అన్వేషించండి

Balakrishna : హేమ మాలిని కాళ్లు మొక్కిన బాలయ్య - మా హీరో బంగారం అంటూ నెటిజన్లు ఫిదా

Balakrishna IFFD 2026 : ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో హీరో బాలకృష్ణ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మా బాలయ్య బంగారం అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తున్నారు.

Balakrishna Touches Hema Malini Feet : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ అంతర్జాతీయ ఢిల్లీ చలన చిత్రోత్సవంలో 2026 (IFFD 2026)లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆయన బాలీవుడ్ నటి హేమ మాలిని పాదాలకు నమస్కరించారు.

అవార్డు స్వీకరించిన తర్వాత రెడ్ కార్పెట్‌పై బాలకృష్ణ ఉండగా... హేమ మాలిని అక్కడకు వచ్చారు. ఆమెను నవ్వుతూ పలకరించిన ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె వెంటనే ఆప్యాయంగా ఆయనతో కరచాలనం చేసి ఫోటోలు దిగారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

నెటిజన్లు ఫిదా

గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో బాలయ్య తల్లిగా హేమ మాలిని నటించారు. ఆమె పట్ల గౌరవం, భక్తితో బాలయ్య చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్టార్ హీరో అయి కూడా ఎంతో గౌరవంతో హేమ మాలిని కాలికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారని... ఇదీ బాలయ్య అంటే అంటూ రియాక్ట్ అవుతున్నారు. 'మా బాలయ్య మనసు బంగారం', పెద్దల పట్ల ఆయన ఎప్పుడూ గౌరవంతో ఉంటారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : మెగాస్టార్ నాకు అన్నయ్యే - పవన్ భార్య అన్నా లెజినోవా పోస్ట్... ఒక్క రోజులోనే ఫాలోవర్స్ ఎంతమందంటే?

మరో అరుదైన గౌరవం

ఢిల్లీ వేదికగా జరిగిన 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ (IFFD 2026)' వేడుకల్లో బాలయ్య సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా ప్రతిష్టాత్మక లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా సినీ రంగానికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తించి నిర్వాహకులు ఈ అవార్డుతో గౌరవించారు. ఆయనకు ఈ పురస్కారం దక్కడంపై టాలీవుడ్ సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో హేమ మాలిని, కంగనా రనౌత్, విక్కీ కౌశల్, అర్జున్ కపూర్, అనుపమ్ ఖేర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలు ఈ నెల 31 వరకూ జరగనున్నాయి.

అమ్మానాన్నల ఆశీర్వాదంతోనే...

అమ్మానాన్నల ఆశీర్వాదంతోనే తాను 50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నట్లు చెప్పారు బాలయ్య. 'మహిళా సాధికారత గురించి మా నాన్న ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. సినిమాలు, రాజకీయాల్లోనూ మహిళల సాధికారత గురించి పాటుపడిన మా నాన్న వారసత్వాన్ని, ఆయన ఆశయాల్ని మేము కొనసాగిస్తాం. అంతర్జాతీయ ఢిల్లీ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనడం, అవార్డు స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది.' అని అన్నారు.

ఈ చలన చిత్రోత్సవాల్లో బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా ప్రదర్శించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి ఇందులో పాల్గొన్నారు. సినిమాలో బాలయ్య చెప్పిన సందేశం అందరికీ చేరువైందని... గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అందరిలోనూ అవగాహన కల్పించింది ఈ మూవీ అని అన్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Embed widget