Nani Remuneration : రెమ్యూనరేషన్ బదులు సినిమా రిలీజ్ - రిస్క్ చేస్తున్న నాని?
Hi Nanna Movie Distribution : నాచురల్ స్టార్ నాని రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నారా? 'హాయ్ నాన్న' రిలీజ్ విషయంలో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారా? అంటే ఫిలింనగర్ వర్గాలు అవును అని అంటున్నాయి.
నాచురల్ స్టార్ నానిలో కథానాయకుడు మాత్రమే కాదు... నిర్మాత కూడా ఉన్నారు. డి ఫర్ దోపిడీ సినిమాకు ఆయన సమర్పకుడిగా వ్యవహరించారు. ఆ తరువాత 'ఆ', 'హిట్ : ది ఫస్ట్ కేస్', 'మీట్ క్యూట్', 'హిట్ : ది సెకండ్ కేస్' సినిమాలు నిర్మించారు. అయితే.. సొంత నిర్మాణ సంస్థలో ఇప్పటి వరకు నాని సినిమా చేయలేదు. తాను హీరోగా నటించిన సినిమా నిర్మాణ వ్యవహారాలలో ఇన్వాల్వ్ కాలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్... ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అంశాల్లో నాని ఇన్వాల్వ్ అవుతున్నారని ఫిలిం నగర్ టాక్. పూర్తి వివరాల్లోకి వెళితే...
'హాయ్ నాన్న' సినిమాకు నానికి 25 కోట్లు?
నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'హాయ్ నాన్న'. డిసెంబర్ 7న ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ డీల్స్ విషయంలో నాని ఇన్వాల్వ్ అయ్యారని టాలీవుడ్ టాక్. దీని వెనుక ఆయన రెమ్యూనరేషన్ ప్రధాన కారణమని వినబడుతుంది.
'హాయ్ నాన్న'కు గాను నానికి 25 కోట్ల రూపాయల పారితోషకం ఇచ్చేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. అయితే... సినిమా విడుదల దగ్గర పడుతున్నా హీరోకి ఇంకా ఫుల్ అమౌంట్ ఇవ్వలేదని ఇండస్ట్రీ గుసగుస. మొదట ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల చేయాలని భావించారు. ప్రభాస్ సలార్ డిసెంబర్ 22కి వస్తుండడంతో ముందుకు జరిపారు. నాని సినిమాతో పాటు డిసెంబర్ తొలి వారంలో మూడు నాలుగు సినిమాలు వస్తున్నాయి. థియేటర్లలో భారీ పోటీ నెలకొనడంతో ఎక్కువ రేట్లు పెట్టి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవడానికి బయ్యర్లు ఎవరు ముందుకు రావడం లేదట. దాంతో నాని రంగంలోకి దిగుతున్నారని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.
'హాయ్ నాన్న'ను డిస్ట్రిబ్యూట్ చేయనున్న నాని!?
డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోవడంతో తన రెమ్యూనరేషన్ బదులు కొన్ని ఏరియా థియేట్రికల్ రైట్స్ తీసుకోవడానికి నాని ముందుకు వచ్చారని తెలుస్తోంది. సినిమాను కొన్ని ఏరియాలలో ఆయనే విడుదల చేయనున్నారు. దీంతో ఆయన రిస్క్ చేస్తున్నారని కొందరు కామెంట్ చేస్తున్నప్పటికీ... సినిమాపై నమ్మకంతో హీరో ఇలా ముందుకు రావడం చాలా మంచి పరిణామం అని పరిశ్రమ వర్గాలలో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అగ్ర హీరోలు కొంతమంది తమ రెమ్యూనరేషన్ బదులు కొన్ని ఏరియాలో రైట్స్ తీసుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా కొంతమంది హీరోలు తమ రెమ్యూనరేషన్ బదులు నాన్ ధియేట్రికల్ రైట్స్ తీసుకుంటున్నారని టాక్. ఆ సాంప్రదాయానికి యంగ్ హీరోలలో నాని మళ్లీ తెర తీసినట్లు అయింది.
Also Read : ఒక్క ఛాన్స్ కోసం దర్శకుడి వెంటపడిన పాయల్
శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న 'హాయ్ నాన్న'లో నాని జోడీగా మృణాల్ ఠాకూర్ నటించారు. బేబీ కియారా ప్రధాన పాత్ర పోషించారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా ఈ సినిమా రూపొందుతోంది. చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హేషామ్ అబ్దుల్ వాహెబ్ సంగీతం అందించారు.
Also Read : సూర్య, రజనీకాంత్ రిజెక్ట్ చేసిన తర్వాత విక్రమ్ దగ్గరకు...