MEGA156 Update: మెగా డాటర్ సుష్మిత నిర్మాతగా చిరంజీవి 'మెగా రాకింగ్' ఎంటర్టైనర్!
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తర్వాత సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. మెగా డాటర్ సుష్మిత కొణిదెల నిర్మాణంలో MEGA156 రూపొందనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
'భోళా శంకర్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించబోయే సినిమా ఏంటి? ఏ దర్శకుడితో చేస్తున్నారు? అనేది తెలుసుకోడానికి మెగా ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగస్టు 22) బిగ్ బాస్ బర్త్ డే స్పెషల్ గా రెండు కొత్త ప్రాజెక్ట్స్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్స్ వచ్చాయి. మంగళవారం ఉదయం Mega156 & Mega157 సినిమాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
చిరంజీవి తన కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ 156వ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో Mega156 మూవీ ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
''4 దశాబ్దాలుగా వెండితెరను శాసించిన లెగసీ! భావోద్వేగాలను రేకెత్తించే వ్యక్తిత్వం! ఆఫ్ స్క్రీన్ లోనూ సెలబ్రేట్ చేసుకునే వ్యక్తి.. 155 చిత్రాల తర్వాత, ఇప్పుడు #MEGA156 సినిమా ఒక మెగా రాకింగ్ ఎంటర్టైనర్ అవుతుంది'' అని మేకర్స్ ట్వీట్ చేసారు. ''ప్రేక్షకులను అలరించే, తరతరాలకు స్ఫూర్తినిచ్చే ప్రయాణం.. ఆన్ స్క్రీన్ బ్రిలియెన్స్ కి, ఆఫ్ స్క్రీన్ మాగ్నానిమిటీకి నిర్వచనంగా నిలిచిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు'' అని పేర్కొన్నారు.
A journey of entertaining audience and inspiring generations ❤️
— Gold Box Entertainments (@GoldBoxEnt) August 22, 2023
The man who stood as the definition of on screen brilliance and off screen magnanimity ❤🔥
@GoldBoxEnt and Team #Mega156 wishes MEGASTAR @KChiruTweets Garu a very Happy Birthday 💥#HBDMegastarChiranjeevi pic.twitter.com/Ws8qBvZIQO
MEGA156 చిత్రాన్ని సుష్మిత - విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి నిర్మించనున్నారు. శరణ్య పోట్ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనుంది. అయితే అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఈ సినిమా డైరెక్టర్ ఎవరనేది వెల్లడించలేదు. అయినప్పటికీ ఈ మూవీకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కళ్యాణ్ ట్వీట్లు రీట్వీట్లు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.
'సోగ్గాడే చిన్నినాయనా' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కళ్యాణ్ కృష్ణ.. 'రారండోయ్ వేడుకచూద్దాం' 'బంగార్రాజు' చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. ప్రస్తుతం MEGA156 మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇందులో చిరుతో పాటుగా ఓ యంగ్ హీరో కూడా నటిస్తారని.. ఇద్దరు హీరోలకు ఇద్దరు హీరోయిన్లు ఉంటారని అంటున్నారు. మరి త్వరలోనే వీటిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చిరంజీవి తన 157వ సినిమా చేయనున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దీనికి దర్శకత్వం వహించనున్నారు. లేటెస్టుగా MEGA157 చిత్రాన్ని ప్రకటించిన మేకర్స్.. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా విడుదల చేసారు. మెగాస్టార్ కోసం పంచభూతాలు ఏకం కాబోతున్నాయని తెలిపారు. పోస్టర్ ను బట్టి చూస్తే, ఇది 'అంజి' తరహాలో తెరకెక్కే సోషియో ఫాంటసీ మూవీ అని అర్థమవుతోంది. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడికానున్నాయి.
Also Read: బాస్ తలచుకుంటే బాక్సులు బద్దలు కావాల్సిందే, ఇదీ మెగాస్టార్ స్టామినా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial