Chatrapathi: బెల్లంకొండ ‘ఛత్రపతి’ హిందీ టీజర్ వచ్చేసింది - మాటల్లేవ్, ఊరమాస్ అంతే!
హిందీ రిమేక్ 'ఛత్రపతి' టీజర్ రిలీజైంది.. మాస్ అండ్ యాక్షన్ యాక్టింగ్ తో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఫైట్స్ చేస్తూ టీజర్ లో అదరగొట్టాడు. లైట్స్, కెమెరా, టూ మచ్ యాక్షన్ పేరుతో ఈ వీడియో వైరల్ గా మారింది.
Chatrapathi : తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన 'ఛత్రపతి' సినిమాను హిందీలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రిమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అదే ఉత్సాహంతో మేకర్స్ తాజాగా మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ‘ఛత్రపతి’ సినిమా టీజర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా లైట్స్, కెమెరా, టూ మచ్ యాక్షన్ అనే క్యాప్షన్‌తో ఈ టీజర్‌ను పోస్ట్ చేశారు.
టాలీవుడ్ లో అనుకున్నంత రేంజ్ లో హిట్లు తన ఖాతాలో వేసుకోకపోయినా.. పలు సినిమాల ద్వారా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పుడు తాజాగా తెలుగు మూవీ ఛత్రపతికి హిందీలో రిమేక్ చేస్తూ వస్తోన్న మూవీలో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ఈ టీజర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ అదరగొట్టేశాడు. ఫైటింగ్స్, యాక్షన్ లాంటి సన్నివేశాల్లో తన విశ్వరూపం చూపించినట్టు తెలుస్తోంది.
తెలుగులో ప్రభాస్ ఎలాగైతే ప్రేక్షకులను కళ్లు తిప్పుకోకుండా చేశాడో.. అదే తరహాలో బెల్లంకొండ తన నటనతో ఆకట్టుకోగలడా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ‘ఛత్రపతి’ సినిమాతో పోల్చుకోకపోవడమే బెటర్. అయితే, ఈ ట్రైలర్ చూసిన బెల్లంకొండ ఫ్యాన్స్.. సూపర్ మాస్ అండ్ యాక్షన్ లిస్ట్ లో ది బెస్ట్ మూవీగా ఈ సినిమా నిలిచిపోతుందని ఫ్యాన్స్ విశ్వసిస్తు్న్నారు. అప్పట్లో తెలుగులో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అదే తరహాలో బెల్లంకొండకు ఈ సారి మంచి హిట్ ఖాయం అంటున్నారు.
View this post on Instagram
ఇక హిందీలో 'ఛత్రపతి' కోసం బెల్లంకొండ తన శరీరాకృతిని పూర్తిగా మార్చేశారు. తెలుగులో ప్రభాస్ ఏ విధంగా అయితే కండలతో, ఫిట్ గా కనిపించాడో అదే తరహాలో పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు వర్క్ చేసినట్టు సమాచారం. ఇక మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటీ అంటే ఈ మూవీలో హీరోయిన్ ఎవరన్న దానిపై మూవీ మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. టీజర్ లోనూ ఎక్కడా కూడా హీరోయిన్ ప్రస్తావన కనిపించలేదు. మరో ముఖ్య విషయమేమిటంటే ఈ టీజర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేయకముందే దసరా మూవీ సందర్భంగా థియేటర్లలో ప్లే చేసిన యాడ్ స్పేస్ లో ఈ మూవీ టీజర్ ను ప్లే చేశారు.
18ఏళ్ల కిందట టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన 'ఛత్రపతి' ఇప్పుడు హిందీలో రిమేక్ అవుతుండడంతో సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో హిందీలోకి అడుగుపెడుతుండడం మరో చెప్పుకోదగిన విషయం. అయితే ఈ మూవీని వేసవి కానుకగా మే 12న ప్రేక్షకుల ముందు తీసుకురానున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతి లాల్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.