అన్వేషించండి

Mega156: కల్యాణ్ కృష్ణతో పాటుగా తెర మీదకి మరో దర్శకుడు, ఇద్దరిలో ఎవరు ఇంప్రెస్ చేస్తే వారికే మెగా ప్రాజెక్ట్?

Mega156 దర్శకుడు ఎవరనేది మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఇప్పటి వరకూ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి తదుపరి సినిమా ఉంటుందని అనుకుంటుండగా, ఇప్పుడు తాజాగా మరో డైరెక్టర్ పేరు తెర మీదకు వచ్చింది.

నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రెండు కొత్త సినిమాల అప్డేట్స్ వదిలారు. ఇన్నాళ్లూ వార్తల్లో ఉన్న Mega156 & Mega157 ప్రాజెక్ట్స్ ను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా నెక్స్ట్ చేయబోయే మూవీ డైరెక్టర్ ఎవరో వెల్లడించకుండా, ఆ తర్వాత నటించబోయే సినిమా వివరాలు ప్రకటించారు.

చిరంజీవి #Mega157 చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయనున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సోషియో ఫాంటసీ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. మంగళవారం రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. మరోవైపు #Mega156 మూవీని గోల్డ్‌ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో మెగా డాటర్ సుష్మిత కొణిదెల నిర్మాణంలో చేయనున్నట్లు తెలిపారు. మెగా రాకింగ్ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు చెప్పారు కానీ, డైరెక్టర్ ఎవరనేది రివీల్ చెయ్యలేదు.

పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయనున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. మలయాళ చిత్రం 'బ్రో డాడీ' తరహా స్క్రిప్ట్‌ను డెవలప్ చేసే బాధ్యతను 'బంగార్రాజు' దర్శకుడికి అప్పగించారని టాక్ నడిచింది. కానీ Mega156 అనౌన్స్ మెంట్ పోస్టర్ లో మాత్రం డైరెక్టర్ పేరు కనిపించలేదు. దీంతో ముందుగా అనుకున్న కథ మారబోతోందా? లేదా దర్శకుడే మారబోతున్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో 'భోళా శంకర్' మూవీ డిజాస్టర్ ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని, 'బ్రో డాడీ' లాంటి చిత్రం తనకు సరిపోతుందా అని చిరంజీవి ఆలోచనలలో పడ్డారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ ను తాత్కాలికంగా నిలిపివేసారని, అందుకే Mega156 పోస్టర్ లో కళ్యాణ్ కృష్ణ కురసాల పేరుని ప్రకటించలేదని అంటున్నారు. ఇక్కడ వినిపిస్తున్న మరో టాక్ ఏంటంటే.. చిరంజీవి 156వ సినిమా కోసం కల్యాణ్ కృష్ణతో పాటుగా మరో దర్శకుడు కూడా పరిశీలనలో ఉన్నారట. 

Also Read: MEGA156 - మెగా డాటర్ సుష్మిత నిర్మాతగా చిరంజీవి 'మెగా రాకింగ్' ఎంటర్టైనర్!

'ప్రేమ ఇష్క్ కాదల్' దర్శకుడు పవన్ సాధినేని.. మెగాస్టార్ తదుపరి ప్రాజెక్ట్ కోసం కథ రెడీ చేస్తున్నారట. ఇటీవల 'దయా' వెబ్ సిరీస్ తో మెప్పించిన పవన్.. అంతకముందు సుష్మిత కొణిదెల నిర్మాణంలో 'సేనాపతి' అనే సిరీస్ ను రూపొందించారు. ఆ సమయంలో చిరు కూడా పవన్ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు చిరంజీవి స్క్రిప్టు మీద వర్క్ చేస్తున్నారట. 

కల్యాణ్ కృష్ణ, పవన్ సాధినేనిలలో ఎవరు కథతో ఇంప్రెస్ చేస్తే వాళ్ల చేతికి ఈ Mega156 ప్రాజెక్ట్ వెళ్తుందని.. అందుకే నిన్నటి పోస్టర్ లో దర్శకుడి పేరు ప్రస్తావించలేదని సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజమెంతనేది తెలియదు కానీ.. చిరంజీవి నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరనేది తెలుసుకోవాలని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే 'భోళా శంకర్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత చేయబోయే సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. మరి త్వరలోనే Mega156 దర్శకుడిని ప్రకటిస్తారేమో చూడాలి.

Also Read: 'నా సామి రంగా' - సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయిన కింగ్?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
Eshwar Sai Reaction : నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్
నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget