By: ABP Desam | Updated at : 14 Feb 2023 12:48 PM (IST)
తారకరత్న
నందమూరి తారక రత్న (Nandamuri Taraka Ratna) అభిమానులకు ఓ గుడ్ న్యూస్. త్వరలో 'మిస్టర్ తారక్'గా థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమా ఈ నెలలో విడుదల కానుంది. అసలు వివరాల్లోకి వెళితే...
ఫిబ్రవరి 24న 'మిస్టర్ తారక్'
Mr Tarak Movie Release Date : నందమూరి తారక రత్న హీరోగా శంకర్ డోరా దర్శకత్వం వహించిన సినిమా 'మిస్టర్ తారక్'. ఇందులో సారా హీరోయిన్. ప్రతిజ్ఞ ప్రొడక్షన్స్ పతాకంపై మధు పూసల నిర్మించారు. ఈ చిత్రాన్ని కె. ఆదినారాయణ విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో వీలైనన్ని థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ఆయన తెలిపారు.
స్నేహితుడే మోసం చేస్తే...
'మిస్టర్ తారక్' కథేంటి?
Mr Tarak Movie Story : మిస్టరీ, థ్రిల్లర్ సినిమాగా 'మిస్టర్ తారక్' తెరకెక్కింది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య, ప్రాణ స్నేహితుడు ఒక్కటై మోసం చేస్తే... హీరో ఏం చేశాడు? అనేది చిత్ర కథగా తెలుస్తోంది. 'నేను నమ్ముకున్న వైఫ్ ఇంకొకడితో బెడ్ ఎక్కింది. కోరుకున్న లైఫ్ ఇలా రోడ్ ఎక్కింది' అంటూ ట్రైలర్‌లో తారక రత్న చెప్పిన డైలాగ్ సినిమా కోర్ పాయింట్ గురించి చెబుతోంది. తన భర్త కనిపించడం లేదంటూ భార్య ఎందుకు కంప్లైంట్ చేసింది? ఇంటికి వచ్చిన భర్తను ఎవరు నువ్వు? అని ఎందుకు ప్రశ్నించింది? ఆ తర్వాత ఏమైంది? అనేది థియేటర్లలో చూడాలి.
Also Read : నారా, నందమూరి కుటుంబాలకు ఎన్టీఆర్ దూరమా? చెక్ పెట్టిన బ్రాహ్మణి, ప్రణతి
నిజానికి, మూడు నెలల క్రితమే 'మిస్టర్ తారక్' ట్రైలర్ విడుదలైంది. అమెరికాలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సినిమా విడుదల అయ్యింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సినిమా విడుదల చేస్తున్నారు.
Also Read : 'అవెంజర్స్', 'యాంట్ మ్యాన్' విలన్ జోనాథన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే
తారక రత్నకు గుండెపోటు వచ్చిన తర్వాత నాలుగైదు రోజులు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. వైసీపీ ఎంపీ, తారక రత్న భార్య అలేఖ్యా రెడ్డి బాబాయ్ విజయ సాయిరెడ్డి ఆయనకు థాంక్స్ కూడా చెప్పారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయకు విజయ సాయిరెడ్డి వెళ్ళి వచ్చిన తర్వాత మరో అప్ డేట్ లేదు. అందువల్ల, తారక రత్నకు ఇప్పుడు ఎలా ఉంది? అనే క్వశ్చన్ వస్తోంది.
తారకరత్నకు విదేశీ వైద్యుల చికిత్స
ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన వైద్య బృందం తారక రత్నకు చికిత్స అందిస్తోంది. నందమూరి కుటుంబ సభ్యులు రామకృష్ణ ఈ విషయాన్ని తెలిపారు. హార్ట్, న్యూరో సమస్యలకు మెరుగైన వైద్యం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇప్పటికీ ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు వెల్లడించారు. వైద్యులు శక్తి వంచన లేకుండా ఆయనను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన త్వరలోనే కోలుకోవాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
తారక రత్నకు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ తలపెట్టిన 'యువ గళం' పాదయాత్రలో జనవరి 27న పాల్గొనడానికి నందమూరి తారక రత్న కుప్పం వెళ్ళారు. అక్కడ మసీదులోనికి వెళ్ళి వచ్చిన తర్వాత రోడ్డు మీద ఒక్కసారిగా కుప్పకూలారు. తొలుత డీహైడ్రేషన్ కారణంతో సొమ్మసిల్లి పడ్డారని అందరూ భావించారు. వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు. ఆ తర్వాత గుండెపోటు అని తెలిసింది. మెదడుకు 45 నిమిషాల పాటు రక్త ప్రసరణ ఆగిందని తెలిపారు. తొలుత కుప్పం ఆస్పత్రులలో చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తీసుకు వెళ్ళారు.
Akhil Akkineni : తమిళ దర్శకుడితో అఖిల్ అక్కినేని సినిమా?
iPhone 15: 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ - ఎక్కడ అందుబాటులో ఉంది? ఎందులో ఆర్డర్ చేయాలి?
Papam Pasivadu Trailer : సింగర్ శ్రీరామచంద్ర హీరోగా 'పాపం పసివాడు' - ట్రైలర్ ఎలా ఉందో చూశారా?
Ram - Virat Kohli Biopic : విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ పోతినేని - హీరో ఏమన్నారో తెలుసా?
Geethanjali Malli Vachindhi: పదేళ్ల తర్వాత 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' - హైదరాబాద్‌లో అంజలి, కోన వెంకట్ సినిమా షురూ
TDP News : కర్నూలు టీడీపీలో కీలక మార్పులు - బైరెడ్డి చేరిక ఖాయమయిందా ?
Mindspace Buildings Demolition: మాదాపూర్ మైండ్ స్పేస్ లో 2 భవనాలు క్షణాల్లో నేలమట్టం
Modi Tour : 30వ తేదీనే తెలంగాణకు ప్రధాని మోదీ - టూర్ షెడ్యూల్‌లో మార్పులు!
Lokesh : నిరసనలు చేస్తే హత్యాయత్నం కేసులా ? - జగన్ సర్కార్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు !
/body>