Animal Pre-Teaser: గొడ్డలితో ఆ నరుకుడేంది రణబీర్? రక్తంతో నిండిపోయిన 'యానిమల్' ప్రీ టీజర్!
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'యానిమల్'. వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ టీజర్ విడుదల అయ్యింది.
దర్శకుడిగా పరిచయమైన 'అర్జున్ రెడ్డి' సినిమాతో సందీప్ రెడ్డి వంగా సంచలన విజయం అందుకున్నారు. స్టోరీ టెల్లింగ్ పరంగా కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఆ సినిమాను హిందీలో 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసి, అక్కడ కూడా భారీ విజయం అందుకున్నారు. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ హీరోగా 'యానిమల్' సినిమా చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. పెళ్లి తర్వాత రణ్‌బీర్ స్టార్ట్ చేసిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం మనాలీలో జరిగింది. ఇందుకోసం రణ్‌బీర్, రష్మిక మనాలిలోనే కొద్ది రోజుల పాటు కున్నారు.
రక్తం ఏరులై పారుతున్న 'యానిమల్' ప్రీ టీజర్
వచ్చే ఏడాది ఆగష్టు 11న ‘యానిమల్’ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-టీజర్ విడుదల చేశారు. ఇందులో రణబీర్ కపూర్‌ని మునుపెన్నడూ లేని అవతార్‌లో చూపించారు. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ ప్రీ-టీజర్‌తో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. తాజా విడుదలైన ప్రీ- టీజర్ లో గాయకులు భూపిందర్ బబ్బల్, మనన్ భరద్వాజ్ పాడుతుండగా, గొడ్డలితో శత్రువుల రక్తం పారిస్తాడు రణబీర్. ప్రస్తుతం ఈ ప్రీ- టీజర్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ‘యానిమల్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రం పోస్టర్‌ను ట్వీట్ చేశారు. రణబీర్ కపూర్ ఒకరిని చూస్తూ సిగరెట్ తాగడం ఇందులో కనిపిస్తుంది. రక్తంతో తడిసిన తెల్లటి చొక్కా ధరించి, రక్తంతో నిండిన గొడ్డలిని పట్టుకున్నాడు. ఈ పోస్టర్ సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. సినిమాపై భారీగా అంచనాలు పెంచింది.
అనుకున్న సమయానికే 'యానిమల్' విడుదల
అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘OMG 2’, సన్నీ డియోల్, అమీషా పటేల్ నటించిన ‘గదర్’, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘ జైలర్’ ‘యానిమల్’ సినిమాతో క్లాష్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ‘యానిమల్’ వాయిదా పడే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ సినిమా కచ్చితంగా ఆగస్టు 11నే విడుదల అవుతుందని రణబీర్ కపూర్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. సందీప్ రెడ్డి వంగాతో రణ్‌బీర్ తొలిసారి కలిసి పని చేస్తున్నాడు. సందీప్‌కి ఇది రెండో బాలీవుడ్ చిత్రం. ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్ అయిన ‘కబీర్ సింగ్’తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది.
టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌పై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్ కుమార్, ప్రణవ్ రెడ్డి వంగా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా కథ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని, రణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో భిన్నమైన పాత్రలో కనిపిస్తారని చిత్ర బృందం పేర్కొంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం రణ్‌బీర్ స్పెషల్‌గా మేకోవర్ అవుతున్నారట. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ సినిమా హిందీతో పాటు దక్షిణాది భాషల్లో విడుదల చేయనున్నారు.
Read Also: వరుణ్‌ను తొలిసారి చూసింది అప్పుడే - తనతో సినిమా అంటే ఆలోచించా: వితికా శేరు