Amitabh Bachchan:నాగి తన విజన్‌తో మహా అద్భుతంగా తీశారు - కల్కిని ఊహించటమే అసంభవం.. డైరెక్టర్ మాములోడు కాదు
Amitabh Bachchan Comments at Kalki Event: ఈరోజు ముంబైలో కల్కి 2898 AD ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. ఈ మూవీ కార్యక్రమంలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ మాట్లాడారు.
Amitabh Bachchan Share About Kalki Experience:'కల్కి 2898 AD' మూవీ లవర్స్, ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఇక ఎండ్ కార్డ్ పడింది. ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడా అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కల్కి టీం హడావుడి కనిపించకపోవడంతో ఫ్యాన్స్ అంతా అసహానానికి గురయ్యారు. ప్రమోషన్స్ స్టార్ట్ చేయండంటూ కల్కి టీంను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయి. రిలీజ్‌కు ఇంకా వారం రోజులే ఉన్న ఓ పక్క సినిమాకు సంబంధించి పూర్తి స్థాయిలో అప్‌డేట్స్ రాలేదు.. మరోవైపు ప్రమోషన్స్ చేయడం లేదు.. దీంతో అందరిలో ఎన్నెన్నో సందేహాలు.
ఇక ఆఖరికి అందరి ఎదురుచూపులకు నేడు ఫుల్‌స్టాప్ పెట్టారు మేకర్స్. నేడు మూవీ కల్కి ప్రీ రిలీజ్ వేడుకను చాలా గ్రాండ్ నిర్వహించింది మూవీ టీం. బుధవారం జూన్ 19న సాయంత్రం ముంబైలో కల్కి ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో ప్లాన్ చేసింది. టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్ వ్యవహరించి మూవీ ప్రధాన పాత్రలను ఇంటర్య్వూ చేశారు. ప్రభాస్, బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు కమల్ హాసన్, దీపికా పదుకొనెలను ముచ్చటిస్తూ మూవీ విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా కల్కి మూవీ గురించి.. షూటింగ్ టైం వారికి ఎదురైన ఎక్స్‌పీరియన్స్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాలీవుడ్ బిగ్‌బాస్ మాట్లాడుతూ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన కల్కి గురించి మాట్లాడుతూ ఇంతటి భారీ ప్రాజెక్ట్‌లో తాను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తాను ఇంతవరకు ఇలాంటి ఎక్కడ వినలేదని, కల్కి ఒక అద్భుతమైన కథ అన్నారు. కల్కిలో నటించడం నిజంగా ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఇదోక కొత్త ప్రపంచం.కాగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో పాన్ వరల్డ్ కల్కి చిత్రాని తెరకెక్కించాడు నాగ్ అశ్విన్.
వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్-దీపికా పదుకొనె హీరోహీరోయిన్లుగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దిశా పటానీ, నటి శోభనలు ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం రూపొందింది. ఇక ఇందులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలు కీ రోల్ పోషించనున్నాడని టాక్. ట్రైం ట్రావెలర్ నేపథ్యంలో విజువల్ వండర్‌గా కల్కి సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. మరి రిలీజ్‌కు ముందే రికార్డ్స్ కొల్లగోడుతున్న కల్కి విడుదల తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇలాంటి సినిమాను గతంలో నేనేప్పుడు చేయలేదు. ఇలాంటి సినిమాని అలోచించిన నాగ్ అశ్విన్‌కి, టీం అందరికీ అభినందనలు చెబుతున్నా. నిజానికి నాగి ఈ కథ చెప్పినపుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఇలాంటి కథ ఆయనకు ఎలా తట్టిందనేది సర్‌ప్రైజింగ్. అసలేం డ్రింక్ చేస్తే ఇలాంటి కథని అలోజించగలిగాడనిపించింది. మూవీలోని విజువల్స్ నమ్మశక్యం కానీ విధంగా ఉంటాయి. ఇదోకు అద్భుతమని చెప్పాలి. ఇలాంటి ఫ్యుచరిస్టిక్ ప్రాజెక్ట్ తీయడమనేది మహా అద్భుతం. తను అనుకున్న విజన్ ని వండర్ ఫుల్ గా స్క్రీన్ పై ప్రజెంట్ చేశారు నాగి. కల్కి మూవీ ఎక్స్ పీరియన్స్‌ని నేనేప్పటికి మర్చిపోలేను" అంటూ చెప్పుకోచ్చారు.
Also Read: ప్రెగ్నెంట్ దీపికకు ప్రభాస్ హెల్ప్... డార్లింగ్ అనేది ఇందుకే, 'కల్కి' ప్రీ రిలీజ్‌లో క్యూట్ మూమెంట్!