Chaithra Rai In NTR 30 : ఎన్టీఆర్ 30లో 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్ హీరోయిన్ చైత్ర - రోల్ ఏంటంటే?
Jr NTR 30 Movie Updates : 'అష్టా చమ్మా' సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైన నటి చైత్ర రాయ్. ఇప్పుడు 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది.
చైత్ర రాయ్ (Chaithra Rai)... బహుశా వెండితెర ప్రేక్షకులకు ఈ పేరు కొత్త ఏమో!? కానీ, తెలుగు & కన్నడ బుల్లితెర వీక్షకులకు సుపరిచితమే. కన్నడ సీరియళ్లతో కెరీర్ ఆరంభించిన చైత్రకు తెలుగులో 'అష్టా చమ్మా' తొలి సీరియల్. ఆ తర్వాత 'దటీజ్ మహాలక్ష్మి', 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు' చేశారు. ఇప్పుడు 'జీ తెలుగు'లో ప్రసారం అవుతున్న 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈమె గురించి ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు అంటే...
ఎన్టీఆర్ 30లో చైత్ర రాయ్!
Chaithara Rai In NTR 30 : ఇన్నాళ్లూ బుల్లితెరపై అలరించిన చైత్ర రాయ్, ఇప్పుడు వెండితెర అవకాశాన్ని అందుకున్నారు. అదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకున్నారు.
Chaithra Rai plays Saif Ali Khan Wife : అవును... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చైత్ర రాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు భార్య పాత్ర పోషించే అవకాశం చైత్ర రాయ్ అందుకున్నారు. ఆల్రెడీ చిత్రీకరణలో పాల్గొన్నారు కూడా!
''ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్... ఇద్దరూ పెద్ద స్టార్లు! వాళ్ళను సిల్వర్ స్క్రీన్ మీద చూడటమే కానీ నేరుగా కలిసింది లేదు. తొలిసారి వాళ్ళను చూడగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇద్దరు గొప్ప స్టార్లతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. నాకు ఇదొక వరం. నేను ఇంకా మేఘాల్లో తేలుతున్నాను'' అని ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైత్ర రాయ్ పేర్కొన్నారు. సైఫ్ భార్య పాత్రలో నటిస్తున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.
Also Read : ఉత్తమ రౌడీ కాదు, ఉత్తమ వెన్నుపోటు దారుడు, గురికాడు అవార్డులు ఇవ్వాలి - పోసాని కౌంటర్
రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ 30!
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎన్టీఆర్, సైఫ్, మరికొంత మంది ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.
ఎన్టీఆర్ జోడిగా జాన్వీ కపూర్!
ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. మరాఠీ సూపర్ హిట్ సినిమా 'సైరాట్' హిందీ రీమేక్ 'ధాకడ్'తో హిందీ చిత్రసీమకు కథానాయికగా పరిచయమైన జాన్వీ కపూర్... సుమారు అర డజను సినిమాలు చేశారు. అయితే తెలుగులో ఇప్పటి వరకు నటించలేదు. ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో హిందీ ప్రేక్షకులనూ ఆమె పలకరించనున్నారు.
ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా వీఎఫ్ఎక్స్, స్టంట్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు.