అన్వేషించండి

Pushpa 2 Announcement Glimpse : పుష్ప ఎక్కడ? జైలు నుంచి ఎలా వచ్చాడు? అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చిన వీడియో

Allu Arjun Birthday Special : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందడి ఆల్రెడీ మొదలైంది. 'పుష్ప 2' గురించి యూనిట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది.

'పుష్ప'... ఇప్పుడు ఇది ఒక సినిమా పేరు కాదు, బ్రాండ్! పుష్పరాజ్ (Pushparaj)... ఇది ఒక క్యారెక్టర్ కాదు, చాలా మందికి ఎమోషన్! 'తగ్గేదే లే' అనేది ఎంతో మందికి ఊత పదంగా మారింది. ఆ మేనరిజమ్ వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యింది. దాంతో 'పుష్ప 2' (Pushpa 2 Movie) సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ రోజు సినిమా యూనిట్ విడుదల చేసిన చిన్న వీడియో మరిన్ని అంచనాలు పెంచింది. 

ఏప్రిల్ 7న 'పుష్ప 2' గ్లింప్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా పాన్ ఇండియా సక్సెస్ సాధించిన 'పుష్ప' చిత్రానికి సీక్వెల్ (Pushpa Sequel)గా రూపొందుతున్న సినిమా 'పుష్ప 2'. ఇందులో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉంటుందనేది ఈ నెల 7న ప్రేక్షకులకు చూపించనున్నారు. 

Allu Arjun Birthday Special : ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఒక్క రోజు ముందు అభిమానులకు కానుక ఇవ్వాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ నెల 7న సాయంత్రం 4.05 గంటలకు 'పుష్ప 2' గ్లింప్స్ విడుదల చేస్తామని ఈ రోజు తెలిపారు. ఆల్రెడీ విడుదల చేసిన చిన్న వీడియో చూస్తే...

తిరుపతి జైలు నుంచి పుష్పరాజ్ తప్పించుకుంటాడు. పుష్ప ఎక్కడ? అంటూ అందరిలో ఆసక్తి మొదలవుతుంది. అదీ వీడియోలో సారాంశం. 'తిరుపతి జైలు నుంచి బుల్లెట్  గాయాలతో తప్పించుకున్న పుష్ప' అని వార్తల్లో రావడం, ప్రజలు, హడావిడి వీడియోలో అంశాలు అన్నీ సినిమాపై హైప్ పెంచాయి.  

ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ ఇన్ అసోసియేట్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్. ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెష్ చెబుతూ చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. 

Also Read : బాలీవుడ్‌లో ఎన్టీఆర్ భారీ సినిమా - హృతిక్ రోషన్ 'వార్ 2'లో!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pushpa (@pushpamovie)

'పుష్ప' సినిమా విడుదల అయినప్పుడు ఎవరూ ఊహించలేదు. నార్త్ ఇండియాలో జనాలను ఆ సినిమా అంతలా ఆకట్టుకుంటుందని! తెలుగులో కంటే హిందీలో 'పుష్ప'కు ఎక్కువ లాభాలు వచ్చాయి. ఆ మాటకు వస్తే 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలైనప్పుడు ఎవరైనా విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఊహించారా? లేదు కదా! థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ 'ఆర్ఆర్ఆర్'కు విదేశాల నుంచి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇప్పుడు తెలుగు సినిమాలకు డిమాండ్ పెరుగుతోంది.

'పుష్ప 2' డిజిటల్ రైట్స్ 200 కోట్లు?
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న తెలుగు సినిమా 'పుష్ప 2'. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ భారీ సక్సెస్ సాధించడం... రెండో పార్ట్ మీద అంచనాలు పెంచింది. ఆ క్రేజ్ ఓటీటీ రైట్స్ విషయంలో కనబడుతోంది. 'పుష్ప 2' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం 200 కోట్ల రూపాయలు కోట్ చేస్తున్నారట. అంత భారీ మొత్తం అయినా సరే ఇచ్చి, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకోవాలని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ట్రై చేస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.
 
Also Read : ఎన్నాళ్లో వేచిన ఉదయం - పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా షూటింగ్ మొదలైందోచ్!

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget