Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
Anushka Shetty Ghaati: అనుష్క శెట్టి 'ఘాటి ' మూవీ నుంచి ఆమె పుట్టినరోజు సందర్భంగా గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఆ గ్లిమ్స్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Anushka Shetty Ghaati Glimpse: సౌత్ మూవీ లవర్స్ స్వీటీ అని ముద్దుగా పిలుచుకునే స్టార్ హీరోయిన్ అనుష్క ఎట్టకేలకు 'ఘాటి' మూవీ ఫస్ట్ లుక్ తో దర్శనమిచ్చింది. నేడు అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న ఈ సినిమా నుంచి వరుస సర్ప్రైజ్ లు ప్లాన్ చేశారు మేకర్స్. అందులో భాగంగా ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా, తాజాగా గ్లిమ్స్ ను కూడా వదిలారు. మరి ఆ గ్లిమ్స్ లో ఉన్న విశేషాలు ఏంటో చూసేద్దాం పదండి.
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా తర్వాత తెరమరుగైన అనుష్క దర్శనం కోసం అభిమానులు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. అసలు అనుష్క ఉందా లేదా అన్నంత సైలెంట్ గా, లైమ్ లైట్ కి పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చింది ఇప్పటిదాకా అనుష్క. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు సినిమాలలో నటిస్తోంది. అందులో 'ఘాటి' మూవీ కూడా ఒకటి. 'వేదం' తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క నటిస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి ఈ మూవీని నిర్మిస్తుండగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అనుష్క చేస్తున్న నాలుగవ సినిమా ఇది.
నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు కానుకగా ఆమె బర్త్ డేను సెలబ్రేట్ చేస్తూ మేకర్స్ 'ఘాటి' మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అందులో ఆమె స్టన్నింగ్ అండ్ రూత్ లెస్ అవతార్ లో అద్భుతంగా కనిపిస్తోంది. పోస్టర్లో చేతులు, తల నుంచి రక్తం కారుతున్నట్టుగా కనిపించగా, నుదుటిపై బిందితో, బంగా స్మోక్ చేస్తూ సరికొత్త లుక్ తో అదరగొట్టింది. అలాగే కళ్ళల్లో నీళ్లు, ఆమె చూపులు పాత్రలోని ఇంటెన్స్ ని తెలియజేస్తున్నాయి. ఫస్ట్ లుక్ చూసాక సినిమాలో అనుష్క పాత్ర ఎలా ఉండబోతోంది అని క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే అనుష్క పుట్టినరోజు కానుకగా మరో ట్రీట్ ఇవ్వడానికి 'ఘాటి' మేకర్స్ రెడీ అయ్యారు. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు.
గ్లిమ్స్ లో ఉన్న యాక్షన్స్ సన్నివేశాలు ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే విధంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అనుష్క అవతారం, ఓ వ్యక్తి పీక కోసే సన్నివేశాలు, గ్లిమ్స్ చివర్లో ఆమె బంగా తాగే సీన్స్ చూస్తుంటే ఈసారి అనుష్క పక్కా అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనతో ఇన్ని రోజులలూ తనను మిస్ అయిన అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వబోతుందని అనిపిస్తోంది. అలాగే ఈ చిన్న టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. కానీ అందులో చిన్న డైలాగ్ కూడా లేకపోవడం స్వీటీ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసింది.
Prepare for the mighty queen’s rightful return to power and her reign over the #GHAATI ❤🔥#GhaatiGlimpse out now 💥💥
— UV Creations (@UV_Creations) November 7, 2024
▶️ https://t.co/aanFvSxpIk
Happy Birthday to 'The Queen' #AnushkaShetty ✨
In Telugu, Tamil, Hindi, Kannada and Malayalam.#HappyBirthdayAnushkaShetty… pic.twitter.com/XuxZEMpz2I
నిజానికి ఈ గ్లిమ్స్ ను మేకర్స్ ఈరోజు సాయంత్రం 4. 05 గంటలకే రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడడంతో అనుష్క అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు కానీ ఆలస్యం కావడానికి కారణం ఏంటి అన్నది మాత్రం తెలియరాలేదు. కాగా గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

