అన్వేషించండి

Shine Screens : 'భగవంత్ కేసరి' నిర్మాతల మధ్య దూరం - వేర్వేరు కుంపట్లు!?

షైన్ స్క్రీన్స్ నిర్మాతలు, స్నేహితులు హరీష్ & సాహు మధ్య దూరం పెరిగినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు కుంపట్లు పెడుతున్నారట. 

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎంతో మంది నిర్మాతలు వస్తూ ఉంటారు. ఎంతో మంది వెళుతూ ఉంటారు. అయితే... కొందరు మాత్రమే పదిమంది చెప్పుకునే సినిమాలు, పదిమందికి గుర్తుండే సినిమాలు తీస్తుంటారు. అటువంటి నిర్మాతల జాబితాలో షైన్ స్క్రీన్స్ అధినేతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ స్నేహితులు ఇద్దరూ కలిసి నిర్మించిన సినిమాల సంఖ్య తక్కువే. కానీ, ఆ చిత్రాలలో రెండు మంచి సినిమాలు ఉన్నాయి.

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, అగ్ర కథానాయిక సమంత వివాహ బంధంలో ఉండగా... వాళ్ళిద్దరూ జంటగా నటించిన చిత్రాలలో 'మజిలీ' ఒకటి. సినిమాలోనూ భార్యా భర్తలుగా కనిపించారు. ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్న సినిమాలలో అది ఒకటి. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా 'భగవంత్ కేసరి'ని సైతం వీళ్లిద్దరూ నిర్మించారు. తెలుగు చిత్ర సీమ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం... ఇప్పుడీ స్నేహితుల మధ్య దూరం పెరిగింది. మనస్పర్ధలు రావడంతో వేరు పడ్డారని తెలుస్తోంది.

వేరు కుంపటి పెట్టిన హరీష్ పెద్ది!
'భగవంత్ కేసరి' విడుదల తర్వాత స్నేహితులు ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో ఇక నుంచి వేరు వేరుగా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారట. షైన్ స్క్రీన్స్ సంస్థ నుంచి హరీష్ పెద్ది వైదొలిగారని, ఇకపై ఆ సంస్థ నిర్మించే సినిమాలలో ఆయన భాగస్వామిగా ఉండరని, కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభిస్తున్నారని సన్నిహితులు తెలిపారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గారపాటి సొంతంగా సినిమాలు నిర్మించనున్నారు.

మైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థను స్థాపించారు హరీష్ పెద్ది. అందులో తొలి ప్రయత్నంగా గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సాహు గారుపాటి విషయానికి వస్తే... యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డకు అడ్వాన్సులు ఇచ్చారు‌. త్వరలో వారితో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : రెమ్యూనరేషన్ బదులు సినిమా రిలీజ్ - రిస్క్ చేస్తున్న నాని?

నాని కథానాయకుడిగా నటించిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో షైన్ స్క్రీన్స్ సంస్థ ప్రారంభమైంది. ఆ తరువాత 'మజిలీ' ప్రొడ్యూస్ చేశారు. తొలి సినిమా హీరో నాని, మలి సినిమా దర్శకుడు శివ నిర్వాణ కలయికలో 'టక్ జగదీష్' మూడో సినిమాగా నిర్మించారు. 'అల్లరి' నరేష్ కథానాయకుడిగా నటించిన 'ఉగ్రం' కూడా వాళ్లు ప్రొడ్యూస్ చేసిన సినిమాయే. 'భగవంత్‌ కేసరి' సినిమాతో సంయుక్త నిర్మాణానికి ముగింపు పలికారు. అది సంగతి!

Also Read : ఈ రోజు రాత్రి నుంచి 'మంగళవారం' సినిమా ప్రీమియర్లు - పాయల్ గ్లామర్ లుక్స్ చూశారా?

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ కూడా తొలుత ముగ్గురు నిర్మాతలతో ప్రారంభమైంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి,  చెరుకూరి మోహన్ సంయుక్తంగా కొన్ని చిత్రాలు నిర్మించారు. ఆ తర్వాత చెరుకూరి మోహన్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి బయటకు వచ్చారు. మరో ఇద్దరితో కలిసి నాని హీరోగా హాయ్ నాన్న ప్రొడ్యూస్ చేశారు.  ‌

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget