అన్వేషించండి

Taran Adarsh Post: ఇక బాలీవుడ్‌ను కాపాడేది టాలీవుడ్‌ హీరోలే - హాట్‌టాపిక్ అవుతున్న హిందీ క్రిటిక్ పోస్ట్‌

Bollywood: ప్రస్తుతం తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. బాహుబలి నుంచి మొదలు.. టాలీవుడ్‌ ఇండస్ట్రీ డైరెక్టర్స్‌, హీరోలు పేర్లు అంతర్జాతీయ వేదికలపై మారుమోగుతున్నాయి.

Telugu heroes to save Bollywood from Drought: ప్రస్తుతం తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. బాహుబలి నుంచి మొదలు.. టాలీవుడ్‌ ఇండస్ట్రీ డైరెక్టర్స్‌, హీరోలు పేర్లు అంతర్జాతీయ వేదికలపై మారుమోగుతున్నాయి. ఒకప్పుడు ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ అనేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ అంటున్నారు. అంతగా మన తెలుగు సినిమాలు వరల్డ్‌ బాక్సాఫీసుని శాసిస్తున్నాయి. పాన్‌ ఇండియా, పాన్‌ వరల్డ్‌ అంటూ సునామిల విజృంభిస్తున్నాయి. చూస్తుంటే మరో రెండేళ్ల వరకు ఇండియన్‌ బాక్సాఫీసు వద్ద మన తెలుగు సినిమాలదే హవా ఉండబోతుంది. గతేడాది చిన్న సినిమాలు తప్పా పెద్దగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ లేకపోవడంతో బాలీవుడ్‌, సౌత్‌ సినిమాలు జోరు చూపించాయి.

కరోనా తర్వాత చెప్పుకోదగ్గ హిట్‌ లేక ఢీలా పడ్డ బి-టౌన్‌ హీరోలు బ్యాక్‌ టూ బ్యాక్‌ బ్లాక్‌బస్టర్స్‌ కొట్టారు. దీంతో తాము కంబ్యాక్‌ ఇచ్చామంటూ మురిపిపోయారు. అయితే ఈ ఏడాది బాలీవుడ్‌లో చెప్పుకొదగ్గ ప్రాజెక్ట్‌ లేదు. ఈ ఏడాది అయితే బి-టౌన్‌లో స్టార్‌ హీరో సినిమాలే లేవు. ఈ క్రమంలో వరుసగా మన తెలుగు పాన్‌ ఇండియా హీరోలు బాక్సాఫీసు దుమ్ముదులిపేందుకు రెడీ అవుతున్నారు. వరుసగా పాన్‌ ఇండియా, పాన్‌ వరల్డ్‌ సినిమాలు విడుదలకు కాబోతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌ బాక్సాఫీసును కాపాడేది తెలుగు హీరోలే అంటూ అక్కడి క్రిటిక్స్. ఈ అంశంపై ప్రముఖ బాలీవుడ్‌ మూవీ అనలిస్ట్‌, క్రిటిక్‌ తరుణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. బాలీవుడ్‌ హంగామా రాసిన కథానాన్ని షేర్‌ చేస్తూ తన ఎక్స్‌లో ట్వీట్‌ వదిలాడు. 

ప్రస్తుతం హిందీలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్‌ ఏం లేదు. యానిమల్‌ తర్వాత ఆ దరిదాపుల్లో కూడా ఒక హిట్‌ సినిమా లేదు. ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పలువురు బడా హీరోల చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు అంతగా చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉందంటే అది 'సింగం ఎగైన్‌'. సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై కూడా పెద్దగా బజ్‌ కనిపించడం లేదంటున్నారు క్రిటిక్స్‌. బాలీవుడ్‌ బడా హీరో చిత్రమైనప్పటికి బి-టౌన్‌ ఆడియన్స్‌ ఈ చిత్రంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదట. పైగా మన తెలుగు హీరోల సినిమాల కోసం బి-టౌన్‌ ఆడియన్స్‌ ఈగర్‌గా ఉన్నారంటూ క్రిటిక్స్‌ నుంచి కామెంట్స్‌ వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది బాలీవుడ్‌ బాక్సాఫీసును కాపాడేది తెలుగు హీరోలేననే బజ్‌ టాక్‌ ఉందని తరణ్‌ ఆదర్స్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. అందులో అల్లు అర్జున్‌ 'పుష్ప 2'. ఈ సినిమాకు హిందీలో ఎంత క్రేజ్‌లో ప్రత్యేకంగా చెప్పనవసరం. ఫస్ట్‌ పార్ట్‌ అయితే అక్కడ బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది.

మరోకటి ప్రభాస్‌ 'కల్కి 2898 AD'. సైన్స్‌ ఫిక్షన్‌ మైథలాజికల్‌ చిత్రంగా వస్తున్న కల్కిలో ఎక్కువగా బాలీవుడ్‌ స్టార్‌ కాస్టే. దీంతో ఈ సినిమాపై కూడా అక్కడ భారీ బజ్‌ నెలకొంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు అక్కడ మంచి మార్కెట్‌ సంపాదించుకున్నారు. దీంతో ఎన్టీఆర్‌ దేవర, రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌పై కూడా పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ నాలుగు సినిమాలు కూడా భారీగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసుకుంటున్నాయి. ఇప్పటికే దేవర రైట్స్‌ని కరణ్‌ జోహార్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక పుష్ప ఆడియో రైట్స్‌ కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో 'దేవర','పుష్ప 2','కల్కి','గేమ్‌ ఛేంజర్‌' థియేట్రికల్‌ రైట్స్‌ అక్కడి డిస్ట్రీబ్యూటర్స్‌ దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేసినట్టు బాలీవుడ్‌ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. అలాగే కమల్‌ హాసన్‌ 'భారతీయుడు 2', సూర్య 'కంగువ' చిత్రాలకు అక్కడ మంచి బజ్‌ ఉంది. అలా మొత్తం ఈ ఏడాది టాలీవుడ్‌, సౌత్‌ హీరోల హవానే కొనసాగనుంది. దీంతో ఇక బాలీవుడ్‌ బాక్సాఫీసు కాపాడేది తెలుగు హీరోలే అంటూ క్రిటిక్‌ తరణ్‌ ఆదర్స్‌ ట్వీట్‌ చేయడం విశేషం. 

Also Read: బాలీవుడ్ to మాలీవుడ్.. ‘జై హనుమాన్’లో నటించే స్టార్స్ వీరే - తెలుగోళ్లు గర్వించేలా చేస్తా: ప్రశాంత్ వర్మ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa Scheme: అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
Marri Rajasekhar: వైసీపీకి మరో షాక్‌, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా
వైసీపీకి మరో షాక్‌, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా
Thaman On Game Changer: 'గేమ్ ఛేంజర్'లో చరణ్ స్టెప్స్ కంటే ఇవి 1000 రెట్లు బెటర్... తమన్ అంత అనేశాడేంటి?
'గేమ్ ఛేంజర్'లో చరణ్ స్టెప్స్ కంటే ఇవి 1000 రెట్లు బెటర్... తమన్ అంత అనేశాడేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP DesamSunita Williams Crew 9 Dragon Capsule Splash Down | భూమిపైకి క్షేమంగా సునీతా విలియమ్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Scheme: అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
Marri Rajasekhar: వైసీపీకి మరో షాక్‌, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా
వైసీపీకి మరో షాక్‌, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా
Thaman On Game Changer: 'గేమ్ ఛేంజర్'లో చరణ్ స్టెప్స్ కంటే ఇవి 1000 రెట్లు బెటర్... తమన్ అంత అనేశాడేంటి?
'గేమ్ ఛేంజర్'లో చరణ్ స్టెప్స్ కంటే ఇవి 1000 రెట్లు బెటర్... తమన్ అంత అనేశాడేంటి?
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బడ్జెట్‌లో కీలక ప్రకటన, నాలుగున్నర లక్షల ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బడ్జెట్‌లో కీలక ప్రకటన, నాలుగున్నర లక్షల ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం
Megastar Chiranjeevi: టెస్లా కారుకు 'మెగాస్టార్'... టెక్సాస్‌లో చిరు వీరాభిమాని డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ రేర్ ఫీట్
టెస్లా కారుకు 'మెగాస్టార్'... టెక్సాస్‌లో చిరు వీరాభిమాని డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ రేర్ ఫీట్
Grok AI : ఓరేయ్ గ్రోక్.. నువ్వు నిజంగా AI వేనా? Grok గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
ఓరేయ్ గ్రోక్.. నువ్వు నిజంగా AI వేనా? Grok గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
Sunita Williams Smiles: సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
Embed widget