అన్వేషించండి

Viduthalai Part 1 in Telugu : తమిళ హిట్‌ను తెలుగుకు తీసుకొస్తున్న అల్లు అరవింద్

తమిళ కమెడియన్ సూరి కథానాయకుడిగా జాతీయ పురస్కార గ్రహీత వెట్రిమారన్ తెరకెక్కించిన సినిమా 'విడుతలై'. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు.

జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran) రూపొందించిన సినిమా 'విడుతలై'. ఇందులో తమిళ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన హాస్య నటుడు సూరి (Tamil Comedian Soori) కథానాయకుడిగా నటించారు. ప్రత్యేకమైన ప్రధాన పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించారు. తమిళనాడులో గత నెలలో (మార్చి 31న) విడుదల అయ్యింది. ఇప్పుడీ సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అల్లు అరవింద్ చేతికి 'విడుతలై'
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind)కి చెందిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా 'విడుతలై' తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. దర్శకుడు వెట్రిమారన్, నిర్మాత ఎల్రెడ్ కుమార్ ఇటీవల గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వచ్చారు. అల్లు అరవింద్‌ను కలిశారు. తమ సినిమాను తెలుగులో విడుదల చేయమని కోరడంతో ఆయన ఓకే అని చెప్పారని తెలిసింది. 

మంచి సినిమాలను ప్రోత్సహించడంలో అల్లు అరవింద్ ఎప్పుడూ ఓ అడుగు ముందు ఉంటారు. ట్రెండ్ ఫాలో అవ్వడమే కాదు, ట్రెండీ సినిమాలు కూడా తీసుకుంటారు. న్యూ ఏజ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ప్రొడ్యూస్ చేయడం కోసం జీఏ2 పిక్చర్స్ స్టార్ట్ చేశారు. ఇతర భాషల్లో విడుదలైన మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించడం కోసం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. కన్నడ బ్లాక్ బస్టర్ 'కాంతార'ను తెలుగులో విడుదల చేశారు. ఇప్పుడు 'విడుతలై'ను తీసుకు వస్తున్నారు.

విడుతలై... పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్!
పీరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్ (Viduthalai Part 1 Genre)గా 'విడుతలై పార్ట్ 1'ను వెట్రిమారన్ తెరకెక్కించారు. రెండు భాగాలుగా సినిమా రూపొందింది. ఒకేసారి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారు. తమిళనాట థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ కలెక్షన్లు భారీగా వస్తున్నాయి.

'విడుతలై'లో ధనుష్ పాట...
తెలుగులో ఎవరు పాడతారో?
'విదుతలై పార్ట్ 1'లో ఓ పాటను ప్రముఖ తమిళ కథానాయకుడు ధనుష్ పాడారు. ఇళయరాజా సంగీతంలో 'ఓన్ దొణక్కి నాందా' అంటూ ఆయన పాడిన పాట హృద్యంగా సాగుతుంది. తమిళ ప్రేక్షకుల నుంచి ఆ పాటకు విపరీతమైన స్పందన లభించింది. ఆ సాంగ్ మేకింగ్ వీడియో చూస్తే... ఇళయరాజా దగ్గర ఉండి మరీ ధనుష్ చేత పాడించారు. తెలుగులో ఆ పాటను ఎవరు పాడతారో చూడాలి. 

Also Read జపాన్‌లో 'రంగస్థలం' రిలీజ్ - ఎప్పుడంటే? 

వెట్రిమారన్ దర్శకుడిగా పరిచయమైన 'పొల్లదావన్'లో ధనుష్ హీరోగా నటించారు. ఆ తర్వాత 'ఆడుకాలమ్', 'వడా చెన్నై', 'అసురన్' సినిమాలు చేశారు. 'కాక ముట్టై' సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. అందువల్ల, ధనుష్ పాట పాడారు.

విజయ్ సేతుపతి, సూరితో పాటు భవాని శ్రీ, ప్రకాశ్ రాజ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon), రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రానికి ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందించారు. వెల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. 

Also Read అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండగ - ముందు రోజు ఫస్ట్ లుక్, బర్త్‌డేకి గ్లింప్స్! 

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget