అన్వేషించండి

Ant Man 3 India Bookings : ఇండియాలో 'యాంట్ మ్యాన్ 3' అడ్వాన్స్ బుకింగ్స్ - 'అల' హిందీ రీమేక్‌తో కంపేర్ చేస్తే...

Ant-Man and the Wasp: Quantumania India Bookings : మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా 'యాంట్ మ్యాన్ 3'. ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

హాలీవుడ్ సినిమాలు, మరీ ముఖ్యంగా మార్వెల్ అభిమానులు ఎప్పుడు ఫిబ్రవరి 17 కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే... 'యాంట్ మ్యాన్', 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్' తర్వాత ఆ సిరీస్‌లో వస్తున్న తాజా సినిమా 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా' (Ant-Man and the Wasp : Quantumania). ఈ శుక్రవారమే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అమెరికాతో పాటు ఇండియాలో ఒకే రోజు విడుదల అవుతోంది. 

ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్!
'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా'ను థియేటర్లలో చూడటానికి మన భారతీయ ప్రేక్షకులు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బావున్నాయి. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో సేల్ అయిన టికెట్స్ నంబర్ చూస్తే ఎవరైనా సరే ఆ విషయాన్ని ఈజీగా చెబుతారు. 

'అల...' హిందీ రీమేక్ కంటే బెట్టర్!
ఫిబ్రవరి 17న 'యాంట్ మ్యాన్ 3'తో పాటు 'అల వైకుంఠపురములో' సినిమా హిందీ రీమేక్ 'షెహజాదా' కూడా విడుదల అవుతోంది. అందులో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు. ఆ సినిమాతో కంపేర్ చేస్తే... పది రెట్లు 'యాంట్ మ్యాన్ 3'కి బజ్ ఉందని చెప్పాలి.
 
పీవీఆర్, సినీ పోలీస్, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఫిబ్రవరి 17న బుకింగ్స్ చూస్తే... 'యాంట్ మ్యాన్ 3' టికెట్స్ 43,907 సేల్ అయితే, 'షెహజాదా' టికెట్స్ జస్ట్ 3,483 మాత్రమే సేల్ అయ్యాయని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 

'యాంట్ మ్యాన్ అండ్ ది  వాస్ప్ : క్వాన్టుమేనియా' సినిమా విషయానికి వస్తే... ఇందులో 'యాంట్ మ్యాన్' టైటిల్ పాత్రలో పాల్ రూడ్ నటించారు. స్కాట్ లాంగ్‌గానూ ఆయన కనిపించనున్నారు. హోప్ వాన్ డీన్, వాస్ప్ పాత్రలో ఎవాంజలీన్ లీ నటించారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ సినిమాపై ఇండియాలో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

Also Read : ఆస్కార్ గడ్డపై తెలుగు బిడ్డలు - ఒకే వరుసలో స్టీవెన్ స్పీల్‌బర్గ్, చంద్రబోస్ 
  
Ant-Man and the Wasp: Quantumania India Release : ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారతీయ ప్రేక్షకుల ముందుకు 'యాంట్ మ్యాన్ అండ్ ది  వాస్ప్ : క్వాన్టుమేనియా' వస్తోంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో 31వ చిత్రమిది. 'యాంట్ మ్యాన్' (2015), 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్' (2018) తర్వాత యాంట్ మ్యాన్ సిరీస్‌లో వస్తున్న మూడో సూపర్ హీరో సినిమా.

Also Read : 'మిస్టర్ తారక్'గా థియేటర్లలోకి తారకరత్న -  ఈ నెలలోనే సినిమా విడుదల

'యాంట్ మ్యాన్ అండ్ ది  వాస్ప్ : క్వాన్టుమేనియా'లో విలన్ కింగ్ ది కాంకరర్ పాత్రలో నటించిన జోనాథన్ మేజర్స్ (Jonathan Majors) ఉన్నారు కదా! తనకు 'ఆర్ఆర్ఆర్' అమితంగా నచ్చిందని ఆయన తెలిపారు. అన్నట్టు... ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'అవెంజర్స్ : ది కాంగ్ డైనస్టీ', 'అవెంజర్స్ : సీక్రెట్ వార్స్'లో కూడా ఆయన కింగ్ డి కాంకరర్ పాత్రలో కనిపించనున్నారు.

'ఆర్ఆర్ఆర్' చాలాసార్లు చూశా - జోనాథన్!
'యాంట్ మ్యాన్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జోనాథన్ మేజర్స్ ఇండియన్ సినిమాల గురించి మాట్లాడారు. ''నేను ఇండియన్ సినిమాలు చూస్తాను. 'ఆర్ఆర్ఆర్' చాలా సార్లు చూశా. మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ నాకు నచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్... ఇద్దరూ చాలా బాగా చేశారు'' అని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ ఫిల్మ్స్ ఇంకా చూడాలని అనుకుంటున్నానని, ఎవరైనా సినిమాలు రికమండ్ చేయమని జోనాథన్ అడిగారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Asaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABPVishakhapatnam TDP MP Candidate  Bharat Interview | బాలయ్య లేకపోతే భరత్ కు టికెట్ వచ్చేదా..? |

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
Tata Curvv EV Launch: టాటా కర్వ్ ఈవీ లాంచ్ త్వరలో - కారు ఎలా ఉండవచ్చు?
టాటా కర్వ్ ఈవీ లాంచ్ త్వరలో - కారు ఎలా ఉండవచ్చు?
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
Embed widget