News
News
వీడియోలు ఆటలు
X

Mahesh Babu: ఇలా వచ్చాడో లేదో, అలా గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు - యంగ్ హీరోకు మహేష్ బాబు బంపర్ ఆఫర్!

'మేమ్ ఫేమస్' సినిమాతో రాబోతున్న సుమంత్ ప్రభాస్.. తన నెక్ట్ మూవీని కూడా చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్ లోనే చేయనున్నాడు. దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించనున్నారు.

FOLLOW US: 
Share:

'మేమ్ ఫేమస్' సినిమాతో హీరోగా బిగ్ స్క్రీన్ మీదకు వస్తున్నాడు సుమంత్ ప్రభాస్. ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించడమే కాదు, దర్శకుడిగా కూడా పరిచయం అవుతున్నాడు. ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిలో పడ్డ ఈ కుర్రాడు.. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వకముందే, GMB ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసాడు. ఈ విషయాన్ని మహేశే స్వయంగా ట్వీట్ చేయడం విశేషం. 

'మేమ్ ఫేమస్‌' సినిమా చూసిన మహేష్ బాబు, అదొక బ్రిలియంట్ మూవీ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పెర్ఫామెన్స్‌ తో సినిమాను నిలబెట్టారంటూ, హీరో కమ్ డైరెక్టర్ సుమంత్ ప్రభాస్‌ ను స్పెషల్ గా అప్రిషియేట్ చేశారు సూపర్ స్టార్. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సహా అన్ని క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్‌ గా కుదిరాయని.. కొత్తవాళ్లతో ఇంత అద్భుతంగా సినిమా తీయడాన్ని నమ్మకలేకపోతున్నానన్నారు. నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డికి అభినందనలు తెలియజేసిన మహేష్.. ఇలాంటి టాలెంట్‌ ను పరిచయం చేసినందుకు గర్వంగా ఉంది అని అన్నారు. 

మహేష్ ట్వీట్ కు శరత్ చంద్ర స్పందిస్తూ.. ''సార్, బిగ్ థ్యాంక్స్. మీరు మా చిత్రాన్ని చూసినందుకు, అది మీకు నచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము. దీనికి మీకు కృతజ్ఞతలు. సుమంత్ ప్రభాస్ తో మా తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాం. ఇది అద్భుతంగా ఉంటుంది. దీన్ని GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ లో ప్రొడ్యూస్ చేయగలిగితే అది ఒక గొప్ప కీర్తిగా భావిస్తాం సార్. మీతో మళ్లీ కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ అవుతుంది'' అని పేర్కొన్నారు. దీన్ని మహేష్ బాబు రీట్వీట్ చేస్తూ, ''ఓకే డన్ శరత్.. ఈ యంగ్ టాలెంట్‌ కి GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంటుంది'' అని అన్నారు. మహేష్ గతంలో ఛాయ్ బిస్కెట్ టీమ్ తో కలిసి 'మేజర్' మూవీ నిర్మించిన సంగతి తెలిసిందే.

Read Also: 'మేమ్ ఫేమస్' అద్భుతమైన సినిమా - ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన మహేష్ బాబు!

సూపర్‌ స్టార్‌ ట్వీట్‌ తో సుమంత్ ప్రభాస్ ఉబ్బితబ్బై పోతున్నాడు. 'మేమ్ ఫేమస్' సినిమాకు ప్రశంసలు అందించడమే కాదు, తనను ప్రత్యేకంగా మెచ్చుకోవడంతో గాల్లో తేలిపోతున్నాడు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో పెద్ద నోట్ రాసుకొచ్చాడు. ''అన్నా.. మీరు సినిమా చూసేందుకు టైమ్ ఇవ్వడం, సినిమా చూసి ట్వీట్ చేయడం నిజంగా నమ్మలేకపోతున్నా. ఇప్పుడు నిజంగా ఫేమస్ అయినట్టు అనిపిస్తోంది అన్నా. ఇంట్లో మహేష్ బాబు అన్న సినిమా వస్తే మిస్ అవ్వకుండా చూసే మా అమ్మ ,ఇవ్వాళ మా కొడుకు ఫస్ట్ మూవీ చూసి సపోర్ట్ చేయడమే కాకుండా, సెకండ్ సినిమా ప్రొడ్యూస్ చేస్తా అంటుంటే మనస్ఫూర్తిగా మటన్ వండి పంపియ్యాలి అని ఫోన్ చేస్తుంది. అసలే ఈ ఏజ్‌ లో నాకొచ్చిన హ్యాపీనెస్ ఎక్స్‌ ప్రెస్ చేయనీకి ఎస్సేలు రాసినా తక్కువే అనిపిస్తోంది. థాంక్యూ సో.. మచ్ అన్న. మా లాంటి యూత్‌ ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఖచ్చితంగా అనురాగ్ అన్న, శరత్ అన్న వాళ్లతో వచ్చి మీకు మజా అనిపించే స్క్రిప్ట్ నెరేషన్ ఇస్తాం అన్నా. మా మీద ఉన్న మీ నమ్మకం అసలు పోగొట్టం'' అంటూ సుమంత్ తన నోట్ లో రాసుకొచ్చాడు. 

కాగా, తెలంగాణ విలేజ్ బ్యాక్‌ డ్రాప్‌ లో హిలేరియస్‌ ఫన్‌ ఎంటర్టైనర్ గా 'మేమ్ ఫేమస్' తెరకెక్కింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభించింది. చాయ్ బిస్కెట్ ఫిలింస్ & లహరి ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని రేపు (మే 26) ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చిత్రం ఏమిటంటే సుమంత్ ప్రభాస్.. హీరో ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్. ఇటీవల ప్రమోషన్స్‌లో కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. తన పేరు చివర ప్రభాస్‌ను పెట్టుకోడానికి కారణం అదేనని తెలిపాడు. దీంతో మహేష్ బాబు ఇచ్చిన ఆఫర్‌పై ఆయన అభిమానులు అంత హ్యాపీగా లేరు. అంత ఈజీగా మాట ఇచ్చేశావ్ ఏంటన్నా.. అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

Read Also: శరత్ బాబు ఆస్తులకు వారసులు ఎవరు? వీలునామాలో ఏం రాశారు?

Published at : 25 May 2023 06:09 PM (IST) Tags: Superstar Mahesh Babu SSMB28 GMB Entertainments Sumanth Prabhas mem famous

సంబంధిత కథనాలు

Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?

Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?

అఖిల్‌‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!

అఖిల్‌‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

The Kerala Story: కమల్‌ హాసన్‌ కామెంట్స్‌కు ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ కౌంటర్

The Kerala Story: కమల్‌ హాసన్‌ కామెంట్స్‌కు ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ కౌంటర్

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

టాప్ స్టోరీస్

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12

GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12

NSC: మీకు ₹72 లక్షలు కావాలా? ఈ పోస్టాఫీస్‌ పథకం ఇస్తుంది!

NSC: మీకు ₹72 లక్షలు కావాలా? ఈ పోస్టాఫీస్‌ పథకం ఇస్తుంది!