అన్వేషించండి

Akhanda 2 Release Date : 'అఖండ 2' రిలీజ్‌పై వీడని సస్పెన్స్! - ప్రాబ్లమ్ ఇంకా సాల్వ్ కాలేదా?... ఆ తేదీల్లో రిలీజ్ కోసం ఫ్యాన్స్ డిమాండ్

Akhanda 2 Buyers Meeting : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య 'అఖండ 2' రిలీజ్‌పై సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఆదివారం ఫైనాన్షియల్ ఇష్యూస్ పరిష్కారంపై చర్చలు జరిగినా ఫలితం లేకపోయినట్లు తెలుస్తోంది.

Akhanda 2 Buyers Meeting About Movie Release Date : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'అఖండ 2' కోసం ఫ్యాన్స్‌తో మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన మూవీ ఫైనాన్షియల్ ఇష్యూస్‌తో విడుదల వాయిదా పడింది. సమస్య పరిష్కరించేందుకు ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖ నిర్మాతలు రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది.

అసలు రిలీజ్ ఎప్పుడు?

'అఖండ 2' రిలీజ్ సమస్యను పరిష్కరించుకునేందుకు ఆదివారం చిత్ర నిర్మాణ సంస్థ... బయ్యర్లతో సమావేశమైనట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. పలు దఫాలుగా చర్చలు జరిగినా ఇంకా సమస్య కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్యతో పాటు డైరెక్టర్ బోయపాటి శ్రీను లోకల్ ఫైనాన్షియర్స్‌కు సెటిల్ చేసేందుకు తమ రెమ్యునరేషన్‌లో కొంత వదులుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయినా కూడా ఇంకా పూర్తి లెక్క తేలలేదని సమాచారం. దీంతో మూవీ రిలీజ్ ఎప్పుడనే సస్పెన్స్ నెలకొంది.

ఫ్యాన్స్ డిమాండ్... పైనల్ డేట్స్

'అఖండ 2'ను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 12న శుక్రవారం రిలీజ్ చేస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరు క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న విడుదల చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ 2 తేదీలే ఫైనల్ అని... చర్చల అనంతరం ఏదో ఒక తేదీ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారనే ప్రచారమూ సాగుతుంది. వీటికి చెక్ పడాలంటే చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అఫీషియల్‌గా రియాక్ట్ కావాల్సి ఉంది.

Also Read : ఆ రూంలో ఆత్మను చూశాను - నేను చాలా సెన్సిటివ్... ఇంటర్వ్యూలో బేబమ్మ కన్నీళ్లు

అసలు సమస్య ఏంటంటే?

'అఖండ 2' మూవీ తీసిన 14 రీల్స్ ప్లస్ సంస్థకు, ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు మధ్య గత సినిమాల డబ్బులకు సంబంధించి ఎరోస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. 14 రీల్స్, 14 రీల్స్ ప్లస్ వేరని వాదించినా ఆ రెండూ ఒకటేనని... తమకు రూ.28 కోట్లు చెల్లించేలా ఆదేశించాలంటూ అభ్యర్థించింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఎరోస్‌కు అనుకూలంగా తీర్పునిస్తూ 'అఖండ 2' రిలీజ్‌పై స్టే విధించింది. 

స్థానికంగా ఫైనాన్షియర్స్ సైతం దీనిపై ఒత్తిడి తెచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తొలుత ప్రీమియర్స్ రద్దు చేయగా... ఆ తర్వాత మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు 14 రీల్స్ ప్లస్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అవుటాఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అవుతుందని అందరూ భావించినా అది సాధ్యం కాలేదు. మూవీ రిలీజ్ ఆగిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో సమస్య పరిష్కరించేందుకు పలువురు ఇండస్ట్రీ పెద్దలు, నిర్మాతలు రంగంలోకి దిగారు. సమావేశాల్లో చర్చలు జరిపినా ఫలితం లేకపోయినట్లు తెలుస్తోంది. రూ.28 కోట్లు ఆరేళ్ల వడ్డీతో కలిపి ఓ చిన్న సినిమా బడ్జెట్ అంతా చెల్లించాలని... అందుకే సమస్య సాల్వ్ కావడం లేదనే వాదనా వినిపిస్తోంది. అసలుతో పాటు 50 శాతం వడ్డీ చెల్లింపుల కోసం ఎరోస్ పట్టుబట్టినట్లు సమాచారం. త్వరలోనే మూవీ రిలీజ్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Objection My Lord Series Trailer : మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ - అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ శ్రీకాంత్... స్పెషాలిటీ ఏంటంటే?
మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ - అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ శ్రీకాంత్... స్పెషాలిటీ ఏంటంటే?
Jana Nayakudu Review - 'జన నాయకుడు' రివ్యూ: 'భగవంత్ కేసరి' రీమేకేనా? విజయ్ సినిమా ఎలా ఉందంటే?
'జన నాయకుడు' రివ్యూ: 'భగవంత్ కేసరి' రీమేకేనా? విజయ్ సినిమా ఎలా ఉందంటే?
Jana Nayagan Live Updates - 'జన నాయకుడు' లైవ్ అప్డేట్స్: సీన్ టు సీన్... విజయ్ సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
'జన నాయకుడు' లైవ్ అప్డేట్స్: సీన్ టు సీన్... విజయ్ సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి

వీడియోలు

Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
Embed widget