Devara Song: ‘దేవర‘ పాటపై కాపీ 'మనికే మాగే హితే' సాంగ్ కంపోజర్ షాకింగ్ కామెంట్స్
ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నచిత్రం ‘దేవర‘. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ‘చుట్టమల్లె’ పాట విడుదలైంది. అయితే, ఈ సాంగ్ పై కాపీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Devara Song Copy Controversy: పాన్ ఇండియన్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ‘చుట్టమల్లే’ సాంగ్ విడుదల అయ్యింది. ఈ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్, జాన్వీ లుక్స్ ఆహా అనిపించాయి. సోషల్ మీడియాలో ఈ పాట రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకుంటుంది. మరోవైపు ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ కాపీ కొట్టారంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
'మనికే మాగే హితే' నుంచి కాపీ కొట్టారంటూ విమర్శలు
శ్రీలంక పాట 'మనికే మాగే హితే' కొద్ది కాలం క్రితం ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అయితే, ఇటీవల విడుదలైన 'దేవర'లోని 'చుట్టమల్లె' పాట.. 'మనికే మాగే హితే'తో పోలికలున్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దేవర'లోని 'చుట్టమల్లె' పాట ఆగస్ట్ 5న లాంచ్ అయింది. అప్పటి నుంచి అనిరుధ్ రవిచందర్ పై విమర్శలు వస్తున్నాయి. ఇంతకాలంగా సొంతంగా పాటలు కంపోజ్ చేస్తారని భావించామని, చివరకు అనిరుధ్ కూడా కాపీ క్యాట్ గా మారిపోయారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలపై అనురుధ్ ఇప్పటి వరకు స్పందించలేదు.
నా పాటను స్ఫూర్తిగా తీసుకోవడం సంతోషంగా ఉంది- చమత్ సంగీత్
అటు 'మనికే మాగే హితే' పాట స్వరకర్త చమత్ సంగీత్ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ‘దేవర’ పాటకు తన పాటకు ఉన్న పోలికలను చూపించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేశారు. "అనిరుధ్ వర్క్ ను నేను ఎప్పుడే ఆరాధిస్తాను. నా పాట 'మనికే మాగే హితే'ను ప్రేరణగా తీసుకొని అతడు 'చుట్టమల్లె' పాటను రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. 'మనికే మాగే హితే' అనేది చమత్ సంగీత్ స్వరపరచిన శ్రీలంక పాట. యోహాని పాడారు. 2021లో విడుదలైన ఈ పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ లో హల్ చల్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.
View this post on Instagram
అనిరుధ్ కు సపోర్టు చేస్తున్న కొంతమంది నెటిజన్లు
‘దేవర’ పాటకు 'మనికే మాగే హితే' పాటకు ఎలాంటి పోలిక లేదని మరికొంత మంది నెటిజన్లు అంటున్నారు. కావాలనే కొంతమంది ‘దేవర’ సినిమాను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య ప్రతి పాటను ఏదో ఒకరకంగా ట్రోల్ చేయడం ఫ్యాషన్ అయ్యిందంటూ మండిపడుతున్నారు. అనిరుధ్ లాంటి సంగీత దర్శకుడికి కాపీ కొట్టాల్సిన దుస్థితి పట్టలేదంటున్నారు. కొంత మంది ‘దేవర’ పోస్టర్ పైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 27న 'దేవర' విడుదల
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం మొదటి భాగం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, రెండవ భాగం నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రాన్ని కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
Read Also: దేవర 'చుట్టమల్లే' సాంగ్‌పై ట్రోల్స్ - స్పందించిన నిర్మాత నాగవంశీ, ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్!