Barabar Premistha: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాస్ జాతర - దిల్ రాజు చేతుల మీదుగా 'బరాబర్ ప్రేమిస్తా' నుంచి 'రెడ్డి మామ' సాంగ్ రిలీజ్
Chandrahas: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'బరాబర్ ప్రేమిస్తా'. ఈ మూవీ నుంచి మాస్ సాంగ్ 'రెడ్డి మామ'ను తాజాగా నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు.

Chandrahas's Barabar Premistha Movie Reddy Mama Song Released: బుల్లితెర స్టార్ ప్రభాకర్ కొడుకు, ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'బరాబర్ ప్రేమిస్తా'. తాజాగా ఈ మూవీలోని 'రెడ్డి మామ' మాస్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ పాటను సురేష్ గంగుల రచించగా.. నకాష్ అజిజ్, సాహితి చాగంటి పాడారు. హుషారెత్తించే పాటకు ఆర్ఆర్ ధృవణ్ మంచి ఊపున్న బీట్‌ను అందించారు. ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్‌గా ఈ పాట ఉందని.. చిత్ర యూనిట్‌కు దిల్ రాజు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మూవీకి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తుండగా.. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సీసీ క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ నిర్మిస్తున్నారు.

మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. మూవీలో మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లు అంచనాలు పెంచేశాయి.
Also Read: మరో ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ - నరమాంస భక్షకులు తిరిగొస్తే వినాశనమేగా.. ఏ ఓటీటీలోనో తెలుసా?
బుల్లితెర మెగాస్టార్‌గా ప్రభాకర్ ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు ఆయన కొడుకు చంద్రహాస్‌ను హీరోగా పరిచయం చేశారు. అంతకు ముందు నాటు నాటు పాటకు కవర్ సాంగ్ చేసి యూట్యూబ్ ద్వారా పాపులర్ అయ్యారు. అయితే, చంద్రహాస్‌ను హీరోగా పరిచయం చేసిన రోజు నుంచే అతనిపై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. దీనికి కారణం ప్రెస్ మీట్‌లో ఆయన చూపించిన యాటిట్యూడే. అతను మాట్లాడే విధానం, నిలబడే స్టైల్, ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ చూసిన నెటిజన్లు రాత్రికి రాత్రే అతన్ని యాటిట్యూడ్ స్టార్ అంటూ విపరీతమైన ట్రోలింగ్ చేశారు. దీంతో తనపై వచ్చిన ట్రోలింగ్స్‌నే బలంగా మార్చుకున్నారు. పలు టీవీ షోల్లో తన పెర్ఫార్మెన్స్‌తో అలరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read: మూవీ లవర్స్‌కు ఈ సమ్మర్ సినిమాల పండుగే - ఆ ఓటీటీల్లోకి బ్లాక్ బస్టర్ మూవీస్, సిరీస్‌లు





















