Anupama Parameswaran: క్యూట్‌గా ఉన్నాడు, హీరోకు సర్‌ప్రైజ్ ఇచ్చిన అనుపమ
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఒక హీరోకి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇంతకీ, ఆ హీరో ఎవరు? విషయం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఉన్నారు కదా! ఆమె చాలా క్యూట్‌గా ఉంటారు. అయితే, ఆమెకు ఒక హీరో క్యూట్‌గా అనిపించారు. ఆ హీరో ఎవరో తెలుసా? హీరో రామ్ పోతినేని (Ram Pothineni). అవును... నిజమే! ఈ మాట అనుపమ చెప్పారు.
'ఉన్నది ఒకటే జిందగీ'లో రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించారు. 'హలో గురూ ప్రేమ కోసమే' చేశారు. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. కానీ, ఇద్దరి మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహంతో ప్రస్తుతం రామ్ నటిస్తున్న 'ది వారియర్' (The Warrior) సెట్స్‌కు వెళ్ళారు అనుపమ. 'హలో... నమస్తే అండీ' అని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఒక్కసారిగా రామ్ స్వీట్ షాక్‌కి గురయ్యారు. 'ఓయ్' అంటూ అనుపమను దగ్గరకు తీసుకున్నారు.
Also Read: 'ఆచార్య' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!
View this post on Instagram
లింగుస్వామి దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న తెలుగు, తమిళ సినిమా 'ది వారియర్'. ఇందులో కృతి శెట్టి కథానాయిక. ఇటీవల 'బుల్లెట్' సాంగ్ విడుదల చేశారు. ఆ పాటకు 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
Also Read: బాలకృష్ణకు సర్జరీ జరగలేదు, మరి కాలుకు ఆ కట్టు ఏంటి? అసలు నిజం ఇదిగో!
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.