Anushka Sharma: అనుష్క మరోసారి తల్లి కాబోతుందా? సెకండ్ చైల్డ్ ప్లానింగ్‌లో విరుష్క జోడీ?
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ మరోసారి తల్లిదండ్రులు కానున్నారా? ఇటీవల వాళ్ళిద్దరూ ఎందుకు ఆసుపత్రికి వెళ్లారు?
Beautiful couple Anushka Sharma & Virat Kohli expecting second child?: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులు మరో బిడ్ద కోసం ప్రయత్నిస్తున్నారా? సెకండ్ చైల్డ్ ప్లానింగ్‌లో ఉన్నారా? సోషల్ మీడియాలో, ముంబై సినిమా వర్గాల్లో ఒక్కసారి వాళ్ళిద్దరి వ్యక్తిగత జీవితం గురించి జోరుగా చర్చ మొదలైంది. దీనికి కారణం మాల్దీవుల నుంచి వచ్చిన వెంటనే దంపతులు ఇద్దరూ ఆస్పత్రికి వెళ్ళడమే. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత అనుష్క శర్మ నవ్వుతూ కారు ఎక్కడంతో... త్వరలో తాను గర్భవతి అని ఆమె ప్రకటిస్తారని చాలా మంది చెప్పుకొచ్చారు. అయితే... అసలు విషయం వేరే ఉంది?
Is Anushka Shamra Pregnant with a Second Child?: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు ఒక బిడ్డ ఉంది. పేరు... వామిక కోహ్లీ. అయితే... కొన్ని నెలల్లో మరో బిడ్డకు జన్మనిస్తారని ప్రచారం జరుగుతుంది. అందులో నిజం లేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఫిజియోథెరపిస్ట్‌ను కలవడం కోసం దంపతులు ఇద్దరూ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి వెళ్లారట. అదీ అసలు నిజం!
Also Read: రికార్డుల వేటలో... మహేష్ బాబు - గురూజీ త్రివిక్రమ్ మూవీపై తమన్ అప్‌డేట్
త్వరలో అనుష్క రీఎంట్రీ: వామికా కోహ్లీకి జన్మనిచ్చిన తర్వాత, అంతకు ముందు కొన్ని నెలలు గర్భం దాల్చినప్పుడు సినిమాలకు అనుష్క శర్మ విరామం ఇచ్చారు. త్వరలో ఆమె రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. క్రికెట్ నేపథ్యంలో 'Chakda Xpress' సినిమా చేస్తున్నారు. అందులో ఆమె క్రికెటర్ రోల్ పోషిస్తున్నారు. ఇటీవల విరాట్ - అనుష్క ఫ్యామిలీ మాల్దీవులు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ ఆమె స్విమ్ సూట్ ఫోటోషూట్ వైరల్ అయ్యింది.
Also Read: రష్మీ జీవితంలో అంతులేని విషాదం, ఆ లోటును తలుచుకుని స్టేజి మీద కన్నీళ్లు...
View this post on Instagram