అన్వేషించండి

Ashwin Babu: అశ్విన్ బాబు కొత్త మూవీ టైటిల్ అదుర్స్ - మరో ‘హను మాన్’ అవుతుందా?

అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త మూవీ టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ మూవీకి ‘శివం భజే’ టైటిల్‌ను ఖరారు చేశారు.

బుల్లితెర యాంకర్, దర్శకుడు ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా మరో కొత్త మూవీ సిద్ధమవుతోంది. సోమవారం ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ మూవీకి ‘శివం భజే’ టైటిల్‌ను ఖరారు చేశారు. పోస్టర్‌‌ను చూస్తే.. ఇది కూడా ‘హను మాన్’ మూవీ జోనర్‌లో ఉండవచ్చని తెలుస్తోంది. ఇందులో శివుడి నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బజ్ ఖాన్ కూడా నటిస్తున్నాడు. దిగంగన సూర్యవంశీ ఈ మూవీతో హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. 

అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని గంగా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి నిర్మిస్తున్నారు. వికాశ్ బదిశా సంగీతం అందిస్తున్నాడు. ‘హను మాన్’ ఫేమ్ దాశరధి శివేంద్ర ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం. యాక్షన్, ఎమోషన్, థ్రిల్, ఎంటర్‌టైన్మెంట్.. ఇలా అన్నిరకాలుగా తమ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందని, దర్శకుడు అప్సర్ ఇన్నేవేటివ్ స్టోరీలైన్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని నిర్మాత మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ మూవీలో ఇంకా హైపర్ ఆది, సాయి ధినా తదితరులు నటిస్తున్నారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashwin babu (@actorashwin)

అశ్విన్ బాబు నటించిన ‘హిడింబ’ మూవీ థియేటర్‌లో పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అయితే, ఓటీటీలో మాత్రం దూసుకెళ్లింది. అశ్విన్ కూడా ఈ మూవీలో తన నటనకు మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో ఫుల్‌టైమ్ హీరోగా సెటిల్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు. కథలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. ఇటీవల అశ్విన్ తన 8వ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. ఆ మూవీకి ‘వచ్చినవాడు గౌతం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చేతిలో స్టెతస్కోప్‌తో రక్తంతో ఉన్న ఈ ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే ‘వచ్చినవాడు గౌతం’ చిత్రం మెడికో థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని అర్థమవుతోంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం అశ్విన్ ఫిజికల్ ట్రాన్ఫర్మేషన్‌కు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

యాంకర్ ఓంకార్ సోదరుడిగా సినిమాల్లోకి వచ్చిన అశ్విన్ బాబుకు ‘శివం భజే’ 9వ చిత్రం. ‘వచ్చినవాడు గౌతమ్’ 8వ చిత్రం. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దీంతో ‘శివం భజే’ మూవీకి ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. అశ్విన్.. 2012లో ‘జీనియస్’ మూవీ ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘జత కలిసే’, ‘రాజుగారి గది’, ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’, ‘రాజుగారి గది 2’, ‘రాజు గారి గది 3’, ‘హిడింబ’ మూవీస్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరి, ‘వచ్చినవాడు గౌతమ్’, ‘శివం భజే’ మూవీస్ అశ్విన్ బాబు కెరీర్‌ను ఏ విధంగా మారుస్తాయో చూడాలి. 

Also Readక్రిస్టోఫర్ నోలన్‌కు ఫస్ట్ ఆస్కార్, ఏడు అవార్డులతో సత్తా చాటిన 'ఓపెన్ హైమర్' - 2024లో విజేతలు వీరే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget