News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Anikha Surendran: బుల్లి ‘బుట్టబొమ్మ’కు భారీ ఆఫర్, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో ఛాన్స్!

తమిళ చిత్రం ‘ఎన్నై ఆరింధాల్’లో అజిత్ కూతురిగా అవకాశాన్ని దక్కించుకున్న అనిఖా.. ఆ తర్వాత కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.

FOLLOW US: 
Share:

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన ఎంతోమంది ఇప్పుడు హీరోహీరోయిన్లుగా సెటిల్ అయిపోయారు. కానీ అప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత హీరోలుగా, హీరోయిన్లుగా అడుగుపెట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రేక్షకులకు దగ్గరయిన తర్వాత ఎక్కువగా గ్యాప్ తీసుకోకుండా వారికి సూట్ అయ్యే యూత్‌ఫుల్ స్టోరీలతో హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అదే లిస్ట్‌కు చెందిన మరో చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్. హీరోయిన్‌గా మారిన తర్వాత అనిఖా.. బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులతో బిజీ అయిపోయింది. అంతే కాకుండా ఇప్పుడు ఏకంగా ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని సమాచారం.

కేరళలో పుట్టి పెరిగిన అనిఖాకు ముందుగా మలయాళంలోనే చైల్డ్ ఆర్టిస్టుగా అవకాశాలు వచ్చాయి. 2007లో ‘ఛోటా ముంబాయ్’ అనే మలయాళ చిత్రంలో చిన్న పాత్ర చేసి చైల్డ్ ఆర్టిస్టుగా అవకాశాలు పెరిగాయి. ఆ తర్వాత మలయాళంలోనే అరడజనుకుపైగా చిత్రాల్లో అలరించింది. కానీ సొంత భాషలో కంటే తమిళంలోనే అనిఖాకు ఎక్కువగా గుర్తింపు లభించింది. 2015లో విడుదలయిన తమిళ చిత్రం ‘ఎన్నై ఆరింధాల్’లో అజిత్ కూతురిగా అవకాశాన్ని దక్కించుకున్న ఈ మలయాళ కుట్టి.. ఆ తర్వాత కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఎన్నై ఆరింధాల్ తర్వాత విశ్వాసంలో కూడా తన కూతురి పాత్ర కోసం అనిఖానే ఎంపిక చేసుకున్నాడు అజిత్.

చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్‌గా..

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్‌గా మారడానికి అనిఖా పెద్దగా సమయం తీసుకోలేదు. తెలుగులో నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన అనిఖా.. తెలుగు మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. అలా తెలుగులో హీరోయిన్‌గా తన మొదటి అవకాశాన్ని అందుకుంది. ఇప్పటికే ‘బుట్ట బొమ్మ’, ‘ఓ మై డార్లింగ్’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది అనిఖా. ప్రస్తుతం ఈ భామ చేతిలో అరడజనుకుపైగా సినిమాలు ఉండగా.. తాజాగా మరో సెన్సేషనల్ అవకాశాన్ని దక్కించుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోటా’లో అనిఖా ఒక కీ రోల్ ప్లే చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీంతో పాటు ఏకంగా ధనుష్ డైరెక్షన్‌లో నటించే అవకాశాన్ని దక్కించుకుందట ఈ ముద్దుగుమ్మ.

భారీ ప్రాజెక్ట్స్‌లో చోటు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కెరీర్‌లోని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘డీ 50’ చిత్రంలో అనిఖా సురేంద్రన్ ఒక కీలక పాత్ర చేసే అవకాశాన్ని కొట్టేసినట్టు తమిళ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ధనుష్ నటించడంతో పాటు డైరెక్ట్ కూడా చేస్తున్నాడు. ఇప్పటికే డైరెక్టర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్.. మరోసారి ఆ పేరును నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాడు. విష్ణు విశాల్, ఎస్ జే సూర్య కూడా ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో కనిపించనున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీ గురించి, ఇందులో అనిఖా పాత్ర గురించి ఎలాంటి అధికారిక సమాచారం ఇంకా బయటికి రాలేదు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో అనిఖా చేరితే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Also Read: ఆఫర్ల కోసం స్టార్ హీరోలతో డేట్ చేయమని అడిగారు: నోరా ఫతేహి షాకింగ్ కామెంట్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 01 Aug 2023 03:34 PM (IST) Tags: Anikha Surendran Butta Bomma Child Artist The Ghost Dhanush d 50

ఇవి కూడా చూడండి

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!

'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!

ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?

ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?

Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ డేట్, ‘సప్త సాగరాలు దాటి’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ డేట్, ‘సప్త సాగరాలు దాటి’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

టాప్ స్టోరీస్

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు

ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం