Ghaati First Look: ఘాటీ ఫస్ట్ లుక్ వచ్చేసింది... రక్తమోడిన కళ్ళతో భయపెట్టేలా ఉన్న అనుష్కను చూశారా?
Anushka Birthday: అనుష్క పుట్టినరోజు సందర్భంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఆమె నటిస్తున్న తాజా సినిమా 'ఘాటీ' ఫస్ట్ లుక్ నేడు విడుదల చేశారు. అది ఎలా ఉందో చూడండి.

క్వీన్ అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా 'ఘాటీ' (Ghaati Movie). క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రమిది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబా జాగర్లమూడి నిర్మాతలు. ఈ రోజు మూవీలో ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
'ఘాటీ'లో అనుష్క ఫస్ట్ లుక్ చూశారా?
అనుష్క, క్రిష్ జాగర్లమూడి కలయికలో ఇంతకు ముందు 'వేదం' సినిమా వచ్చింది. అది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి కలయికలో ఈ సినిమా వస్తుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. సెన్సేషనల్ హిట్ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కూడా ఇదే.
VICTIM. CRIMINAL. LEGEND.
— UV Creations (@UV_Creations) November 7, 2024
The Queen will now rule the #GHAATI ❤🔥
Wishing 'The Queen' #AnushkaShetty a very Happy Birthday ✨#GhaatiGlimpse Video today at 4.05 PM ✨
In Telugu, Tamil, Hindi, Kannada and Malayalam.#HappyBirthdayAnushkaShetty@DirKrish @UV_Creations… pic.twitter.com/jgZEBPU5gx
'ఘాటీ' ఫస్ట్ లుక్ చూస్తే... అనుష్క సర్‌ప్రైజ్ చేశారు. నుదుట రక్తం, చేతికి రక్తం... అయితే అనుష్క కళ్ళలో కోపం, క్రోధం కనబడుతున్నాయి. 'విక్టిమ్, క్రిమినల్, లెజెండ్' అని పోస్టర్ మీద పేర్కొన్నారు. మరి, వాటి అర్థం ఏమిటో సినిమా చూస్తే గానీ తెలియదు.
పాన్ ఇండియా చిత్రమిది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. 'బాహుబలి'తో అనుష్క పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. హిందీలోనూ క్రిష్ సినిమాలు తీశారు. అందువల్ల, ఈ సినిమా మీద జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులు అందరి చూపు పడుతోంది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు 'ఘాటీ' వీడియో విడుదల చేయనున్నారు.
Also Read: 'పుష్ప 2' నుంచి డీఎస్పీని తప్పించిన బన్నీ - సుక్కు? లాస్ట్ మినిట్‌లో వస్తున్న తమన్?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

