By: ABP Desam | Updated at : 02 Jul 2022 03:04 PM (IST)
'సీతా రామం'లో మృణాల్ ఠాకూర్
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కథానాయకుడిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్న చిత్రం 'సీతా రామం'. యుద్ధంతో రాసిన ప్రేమకథ... అనేది ఉపశీర్షిక. ఇందులోని సెకండ్ సాంగ్ ప్రోమో ఈ రోజు విడుదల చేశారు. ఇది మృణాల్ ఠాకూర్ మీద తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది.
'సీతా రామం' సెకండ్ సాంగ్ (Sita Ramam Second Lyrical) ప్రోమోకి వస్తే... మంచు కొండల మధ్యలో ముత్యంలా మెరుస్తున్న మృణాల్ ఠాకూర్‌ను చూపించారు. ఈ సినిమాలో ఆమె సీత పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ''మా సీత అంత అందంగా సినిమాలో రెండో పాట ఉంటుంది'' అని చిత్ర బృందం తెలిపింది.
'అందాల రాక్షసి', 'పడి పడి లేచె మనసు' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రమిది. రష్మికా మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read : 'పీకే'లో రేడియోతో ఆమిర్ - 'లైగర్'లో రోజా పూల బొకేతో విజయ్ దేవరకొండ
'సీతా రామం' సినిమాను ఆగస్టు 5న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు.
Also Read : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...
Kushi OTT Release Date: 'ఖుషి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!
చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన 'గేమ్ ఛేంజర్' షూటింగ్ - ఎందుకో తెలుసా..?
‘సలార్’ రిలీజ్ డేట్ రూమర్స్, షారుక్, సల్మాన్‌లపై రామ్ కామెంట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!
Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్
Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్
ABP-CVoter Snap Poll: మహిళా రిజర్వేషన్లపై సామాన్యుల రియాక్షన్ ఇదే- ఏబీపీ సీఓటర్ సర్వే ఫలితాలు
iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?
/body>