ఎప్పుడూ వెనుకాడలేదు. ఆయనకు అందగాడు ఇమేజ్ ఉన్నప్పుడు, కమర్షియల్ కథానాయకుడిగా వరుస విజయాలతో మాంచి జోరు మీద ఉన్నప్పుడు క్యారెక్టర్ కోసం సిల్వర్ స్క్రీన్ మీద అందవిహీనంగా కనిపించడానికి వెనుకడుగు వేయలేదు. ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. అందులో 'భైరవ ద్వీపం' ఒకటి. ఇప్పుడు ఆ సినిమా మళ్ళీ థియేటర్లలోకి రానుంది. 

ఆగస్టు 5న 'భైరవ ద్వీపం' రీ రిలీజ్!
Bhairava Dweepam Re Release : వైవిధ్యమైన కథలను స్వాగతించే నందమూరి బాలకృష్ణ లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao)తో కలిసి చేసిన సినిమాల్లో 'భైరవ ద్వీపం' ఒకటి. ఆ సినిమాలో ఓ ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించి, తెలుగు ప్రేక్షకులను అందులోకి తీసుకు వెళ్లారు. ఆ సినిమా ఏప్రిల్ 14, 1994న విడుదల అయ్యింది. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతి అందించింది. బాక్సాఫీస్ బరిలో వసూళ్ల సునామీ, అద్భుతాలను సృష్టించింది. క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సంస్థ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ సినిమాను ఈ తరం ప్రేక్షకుల కోసం ఆగస్టు 5న రీ రిలీజ్ చేస్తోంది.  

టెక్నాలజీ ద్వారా 'భైరవ ద్వీపం'ను అప్ గ్రేడ్ చేశామని 4కె క్వాలిటీతో విడుదల చేస్తున్నామని చంద్ర శేఖర్ కుమారస్వామి, క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్‌ పి. దేవ్ వర్మ తెలిపారు.

Also Read వెంకటేష్ vs నాని vs నితిన్ vs సుధీర్ బాబు... క్రిస్మస్‌కు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా పోటీ  

'భైరవ ద్వీపం' కథకు వస్తే... 
'భైరవ ద్వీపం' సినిమాలో బాలకృష్ణ ఒక తెగలో ఎదుగుతున్న రాకుమారుడు విజయ్‌ పాత్రలో ధైర్య సాహసాలు కలిగిన వీరుడిగా కనిపిస్తారు. విజయ్ కార్తికేయ రాజ్యానికి చెందిన యువరాణి పద్మావతి (రోజా)తో విజయ్ ప్రేమలో పడతారు. అయితే, ఒక దుష్ట మాంత్రికుడు పద్మావతిని బలి ఇవ్వడానికి 'భైరవ ద్వీపం' పేరు గల ద్వీపానికి మాయాజాలం ద్వారా తీసుకు వెళతాడు. అక్కడ నుంచి యువరాణిని విజయ్ ఎలా కాపాడాడు? అనేది కథ. 

Also Read డీఎస్పీ గట్టిగా కొట్టాడుగా - ఒక్క దెబ్బకు మళ్ళీ లెక్కలు సెట్ అంతే!

'భైరవ ద్వీపం' సినిమాకు రావి కొండల రావు కథ అందించారు. ఆ కథకు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు అద్భుతమైన స్క్రీన్‌ ప్లే అందించారు. కథ, కథనాలు సినిమాలో హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ అందించిన సంగీతం మరో హైలైట్. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : కబీర్ లాల్, కూర్పు : డి. రాజ గోపాల్. ఈ సినిమాను చందమామ విజయ కంబైన్స్ పతాకంపై బి. వెంకట రామి రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం తొమ్మిది నంది అవార్డులను సొంతం చేసుకుంది. కైకాల సత్యనారాయణ, విజయ కుమార్, రంభ, విజయ రంగరాజు, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబు మోహన్, మిక్కిలినేని, పద్మనాభం, సుత్తివేలు, కోవై సరళ, చిట్టి బాబు, కె.ఆర్. విజయ, మనోరమ, సంగీత, రజిత, కోవై సరళ ఈ సినిమాలో ఇతర తారాగణం. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adani Stocks: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
Tamannaah Bhatia : అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
Zomato: జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
Bank Locker Rules: బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Embed widget