Anasuya Bharadwaj: ఆంటీ అనడానికి.. నేను మీ చుట్టాన్ని కాదు, నాకు సింపథీ అక్కర్లేదు - అనసూయ సెటైర్లు విజయ్ దేవరకొండ పైనేనా?
Anasuya Bharadwaj: టాలీవుడ్‌లో అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య ఎప్పటినుండో కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ దగ్గర పడుతుండగా మరోసారి సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యింది అనసూయ.
Anasuya Bharadwaj About Vijay Devarakonda: సినీ పరిశ్రమలో కోల్డ్ వార్స్ సహజం. అలా అని అందరు సెలబ్రిటీల మధ్య ఉన్న మనస్పర్థల, గొడవల గురించి ఎక్కువగా బయటికి రాదు. కానీ కొందరు మాత్రం సోషల్ మీడియా వేదికగా తమకు నచ్చని కో స్టార్లపై ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు కురిపిస్తుంటారు. అలా గత కొన్నాళ్లకు విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. విజయ్ దేవరకొండ సినిమా ఏది రిలీజ్ అయినా కూడా దాని మీద ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా స్పందిస్తూనే ఉంటుంది అనసూయ. ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ సందర్భంగా మరోసారి సోషల్ మీడియాలో అనసూయ రచ్చ మొదలయ్యింది. ఒక నెటిజన్ చేసిన కామెంట్‌కు అనసూయ ఘాటుగా రియాక్ట్ అయ్యింది.
నేను కూడా తెలంగాణ బిడ్డనే..
విజయ్ దేవరకొండ పీఆర్ మాఫియా చేస్తాడని, చివర్లో సింపతీ మాటలను ప్రేక్షకులపై రుద్దుతాడని, ఫైనల్‌గా అనసూయ ఆంటీని రంగంలోకి దించుతాడని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ ట్వీట్ అనసూయ కంటపడింది. దీంతో అనసూయ ఈ విషయంపై స్పందించింది. ‘‘ఎందుకండి అస్తమానం నన్ను లాగుతారు. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి చెప్పి వదిలేశాను. అనవసరంగా నేను హైప్ ఇస్తున్నానని నా వాళ్లు అంటుంటే నిజమేనేమో అని వదిలేశాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే. కానీ నాకు సింపతీ అక్కర్లేదు’’ అంటూ తన పేరును ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్‌పై రియాక్ట్ అయ్యింది. అంటే పరోక్షంగా అనసూయ కూడా విజయ్ దేవరకొండకు పీఆర్ మాఫియా ఉందని ఒప్పుకుందని ఆడియన్స్ అనుకుంటున్నారు.
తెలియకుండా రిలేషన్స్ ఉన్నాయేమో..
‘‘నాకు నా మీద నమ్మకం, నా దేవుడి మీద నమ్మకం. మా అమ్మా నాన్న నాకు ఇచ్చిన విలువలు, వారి పెంపకం నన్ను నా దృష్టిలో ఎప్పుడూ దిగజారనివ్వవు. ఇప్పుడు ఈ ట్వీట్‌ను కూడా తన స్వార్థానికి వాడుకున్నా నేను ఆశ్చర్యపోను. కానీ నాకు వాళ్లకి ఎటువంటి సంబంధం అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అన్నట్టు.. నాకు తెలిసి మీరు, నేను చుట్టాలం అస్సలు కాదు. కాబట్టి నేను మీకు ఆంటీ కానేమో. అయినా ఒకసారి మీ ఇంట్లో అడగండి మీకు తెలియకుండా ఏమైనా రిలేషన్స్ ఉన్నాయేమో. ఎందుకంటే నాకు చుట్టాలు అయితేనే ఆ పలకరింపులు ఉంటాయని నాకు నా పెద్దవాళ్లు నేర్పించారు. అయినా మీకు జరగాలని కోరుకుంటున్నాను’’ అంటూ తనను ఆంటీ అన్నందుకు కూడా తన స్టైల్‌లో స్పందించింది అనసూయ.
Yenduku Karthik garu astamaanam nannu laagutaaru.. evaru em mafia chestunnaro nenu yeppudo cheppi cheppi odilesanu.. anavasaranga nene hype istunnanani na vaallu antunte nijamenemo ani odilesanu..nenu kuda telangana biddane.. kaani naaku sympathy akkarledu.. naku naa meeda… https://t.co/JhIdIBBM32
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2024
Also Read: 'ఫ్యామిలీ స్టార్' ఫస్ట్ రివ్యూస్ వచ్చేశాయ్ - 'దిల్' రాజు భార్య, హీరో ఫాదర్ సినిమా చూసి ఏమన్నారంటే?