Bhagavanth Kesari : బాక్సాఫీస్ కా షేర్ బాలయ్య - ఈ వారమే 'భగవంత్ కేసరి' సెలబ్రేషన్స్
Bhagavanth Kesari Box Office Celebrations : గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ తాజా సినిమా 'భగవంత్ కేసరి' బాక్సాఫీస్ బరిలో మంచి వసూళ్లు సాధించింది. ఈ విజయాన్ని చిత్ర బృందం సెలబ్రేట్ చేయనుంది.
Bhagavath Kesari BOX OFFICE KA SHER CELEBRATIONS on NOV 9th : గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'భగవంత్ కేసరి'. విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది.
'భగవంత్ కేసరి' కోసం బాలకృష్ణ తన ఇమేజ్ పక్కన పెట్టారు. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తనకు వరుస విజయాలు అందించిన కామెడీ పక్కన పెట్టి... సమాజానికి మంచి సందేశం అందించే కథతో సినిమా తీశారు. ఆడ పిల్లను ఆడ పులిలా పెంచాలని చెప్పారు. సినిమాకు సర్వత్రా మంచి ప్రశంసలు లభించాయి. అంతే కాదు... బాక్సాఫీస్ బరిలో మంచి వసూళ్లు కూడా దక్కాయి. ఈ సందర్భంగా బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్ నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది.
నవంబర్ 9న హైదరాబాద్ సిటీలో...
Bhagavanth Kesari celebrations On Nov 9th : నవంబర్ 9న... అంటే ఈ గురువారం హైదరాబాద్ సిటీలోని జేఆర్సీ కన్వేషన్ సెంటర్ వేదికగా 'భగవంత్ కేసరి బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్' నిర్వహిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ సంస్థ పేర్కొంది.
Also Read : వైఎస్ జగన్ 'యాత్ర 2'లో సోనియా గాంధీ - ఫస్ట్ లుక్ వచ్చేసింది!
Get ready for a grand celebration like never before❤️🔥#BhagavanthKesari BOXOFFICE KA SHER CELEBRATIONS on NOV 9th at JRC Conventions, Hyderabad 💥#BlockbusterBhagavanthKesari 🔥#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @MsKajalAggarwal @MusicThaman @sahugarapati7… pic.twitter.com/gL3e7Y6So3
— Shine Screens (@Shine_Screens) November 7, 2023
మూడు వారాల్లో 139 కోట్ల రూపాయలు
సాధారణంగా తొలి వారంలో సినిమాలకు మంచి వసూళ్లు వస్తాయి. రెండు మూడు వారాల్లో కలెక్షన్స్ తగ్గుతాయి. అయితే... 'భగవంత్ కేసరి' కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. మూడు వారాల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 139.19 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది.
Also Read : ఆ పెళ్లి కొడుకు ఎవరో నాకూ చెప్పండయ్యా - అల్లు కామెంట్స్ వైరల్ కావడంతో హీరోయిన్ క్లారిటీ
The festival continues at the cinemas with #BhagavanthKesari💥
— Shine Screens (@Shine_Screens) November 6, 2023
From a ww theatrical business of 57.63cr To collecting a resounding share of 70.01CR and a Gross of 139.19CR worldwide 😎🔥#BlockbusterBhagavanthKesari is another remarkable film for everyone❤️🔥… pic.twitter.com/CAAOQjLEEy
అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. ఇంతకు ముందు 'మజిలీ' ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో యువ కథానాయిక శ్రీ లీల కీలక పాత్ర చేశారు. శ్రీ లీల అంటే డ్యాన్స్ కాదని, నటి అని నిరూపించుకున్నారు. బాలకృష్ణకు జోడిగా తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ నటించారు. క్యారెక్టర్ నిడివి తక్కువ అయినా సరే... సినిమా కథ నచ్చి ఆవిడ అంగీకరించారని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.
తమన్ నేపథ్య సంగీతం చిత్రానికి బలంగా నిలిచింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేశారు. ఆయనకు తొలి తెలుగు చిత్రమిది. శరత్ కుమార్ ఓ కీలక పాత్ర చేశారు. శ్రీ లీల తండ్రిగా కనిపించారు. ఇండియన్ బ్యూటీ పాలక్ లల్వానీకి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది.