Bedurulanka 2012 Movie : 'బెదురులంక' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు - కార్తికేయ ముందున్న కలెక్షన్స్ టార్గెట్ ఎంతంటే?
Bedurulanka 2012 Pre Release Business : కార్తికేయ హీరోగా నటించిన 'బెదురులంక 2012' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఏ ఏరియాను ఎన్ని కోట్లకు అమ్మారు? అనేది చూస్తే...
'బెదురులంక 2012' (Bedurulanka 2012) ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. యువ హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda), 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జోడీ చూడముచ్చటగా ఉందని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి ప్రశంసలు అందుకుంది. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఈ సినిమా ఎన్ని కోట్లకు అమ్మారు? ఎంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది? వంటి వివరాల్లోకి వెళితే...
నాలుగు కోట్లకు 'బెదురులంక'
Bedurulanka 2012 Worldwide Pre Release Business : 'బెదురులంక 2012' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ చూస్తే... సినిమా థియేట్రికల్ రైట్స్ నాలుగు కోట్ల రూపాయలకు ఇచ్చినట్లు తెలిసింది.
గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన 'బెదురులంక 2012'కు ఆంధ్రా ఏరియాలో మంచి రేటు పలికింది. ఏపీలో అన్ని ఏరియాలను కలిపి రూ. 1.75 కోట్లకు విక్రయించారు. నైజాం ఏరియా రైట్స్ రూ. 81 లక్షలు పలికితే... సీడెడ్ (రాయలసీమ) రైట్స్ రూ. 63 లక్షలకు ఇచ్చారు. రెస్టాఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ రైట్స్ ద్వారా నిర్మాతకు రూ. 81 లక్షలు వచ్చాయి. మొత్తం మీద నాలుగు కోట్లకు ఇచ్చారు. ఐదు కోట్లకు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళుతుంది. నాలుగున్నర కోట్లు కలెక్ట్ చేసినా చాలు... డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ!
'ఆర్ఎక్స్ 100' సెంటిమెంట్ కాదు గానీ!
'బెదురులంక 2012' సినిమాకు, కార్తికేయ సూపర్ డూపర్ హిట్ కల్ట్ క్లాసిక్ 'ఆర్ఎక్స్ 100' మధ్య రెండు సారూప్యతలు ఉన్నాయి. రెండు సినిమాల్లో హీరో పేరు శివ. ఈ రెండు సినిమాలు గోదావరి నేపథ్యంలో తెరకెక్కినవే. సెంటిమెంట్ అనుకుని అలా చేయలేదని, యాదృచ్చికంగా అలా కుదిరిందని హీరో కార్తికేయ తెలిపారు.
Also Read : విజయ్ దేవరకొండతో ఆ రెండూ మిస్ - 'ఖుషి' వాళ్ళ కాంబినేషన్‌లో మూడోది!
ఆగస్టు 25న 'బెదురులంక 2012' థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంతకు ముందు ఆయన సుధీర్ వర్మ, రామ్ గోపాల్ వర్మ దగ్గర పని చేశారు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా 'బెదురులంక 2012'ను తెరకెక్కించానని, అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఉంటుందని చెప్పారు.
Also Read : సగమే తీసుకున్న వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు - నిర్మాతకు లాభాలే ముఖ్యమంటూ
డిసెంబర్ 21, 2012న యుగాంతం వస్తుందని ప్రపంచమంతా చాలా భయపడింది. అయితే, ఆ రోజు యుగాంతం రాలేదు. ఏపీలోని లంక గ్రామాల్లో ఒకటైన బెదురులంకలో కొందరు కేటుగాళ్ళు మాత్రం ప్రజల్లో భక్తి, అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవాలని దేవుడి పేరుతో దోపిడీకి తెర తీశారు. ఆ కేటుగాళ్ళ మాటలు నమ్మని శివ (కార్తికేయ గుమ్మకొండ) ఏం చేశాడు? వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పాడు? అనేది సినిమా కథగా తెలుస్తోంది. కామెడీ, రొమాన్స్, యాక్షన్, డ్రామా... 'బెదురులంక 2012'లో ప్రేక్షకులు కోరుకునే అంశాలు అన్నీ ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial