అన్వేషించండి

Mrunal Thakur Marriage : ఆ పెళ్లి కొడుకు ఎవరో నాకూ చెప్పండయ్యా - అల్లు కామెంట్స్ వైరల్ కావడంతో హీరోయిన్ క్లారిటీ 

'సీతా రామం' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్. నాని 'హాయ్ నాన్నా'లో కూడా నటిస్తున్నారు. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు.

Mrunal Thakur reacts on marriage with Telugu Boy : 'సీతా రామం'తో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయిన ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). దుల్కర్ సల్మాన్ సరసన ఆమె నటనకు ప్రేక్షకులంతా ఫిదా అన్నారు. ఇప్పుడు కొత్తగా మృణాల్ ఠాకూర్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అది ఏమిటంటే... త్వరలో ఆమె పెళ్లి చేసుకోనుందని! అదీ తెలుగు అబ్బాయితో!

తెలుగింటి కోడలు కానున్న మృణాల్!?
మృణాల్ ఠాకూర్ తెలుగు ఇంటి కోడలు కానున్నారని నాలుగైదు రోజులుగా జోరుగా హుషారుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఆ మధ్య దుబాయ్ వేదికగా సైమా ఫిల్మ్ అవార్డుల వేడుక జరిగింది. అందులో అల్లు అరవింద్ చేతుల మీదుగా మృణాల్ ఠాకూర్ 'సీతా రామం' సినిమాకు గాను అవార్డు అందుకున్నారు. ఆ సమయంలో ఆయన ''తెలుగు ఇంటి కోడలు కావాలి'' అని ఆశీర్వదించారు. కొన్ని రోజుల క్రితం లావణ్యా త్రిపాఠిని కూడా ఆయన అదే విధంగా ఆశీర్వదించారు. దాంతో మృణాల్ తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఖాయమని ప్రచారం మొదలైంది. అదీ సంగతి!

సారీ... అది ఆశీర్వాదం మాత్రమే!
పెళ్లి కొడుకును మీరే వెతికి పెట్టండి!
తెలుగు అబ్బాయితో 'సీతా రామం' బ్యూటీ పెళ్లి అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయం మృణాల్ ఠాకూర్ వరకు చేరడంతో సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. 

''హాయ్... మీ మనసులకు గాయం చేస్తున్నందుకు సారీ! స్టయిలిష్ట్ డిజైనర్స్, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోనుల మీ ఫోనులు చేస్తున్నారు... నేను ఓ తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నానని తెలిసి! నాకూ తెలుసుకోవాలని ఉంది ఆ అబ్బాయి ఎవరో? నా పెళ్లి వార్త నిజం కాదు. నాకు ఆశీర్వాదం మాత్రమే లభించింది. వినడానికి ఈ పుకారు ఎంత ఫన్నీగా ఉందో చెప్పలేను. నవ్వు ఆపుకోలేకపోయా. త్వరలో పెళ్లి జరుగుతుంది. మీరే ఓ పెళ్లి కొడుకుని వెతికి పెట్టండి. అప్పుడు నాకు చెప్పండి. లొకేషన్ కూడా సెండ్ చేయండి'' అంటూ సరదాగా స్పందించారు మృణాల్ ఠాకూర్. 

Also Read : పెళ్లిలో లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీరపై ఏం రాసి ఉందో చూశారా?

'సీతా రామం' కంటే ముందు హిందీ, మరాఠీ భాషల్లో సినిమాలు చేశారు మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ సీరియళ్లలోనూ ఆమె నటించారు. అయితే... 'సీతా రామం'తో తెలుగులో ఆమెకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ఆమెతో నటించాలని చాలా మంది హీరోలు కోరుకుంటున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 'సీతా రామం' తర్వాత నేచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్నా'లోనూ, రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' సినిమాల్లో నటించే అవకాశాలు మృణాల్ ఠాకూర్ అందుకున్నారు.

Also Read మహేష్ బాబు సినిమాలో మసాలా బిర్యానీ - నెట్టింట 'గుంటూరు కారం' లీక్డ్ సాంగ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget