అన్వేషించండి

Pushpa 2 First Look Records : అల్లు అర్జున్ మాస్ - ఒక్క లుక్కుతో రికార్డులు క్రియేట్ చేసిన పుష్పరాజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం విడుదల అయ్యింది. ఆ లుక్ రికార్డులు క్రియేట్ చేసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'పుష్ప 2' (Pushpa 2 Movie). పాన్ ఇండియా సక్సెస్ సాధించిన 'పుష్ప' చిత్రానికి ఇది సీక్వెల్. ఈ రోజు బన్నీ బర్త్ డే (Allu Arjun Birthday). అయితే, అభిమానులకు ఒక్క రోజు ముందు 'పుష్ప 2' టీమ్ గిఫ్ట్ ఇచ్చింది. సినిమాలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్, అలాగే 'వేర్ ఈజ్ పుష్ప' టీజర్ విడుదల చేసింది. ఆ లుక్, టీజర్ రికార్డులు క్రియేట్ చేశాయి. 

మోస్ట్ లైక్డ్ ఫస్ట్ లుక్!
'పుష్ప 2'లో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అయ్యింది. చీర కట్టి, ముక్కు పుడక పెట్టి, బొట్టుతో బన్నీ కొత్తగా కనిపించారు. తిరుపతిలో గంగమ్మ జాతరలో పురుషులు ఏ విధంగా పాల్గొంటారో, ఆ విధంగా కనిపించి ఔరా అనిపించారు. ఆ లుక్ రికార్డులు క్రియేట్ చేసింది. 

సోషల్ మీడియాలో లైకులే లైకులు!
అల్లు అర్జున్ 'పుష్ప 2' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... ట్విట్టర్‌లో 207కె, ఫేస్‌బుక్‌లో 5 మిలియన్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 850కె లైక్స్ వచ్చాయి. ఎక్కువ మంది లైక్ చేసిన లుక్ కింద 'పుష్ప 2' రికార్డు క్రియేట్ చేసింది. 

యూట్యూబ్‌లో 'వేర్ ఈజ్ పుష్ప' టీజర్ అయితే 24 గంటల్లో ఎక్కువ మంది చూసిన తెలుగు సినిమా టీజర్లలో 'ఇంట్రడ్యూసింగ్ పుష్ప రాజ్' మూడో స్థానంలో నిలిచింది. దీనికి 22.52 మిలియన్ వ్యూస్ వచ్చాయి. హిందీ వెర్షన్ టీజర్ 30 మిలియన్ వ్యూస్ కు చేరువలో ఉంది. యూట్యూబ్‌లో 24 గంటల్లో ఎక్కువ మంది లైక్ చేసిన టీజర్లలో రెండో స్థానంలో ఉంది. 793కె లైక్స్ వచ్చాయి. అదీ సంగతి!

Also Read 'జూబ్లీ' వెబ్ సిరీస్ రివ్యూ : స్టార్ హీరోయిన్ ఎఫైర్... సెక్స్ వర్కర్‌తో డైరెక్టర్ లవ్... అదితి రావు హైదరి నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే? 

'పుష్ప' ఎక్కడ ఉన్నాడో చెప్పేశారుగా!
'పుష్ప ఎక్కడ?' అంటూ యూనిట్ విడుదల చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ రోజు పుష్పరాజ్ ఎక్కడ ఉన్నాడో చెప్పేశారు. తొలి భాగంలో చూపించిన దానికి పూర్తి భిన్నంగా మలి భాగం ఉంటుందని పుష్ప ఎక్కడ ఉన్నాడో రివీల్ చేసిన వీడియో చూస్తే అర్థం అవుతోంది. 

శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ ఉన్నట్లు చూపించారు. 'పుష్ప'లో కథానాయకుడిని కేవలం స్మగ్లర్ కింద చూపిస్తే... ఇప్పుడీ రెండో భాగంలో ఆయన్ను నాయకుడిని చేశారు. స్మగ్లింగ్ చేసి సంపాదించిన డబ్బుతో పేదలకు ఓ దారి చూపించడం మాత్రమే కాదు... వాళ్ళ పిల్లలకు విద్య, అవసరమైన వాళ్ళకు వైద్యం చేయించినట్టు తెలిపారు. దాంతో 'పుష్ప'కు అభిమానులు ఏర్పడ్డారు. 

పులి రెండు అడుగులు వెనక్కి వేస్తే... 
'వేర్ ఈజ్ పుష్ప' వీడియో మొత్తం ఒక ఎత్తు... చివరలో కేశవ చెప్పే మాట మరో ఎత్తు! అడవిలో పులుల జాడ తెలుసుకోవడం కోసం నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఓ కెమెరాలో పులి కనబడుతుంది. అలాగే, కంబలి కప్పుకున్న మరో మనిషి కూడా! అతడిని చూసి పులి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. అప్పుడు వెనుక ఓ డైలాగ్. 'అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వస్తే పుష్ప వచ్చాడని అర్థం' అని కేశవ చెప్పే డైలాగుతో పుష్ప ముఖాన్ని చీకటిలో చూపించారు. పుష్ప బతికి ఉన్నాడని ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ ఇన్ అసోసియేట్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో రష్మికా మందన్నా (Rashmika Mandanna) మరోసారి సందడి చేయనున్నారు.

Also Read 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Embed widget