News
News
వీడియోలు ఆటలు
X

'గురూజీకి కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే నిర్మాత అయిపోవచ్చు' - బండ్ల ట్వీట్ త్రివిక్రమ్‌ను ఉద్దేశించేనా?

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే బండ్ల గణేష్.. వివాదాస్పద ట్వీట్స్ తో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా 'గురూజీ' అంటూ చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. 

FOLLOW US: 
Share:

బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటుడుగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత కాలంగా ప్రొడ్యూసర్ గా అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల బండ్ల తన ట్వీట్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆయన, లేటెస్టుగా 'గురూజీ' అంటూ పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

తాజాగా బండ్ల గణేష్ గుడ్ మార్నింగ్ చెబుతూ ఓ కొటేషన్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ట్వీట్ కి ఓ నెటిజన్ స్పందిస్తూ, 'బండ్లన్న నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని వుంది' అని అడిగాడు. దీనికి బండ్ల గణేష్ రియాక్టు అవుతూ 'గురూజీని కలవండి.. ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వండి.. అప్పుడు అది నెరవేరుతుంది' అని ట్వీట్ చేశారు. ఈ సమాధానమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.  

ప్రస్తుతం టాలీవుడ్ లో 'గురూజీ' అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలోనూ త్రివిక్రమ్ కు గురూజీ అనే ఉపమానం వాడుతుంటారు. ఇప్పుడు బండ్ల గణేష్ ట్వీట్ లో గురూజీ అని ప్రస్తావించడంతో, అది త్రివిక్రమ్ ను ఉద్దేశిస్తూ పెట్టిందే అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనకి ఏదైనా ఖరీదైన గిఫ్ట్ ఇస్తే నిర్మాత అయిపోవచ్చని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారనీ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి ఒకప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ తో బండ్ల గణేష్ కు మంచి బాండింగ్ వుంది. వీరిద్దికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మంచి అనుబంధం కూడా ఉండేది. బండ్ల నిర్మించిన 'తీన్ మార్' చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. అయితే ఇటీవల కాలంలో వీరి మధ్య దూరం పెరిగిందనే టాక్ ఉంది. దీనికి తగ్గట్టుగానే 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో త్రివిక్రమ్ పై బండ్ల షాకింగ్ కామెంట్స్ చేసినట్లు ఓ ఆడియో లీక్ అయింది. 

అందులో త్రివిక్రమ్ ను బండ్ల గణేష్ అసభ్య పదజాలంతో దూషించినట్లు ఉంది. తనని ప్రీరిలీజ్ ఈవెంట్ కి రానివ్వకుండా త్రివిక్రమ్ అడ్డుపడుతున్నాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వినిపించింది. తనకు ఈవెంట్ కు రావాలని ఉందని.. స్పీచ్ కు రెడీ చేసుకున్నానని, ఆడిటోరియంలో అందరూ బండ్లన్న రావాలి అని గట్టిగా అరిస్తే అక్కడ ప్రత్యక్షమవుతానన్నారు. 

బండ్ల ఆడియో ఎంత వరకూ నిజం అనుకుంటుండగా, ఆయన భీమ్లా ఈవెంట్ లో కనిపించలేదు. దీంతో ఆ రూమర్స్ నిజమేనని అని ఫిక్స్ అయ్యారు. అందుకే ఇప్పుడు బండ్ల తాజా ట్వీట్ లో పేర్కొన్న 'గురూజీ' త్రివిక్రమ్ నే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం చేస్తున్న రీమేక్ సినిమా వ్యవహారాలన్నీ త్రివిక్రమ్ చూస్తున్నారనే పుకార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురూజీకి ఖరీదైన గిఫ్ట్ ఇస్తే నిర్మాత అయిపోవచ్చని బండ్ల ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

Read Also: ఇలా వచ్చాడో లేదో, అలా గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు - యంగ్ హీరోకు మహేష్ బాబు బంపర్ ఆఫర్!

Published at : 26 May 2023 12:17 PM (IST) Tags: Trivikram Guruji Bandla Ganesh Trivikram Srinivas Bandla Ganesh Tweet

సంబంధిత కథనాలు

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?