Lauren Gottlieb - Naatu Naatu : ఎన్టీఆర్, చరణ్ కాదు - ఆస్కార్స్‌లో 'నాటు నాటు' స్టెప్పులు వేయబోయేది ఈ అమ్మాయే
Oscars 2023 - Naatu Naatu Song Live Performance : ఆస్కార్ వేదికపై 'నాటు నాటు...'కు డ్యాన్స్ చేస్తున్నట్లు రామ్ చరణ్ చెప్పారు. అయితే, అటువంటిది ఏదీ లేదని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు.
'నాటు నాటు...' పాట (Naatu Naatu Song)లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) వేసిన స్టెప్పులు వాళ్ళిద్దరి అభిమానులను మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. ఆ సాంగ్, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ, హీరోల పెర్ఫార్మన్స్, దర్శక ధీరుడు రాజమౌళి టేకింగ్... ప్రతిదీ ఫెంటాస్టిక్. అందుకే, ఆస్కార్ వరకు ఆ పాట వెళ్ళింది.
ఆస్కార్ వేదికపై సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. వాళ్ళతో పాటు హీరోలు డ్యాన్స్ చేస్తే? అద్భుతమే కదా! అయితే... ఆ అవకాశం లేదు లెండి! ఆ మధ్య హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్టేజి మీద డ్యాన్స్ చేస్తారా? అని అడిగితే అవకాశం ఉందన్నట్లు రామ్ చరణ్ చెప్పారు. అయితే, అటువంటిది ఏమీ లేదని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు.
ఆస్కార్ వేడుకలో డ్యాన్స్ చేయడానికి రిహార్సల్స్ అవసరం అని, దానికి తగిన సమయం లేదని ఎన్టీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో హీరోలు ఇద్దరు డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లేదని క్లారిటీ వచ్చింది. అయితే, మరొకరు డ్యాన్స్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా?
ఝలక్ దిఖ్లాజా టు ఆస్కార్స్!
ఆస్కార్ వేదికపై 'నాటు నాటు...' పాటకు లైవ్ పెర్ఫార్మన్స్ చేయనున్నట్లు లారెన్ గాట్లీబ్ (Lauren Gottlieb) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? హిందీ బుల్లితెరలో ప్రసారమైన డ్యాన్స్ రియాలిటీ షో 'ఝలక్ దిఖ్లాజా' సీజన్ 6లో రన్నరప్! అంతే కాదు... 'ఏబీసీడీ : ఎనీ బడీ కెన్ డ్యాన్స్' (2013) సినిమాలో కూడా లారెన్ నటించారు.
''స్పెషల్ న్యూస్... నేను ఆస్కార్స్ లో 'నాటు నాటు...' పాటకు పెర్ఫార్మన్స్ చేస్తున్నా. ప్రపంచ ప్రఖ్యాత వేదికపై ఇండియాను రిప్రజెంట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. నన్ను విష్ చేయండి'' అని అమెరికన్ నటి, డ్యాన్సర్ లారెన్ పోస్ట్ చేశారు.
Also Read : చిరంజీవి కాళ్ళ మీద పడిన వేణు - 'బలగం' బృందానికి 'మెగా'స్టార్ ప్రశంసలు
View this post on Instagram
ఆల్రెడీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) అమెరికాకు చేరుకున్నారు. ఒక్క ఫ్రేములో ఇద్దరూ ఉన్న ఫోటో ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ, ఇద్దరూ వేర్వేరుగా దిగుతున్న ఫోటో షూట్స్ మాత్రం అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాయని చెప్పాలి. శంకర్ సినిమా కోసమే ఓ స్టైలిష్ లుక్ లోకి మారిన రామ్ చరణ్... అమెరికాలో ఆ స్టైల్ డోస్ మరింత పెంచుతూ అదిరిపోయే లుక్స్ తో అదరగొట్టాడు. కాస్య్టూమ్స్ కూడా చాలా రిచ్ గా లుక్ ను మరింత ఎలివేట్ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
Also Read : ఆ బూతులు, సెమీ న్యూడ్ సీన్లు ఏంటి? - తెలుగు ప్రేక్షకులకు 'రానా నాయుడు' షాక్
తనదైన మాస్ స్టైల్ తో జూనియర్ ఎన్టీఆర్ 'వావ్' అనిపిస్తున్నాడు. తన బాడీ లాగ్వేంజ్ కు సూట్ అయ్యేలా... అలాగే హాలీవుడ్ టేస్ట్ & స్టైల్ ను మ్యాచ్ చేసేలా తనను స్టైల్ గా ప్రెజెంట్ చేసుకుంటున్నాడు తారక్. ఆస్కార్ సంగతి పక్కన పెడితే తమ అభిమాన హీరోలు ఇద్దరూ ఇలా స్టైలిష్ లుక్స్ తో ఫోటో షూట్స్ చేయించుకుంటూ ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ మీల్స్ పెడుతున్నారు. ఇక ఆ ఆస్కార్ కూడా వచ్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? ఇండియా అంతా దద్దరిల్లిపోతుంది అంతే!