Attitude Star Chandrahass: 'రామ్ నగర్ బన్నీ'గా యాటిట్యూడ్ స్టార్... టైటిల్‌లో అల్లు అర్జున్, సినిమాలో పవన్!
Ramnagar Bunny Movie: నటుడు ప్రభాకర్ తనయుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా రూపొందుతున్న సినిమాకు 'రామ్ నగర్ బన్నీ' టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.
తొలి సినిమా విడుదలకు ముందు 'యాటిట్యూడ్ స్టార్' లాంటి బిరుదు రావడం బహుశా ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ విషయంలో జరిగింది ఏమో!? సినిమా ప్రకటనతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. చంద్రహాస్ హీరోగా తల్లిదండ్రులు మలయజ, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్న సినిమాకు 'రామ్ నగర్ బన్నీ' టైటిల్ ఖరారు చేశారు. ఈ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో మూవీ గ్లింప్స్ విడుదల చేశారు.
బ్యాగ్రౌండ్ అంతా పవన్ కల్యాణ్ కటౌట్స్!
'రామ్ నగర్ బన్నీ'... టైటిల్‌లో అల్లు అర్జున్ ముద్దు పేరు వాడారు. సినిమా గ్లింప్స్ చూస్తే పవన్ కల్యాణ్ కటౌట్స్ వాడారు. హీరో ఫైట్ చేసేటప్పుడు... వెనుక 'హరి హర వీరమల్లు', 'అజ్ఞాతవాసి', 'భీమ్లా నాయక్' సినిమాల్లో స్టిల్స్ కనిపించాయి. ఇదొక హీరోయిజం బేస్డ్ మాస్ కమర్షియల్ సినిమా అని 37 సెకన్స్ విజువల్స్ చూస్తే ఈజీగా అర్థం అవుతుంది.
'రామ్ నగర్ బన్నీ' సినిమాలో విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర... నలుగురు అమ్మాయిలు హీరోయిన్లుగా నటించారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు హీరో చంద్రహాస్.
Also Read: 'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'
గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ... ''మా అమ్మాయి, చంద్రహాస్ క్లాస్‌మేట్స్. నాకు ప్రభాకర్ సుపరిచితులు. తెలంగాణలో వరద బాధితులను చంద్రహాస్ సాయం అందించడం సంతోషంగా ఉంది. ఆయన లుక్స్ బాగున్నాయి. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా'' అని అన్నారు. 'యాటిట్యూడ్ స్టార్' చంద్రహాస్ మాట్లాడుతూ... ''మేం రెండేళ్ల క్రితం సినిమా అనౌన్స్ చేసినప్పుడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడని కామెంట్స్ చేశారు. నేను బయట ఒకేలా, ఇంట్లో మరోలా ఉండను. మనసులో ఉన్నది చూపిస్తా. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలని హీరోగా మారా. నా తల్లిదండ్రులు ఎంతో మద్దతు చేశారు. మా నాన్నగారు ప్రభాకర్ పేరు నిలబెట్టేలా కష్టపడతా. నా తొలి సినిమాగా 'రామ్ నగర్ బన్నీ'ను తీసుకొస్తా. ఏ భాషలో విడుదల చేసినా హిట్టయ్యే సినిమా, కనెక్ట్ అయ్యే సినిమా. ఈ సినిమాకు వచ్చే వసూళ్ళలో 10 శాతం వరద బాధితులకు సాయంగా అందిస్తా'' అని చెప్పారు.
Also Read: 'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'
Ramnagar Bunny Movie Cast And Crew: చంద్రహాస్ కథానాయకుడిగా విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర కథానాయికలుగా రూపొందుతున్న ఈ సినిమాలో మురళీధర్, సలీమ్ ఫేకు, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృషికేష్ గజగౌరి ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళ: రాజశేఖర్, కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్, ఛాయాగ్రహణం: అష్కర్ అలీ, సంగీతం: అశ్విన్ హేమంత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్, సమర్పణ: దివిజ ప్రభాకర్, నిర్మాతలు: మలయజ ప్రభాకర్ - ప్రభాకర్ పొడకండ, రచన - దర్శకత్వం: శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్).