Anand Deverakonda: 'బేబీ' జంటతో '90s' ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సితార సంస్థ సినిమా... ఆ ఒక్కటీ చాలు క్రేజ్ పెంచేయడానికి
Vaishnavi Chaitanya: అవును, ఊహించని కాంబోలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సినిమాను అనౌన్స్ చేసి అందరికీ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. సితార బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ 32గా వస్తున్న ఆ మూవీ వివరాలివే..
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా దూసుకెళుతోంది. అటు స్టార్ హీరోస్‌తో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే.. యంగ్ హీరోలతో సైతం మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలను చేస్తూ.. క్రేజీ సంస్థగా మారింది. ఈ సంస్థ నుండి సంక్రాంతికి వచ్చిన ‘డాకు మహారాజ్’ మాస్ హిట్ దిశగా దూసుకెళుతుండగా.. ఇదే ఫెస్టివల్‌ను పురస్కరించుకుని మేకర్స్ మరో ఊహించని కాంబోలో సినిమాను అనౌన్స్ చేశారు. నిజంగా ఈ కాంబోలో సినిమాను ఎవరూ ఊహించి ఉండరు. ఇలా సెట్ చేయడం కేవలం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు మాత్రమే సాధ్యం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 32గా రానున్న ఈ మూవీ వివరాల్లోకి వెళితే..
‘బేబీ’ సినిమా అనగానే గుర్తొచ్చే పేర్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ఈ కాంబోలో ఆ తర్వాత మరో సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది కానీ.. అది ఏ స్టేజ్‌లో ఉంది ఎవరికీ తెలియదు. ఇది ఊహించిన కాంబినేషనే. కానీ వీరిద్దరిని ఇటీవల ‘90s’ వెబ్ సిరీస్‌తో అద్భుతమైన సక్సెస్‌ని అందుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేస్తున్నాడనేదే ఊహించని న్యూస్. అందులోనూ ఆ సిరీస్‌కు లింక్ అయ్యేలా ఈ సినిమా ఉంటుందని ప్రకటించడం మరో సర్‌ప్రైజ్. మొత్తంగా అయితే ఊహించని కాంబోలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా అనౌన్స్ చేసి.. వార్తలలో హైలెట్ అవుతోంది.
ఈ మూవీ అనౌన్స్‌మెంటే కాదు.. కాన్సెప్ట్ ఏంటో కూడా చిత్రయూనిట్ రివీల్ చేసింది. ‘90s’ సిరీస్‌లో చిన్న పిల్లవాడిగా నటించిన ఆదిత్య పాత్ర ఎంతలా ప్రేక్షకుల మనసులను గెలుచుకుందో తెలిసిందే. ఆ పిల్లవాడు పది సంవత్సరాల తర్వాత పెద్దవాడైతే, ఆ పాత్రను ఆనంద్ దేవరకొండ పోషిస్తే, అతనికి ఒక అందమైన ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ చిత్ర కథ పుట్టినట్లుగా అనౌన్స్‌మెంట్ వీడియోలో చూపించి.. చిత్ర కాన్సెప్ట్‌ని రివీల్ చేశారు. ‘మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ’.. అంటూ వీడియో చివర్లో ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇది నా స్టోరీ?
— Sithara Entertainments (@SitharaEnts) January 15, 2025
మీ స్టోరీ?
మన స్టోరీ ♥️
Bringing you the 𝙈𝙤𝙨𝙩 𝙍𝙚𝙡𝙖𝙩𝙖𝙗𝙡𝙚 𝙖𝙣𝙙 𝙃𝙚𝙖𝙧𝙩𝙬𝙖𝙧𝙢𝙞𝙣𝙜 𝙈𝙞𝙙𝙙𝙡𝙚 𝘾𝙡𝙖𝙨𝙨 𝙇𝙤𝙫𝙚 𝙎𝙩𝙤𝙧𝙮 with a character you’ll fall in love with instantly 😍💯
- https://t.co/OnsQpZTaA6 @SitharaEnts Production No. 32… pic.twitter.com/4vSJI8IUJW
ఈ చిత్రం కామెడీ, రొమాన్స్, ఎమోషన్, డ్రామా కలయికతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా రూపొందనుందని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చెబుతోంది. మరో సర్‌ప్రైజ్ ఏమిటంటే.. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగీత దర్శకుడు. తన మధురమైన మెలోడీలతో ప్రపంచవ్యాప్తంగా ‘హృదయా’లను గెలుచుకున్న సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, ఎడిటర్ నవీన్ నూలి, ఛాయాగ్రాహకుడు అజీమ్ మొహమ్మద్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం అవుతుందని ఈ అప్డేట్‌లో మేకర్స్ వెల్లడించారు.
Also Read: 'గేమ్ చేంజర్'ను కోలుకోలేని దెబ్బ తీసిన లోకల్ టీవీ... సినిమాను అలా ఎలా టెలికాస్ట్ చేశార్రా?