అన్వేషించండి

Roshan Kanakala Video : పోలీసులకు దొరికిపోయిన యాంకర్ సుమ కొడుకు - వీడియో వైరల్

Roshan Kanakala : యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ తన ఫ్రెండ్స్ తో కలిసి కార్ లో వెళ్తుండగా పోలీస్ రైడింగ్ లో దొరికారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Roshan Kanakala Video : బుల్లితెర యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల, అతడి ఫ్రెండ్స్ పోలీస్ చెకింగ్‌లో దొరికిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఫ్రెండ్స్ తో కలిసి కారులో వెళ్తున్న రోషన్ ని పోలీసులు ఆపారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల  నేపథ్యంలో మద్యం, డబ్బులు భారీగా రవాణా అవుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ప్రతి చోటా చెక్ పోస్ట్ లు పెట్టి కార్లు, ఇతర వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోషన్ కనకాల కారును పోలీసులు రైడింగ్ లో భాగంగా ఆపారు. పోలీసులు అడిగిన ప్రశ్నకి రోషన్ తో పాటు అతని ఫ్రెండ్స్ తిక్క సమాధానం చెబుతూ తమ ఇన్ఫ్లుయెన్స్ ని వాడుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా పోలీసులు వదలలేదు.

వారితో కార్ డిక్కీ ఓపెన్ చేయించారు. కార్ డిక్కీ ఓపెన్ చేయడానికి రోషన్ అతని ఫ్రెండ్స్ ముందు సందేహించారు. దాంతో పోలీసులతో డీల్ మాట్లాడుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు మాత్రం వినకుండా డిక్కీ లో ఉన్న సూట్ కేసులు ఓపెన్ చేయాలని పట్టుబడటంతో చేసేది ఏం లేక సూట్ కేసులు ఓపెన్ చేసి చూపించారు. ఇక సూట్ కేసులో ఉన్న ఐటమ్స్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఇంతకీ ఆ సూట్ కేసుల్లో ఏముందంటే, జిలేబిలు, బబుల్ గమ్స్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈ తతంగం సీరియస్ గా జరిగింది కాదు. ఇది ఓ రకమైన ప్రాంక్. సుమ కనకాల కొడుకు హీరోగా 'బబుల్ గమ్' అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ మూవీ ప్రమోషన్ కోసమే ఇలాంటి ఓ ప్రాంక్ క్రియేట్ చేశాడు. 'బబుల్ మగమ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పోలీస్ రైడింగ్ లో దొరికినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు సుమా కొడుకు రోషన్. అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది. ప్రారంభంలో ఈ వీడియో చూసిన నెటిజన్స్ అంతా ఇది నిజమేనేమో అనుకున్నారు. కానీ వీడియో పూర్తిగా చూసిన తర్వాత వాళ్లకి క్లారిటీ వచ్చింది ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని. ఈమధ్య హీరోలు తన సినిమాలు ప్రమోట్ చేసుకోవడం కోసం ఇలాంటి స్టంట్స్ ఎన్నో చేస్తున్నారు. ఆ మధ్య అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా యాంకర్ సుమను అరెస్టు చేసినట్లు అందరిని నమ్మించాడు.

సుమా అరెస్ట్ వీడియో కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. కానీ చివరికి అది ఉత్తుత్తి అరెస్ట్ అని, ప్రమోషన్ కోసం చేసిందని తెలిసిపోయింది. ఇక సుమా కొడుకు రోషన్ కూడా అలాంటి ఓ ప్రాంక్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. ఇక 'బబుల్ గమ్' మూవీ విషయానికి వస్తే.. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. రవికాంత్ పేరేపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఇందులో రోషన్ సరసన మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి విడుదల టీజర్, సాంగ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Also Read : మొన్న రష్మిక, నేడు కాజోల్ - మరీ దారుణమైన వీడియోను పోస్ట్ చేసిన ‘ఫేక్’గాళ్లు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Embed widget