(Source: ECI/ABP News/ABP Majha)
Allu Arjun: మాట మార్చిన అల్లు అర్జున్... పాత వీడియోలు తీసి మరీ ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్
Allu Arjun Trolls: 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఫస్ట్ ఫస్టుగా మాట్లాడిన మాటలు మెగాభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. పాత వీడియోలు తీసి మరీ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట మార్చారా? కొన్నాళ్ల క్రితం ఓ సినిమా వేడుకల్లో మాట్లాడిన మాటలు, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల మధ్య చాలా వ్యత్యాసం ఉందా? బన్నీలో మార్పు కనపడుతోందా? అంటే... 'అవును' అని మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అంటున్నారు. అల్లు అర్జున్ ఓల్డ్ స్పీచ్ వీడియోలు బయటకు తీసి మరీ ట్రోల్ చేస్తున్నారు. చిరంజీవి బర్త్ డే రోజు బన్నీని ట్రోల్ చేయడానికి కారణం ఏమిటి? అంటే... 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలు!
అభిమానులు చూసి హీరో అయ్యాను - అల్లు అర్జున్!
''నా అభిమానులు అంటే నాకు పిచ్చి. హీరోని చూసి ప్రేక్షకులంతా అభిమానులు అవుతారు. కానీ, నేను నా అభిమానులు చూసి హీరో అయ్యానని నేను ఎప్పుడూ అంటూ ఉంటాను'' అని 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన స్పీచ్ స్టార్ట్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ వ్యాఖ్యలు మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.
Thank you @alluarjun for never disappointing us!!
— Vamc Krishna (@lyf_a_zindagii) August 21, 2024
Once upon a time
1. #Chiranjeevi garini chusi, ayana valle hero ayyanu
2. Used to address Mega fans as they have given life to you
Now
1. Na fans valle nenu hero ayyanu 👏🏻👏🏻
2. Na fans, Na AArmy (Monna single ga nadichi… pic.twitter.com/ajweuS1KGd
సినిమా బాలేకున్నా వచ్చేది ఒక్క మెగాభిమానే!
''నేను ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అవుతోంది. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు గుర్తు ఉంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నాకు నాకు గుర్తు ఉంది. ఒక సినిమా బావుంటే జనరల్ ఆడియన్స్ వచ్చి చూస్తారు. సినిమా బాలేకున్నా వచ్చేది ఒక్క మెగా అభిమానే. ఫస్ట్ టికెట్ తెగేది ఒక్క చిరంజీవి అభిమానిదే. మేం స్టార్స్ అని ఇవాళ మాతో చాలామంది దర్శకులు, నిర్మాతలు సినిమా చేస్తారు. అది మా గొప్పదనం కాదు, మా వెనుకాల ఉన్న మీ బలం. మీరే (మెగా అభిమానులే) మా బలం. మమ్మల్ని మెగా హీరోస్ చేసిన చిరంజీవి, పవన్, చరణ్ అభిమానులకు, నా అభిమానులకు థాంక్స్'' అని 'ఇద్దరమ్మాయిలతో' ఈవెంట్‌లో అల్లు అర్జున్ స్పీచ్ ఇచ్చారు.
Also Read: ‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
Appudu : mega fans
— ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) August 21, 2024
Ippudu : AArmy 😂
Fans ni chusi hero ayyadu anta 🤷🏻
pic.twitter.com/8f6HAeU9zy
Fans ni chusi hero ayya
— OG (@Tejuholicc2) August 21, 2024
pic.twitter.com/1yzbQzDaf0
ఒకప్పుడు మెగా హీరో అని చెప్పిన బన్నీ... తన సినిమాలు బాలేకున్నా మెగా ఫ్యాన్ టికెట్ కొంటారని చెప్పిన బన్నీ... 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ఈవెంట్‌లో తన ఆర్మీ అని పేర్కొనడం, తన అభిమానులకు సినిమా నచ్చుతుందని చెప్పడం హైలైట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.
Hero ni chusi fans vastaru kani fans ni chusi hero avvadam anedi … vere level 🤷🏻
— ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) August 21, 2024
pic.twitter.com/MfR4e2FvPB
This speech by @prakashraaj 🔥
— ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) August 21, 2024
pic.twitter.com/XZ0T2iPveP https://t.co/O606tm3TBf
''మూడు నాలుగు విజయాలు వచ్చిన తర్వాత కొందరు అన్నయ్య (చిరంజీవి) తర్వాత మేమే అంటున్నారు. వాళ్లందరూ లైట్ కింద తిరిగే పురుగులు'' అని ఒక వేడుకలో ప్రకాష్ రాజ్ చెప్పిన మాటలు, హరీష్ శంకర్ మాటలు ట్వీట్ చేస్తూ బన్నీని ట్రోల్ చేస్తున్నారు.