Ustad Bhagat Singh Movie : ఎన్నాళ్లో వేచిన ఉదయం - పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా షూటింగ్ మొదలైందోచ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన అభిమాని హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్ నేడు మొదలైంది.
'ఎన్నాళ్ళో వేచిన ఉదయం...' పాట గుర్తు ఉందా? సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన 'మంచి మిత్రులు' సినిమాలోనిది. ఇప్పుడీ పాటను దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. ''And the Day has arrived!!!!!! #UstaadBhagathSingh'' అని పేర్కొన్నారు. దాంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి ఖుషిగా ఉన్నారు. ఎందుకు? అంటే...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా ఆయన వీరాభిమాని, తనను తాను పవన్ భక్తుడిగా పేర్కొన్న హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagat Singh). ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. అందుకని, 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం...' అంటూ హరీష్ శంకర్ పేర్కొన్నారు.
And the Day has arrived !!!!!! #UstaadBhagathSingh pic.twitter.com/bkXFUjyM2r
— Harish Shankar .S (@harish2you) April 5, 2023
ఢిల్లీ నుంచి వచ్చిన పవన్...
సినిమా కోసం భారీ సెట్!
రాజకీయ కార్యక్రమాల నిమిత్తం నిన్నటి వరకు ఢిల్లీలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారు. నిన్న రాత్రి ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ రోజు ఉదయం 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రీకరణ స్టార్ట్ చేశారు. సినిమా కోసం ఆయన సన్నిహిత మిత్రుడు, ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి భారీ సెట్ వేశారు. అందులో పవన్, ఇతర తారాగణం పాల్గొనగా... కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.
నిజమే... పదేళ్లకు పైగా వేచిన ఉదయం!
పవన్ కళ్యాణ్ అంటే హరీష్ శంకర్ (Harish Shankar)కు విరీతమైన అభిమానం. తన అభిమాన హీరోతో సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. మాస్ మహారాజా రవితేజతో తీసిన 'మిరపకాయ్' కథను తొలుత పవన్ కళ్యాణ్‌కు వినిపించారు. కానీ, ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. ఆ తర్వాత 'గబ్బర్ సింగ్'తో రికార్డులు క్రియేట్ చేశారు. ఆ సినిమా మే 11, 2012న విడుదల అయ్యింది. పదేళ్ల తర్వాత మళ్ళీ పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్ కుదిరింది. అందుకని, 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం...' అంటూ హరీష్ శంకర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Also Read : తమిళ హిట్‌ను తెలుగుకు తీసుకొస్తున్న అల్లు అరవింద్
తమిళ హిట్ 'తెరి'కి రీమేక్ ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కళ్యాణ్ ఇమేజ్, తెలుగు నేటివిటీ దృష్టిలో పెట్టుకుని హరీష్ శంకర్ కథలో మార్పులు చేశారట. 'గబ్బర్ సింగ్' చూస్తే... సల్మాన్ ఖాన్ 'దబాంగ్' రీమేకేనా? అని డౌట్ వస్తుంది. ఈ సినిమాకు కూడా అలా చేశారట.
శ్రీలీల ఒక హీరోయిన్...
పూజా హెగ్డే సైన్ చేయాలి!
'తెరి'లో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. మరి, పవన్ కళ్యాణ్ సరసన ఎవరు నటిస్తారు? ఇప్పుడీ ప్రశ్న ఎక్కువ మందిలో ఉంది. ఓ నాయికగా శ్రీలీలను ఎంపిక చేశారు. మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే అని టాక్. అయితే, ఆమె ఇంకా సినిమాకు సంతకం చేయలేదు. త్వరలో చేసే అవకాశాలు ఉన్నాయట.
'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు. సినిమాకు గత ఏడాది డిసెంబర్ లో పూజ చేశారు. ఇందులో వీజే సన్నీ ఓ రోల్ చేస్తున్నారు.
Also Read : జపాన్‌లో 'రంగస్థలం' రిలీజ్ - ఎప్పుడంటే?
May 11th 2012 to Dec 11th 2022.
— Harish Shankar .S (@harish2you) December 11, 2022
It's not just a few years of waiting.. it's a decade of me waiting and wanting to get back on sets with our dearest @PawanKalyan garu ❤️#UstaadBhagatSingh begins today 😍😍🙏🙏
మనల్ని ఎవడ్రా ఆపేది..@MythriOfficial @ThisIsDSP @DoP_Bose pic.twitter.com/7PJWaLKvBW