Pushpa 2 First Look : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండగ - ముందు రోజు ఫస్ట్ లుక్, బర్త్‌డేకి గ్లింప్స్!
Allu Arjun Birthday - Pushpa 2 Glimpse : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు పుట్టినరోజు కానుక ఇవ్వడానికి 'పుష్ప 2' యూనిట్ రెడీ అయ్యింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) పుట్టినరోజు సందడి మొదలైంది. ఈ నెల 8న ఆయన బర్త్ డే (Bunny Birthday). ఏప్రిల్ 8 కంటే ముందు నుంచి 'పుష్ప 2' (Pushpa 2 Movie) సందడి మొదలు కానుంది.
ఏప్రిల్ 7న ఫస్ట్ లుక్...
8న 'పుష్ప 2' గ్లింప్స్!
Pushpa 2 Movie First Look : అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా... ఒక్క రోజు ముందు (ఏప్రిల్ 7న) 'పుష్ప 2'లో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి ప్లాన్ చేశారని తెలిసింది. బర్త్ డే రోజు గ్లింప్స్ రిలీజ్ చేస్తారట. 'పుష్ప'తో కంపేర్ చేస్తే... 'పుష్ప 2'లో అల్లు అర్జున్ లుక్ డిఫరెంట్ గా ఉండబోతుందని తెలిసింది. ఈ మధ్య ఆయన లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నారు. అది ఈ సినిమా కోసమే అని టాక్. ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని... అభిమానులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులని ఆకట్టుకుంటాయని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
'పుష్ప' సినిమా (Pushpa Movie) విడుదలైనప్పుడు ఎవరూ ఊహించలేదు. నార్త్ ఇండియాలో జనాలను ఆ సినిమా అంతలా ఆకట్టుకుంటుందని! తెలుగులో కంటే హిందీలో 'పుష్ప'కు ఎక్కువ లాభాలు వచ్చాయి. ఆ మాటకు వస్తే 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలైనప్పుడు ఎవరైనా విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఊహించారా? లేదు కదా! థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ 'ఆర్ఆర్ఆర్'కు విదేశాల నుంచి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇప్పుడు తెలుగు సినిమాలకు డిమాండ్ పెరుగుతోంది.
Also Read : జీ చేతికి అనుష్క 'శెట్టి' సినిమా - డిజిటల్, శాటిలైట్ రెండూ!
'పుష్ప 2' డిజిటల్ రైట్స్ 200 కోట్లు?
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న తెలుగు సినిమా 'పుష్ప 2'. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ భారీ సక్సెస్ సాధించడం... రెండో పార్ట్ మీద అంచనాలు పెంచింది. ఆ క్రేజ్ ఓటీటీ రైట్స్ విషయంలో కనబడుతోంది. 'పుష్ప 2' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం 200 కోట్ల రూపాయలు కోట్ చేస్తున్నారట. అంత భారీ మొత్తం అయినా సరే ఇచ్చి, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకోవాలని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ట్రై చేస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.
'పుష్ప 2'... అంతకు మించి!
ఆల్రెడీ 'పుష్ప 2' షూటింగ్ స్టార్ట్ చేశారు. కొన్ని రోజులు హైదరాబాదులో, విశాఖలో కీలక సన్నివేశాలు షూటింగ్ చేశారు. హీరోయిన్ రష్మిక సైతం 'రెయిన్ బో' సినిమా ఓపెనింగులో 'పుష్ప 2' మరింత బావుంటుందని రష్మిక తెలిపారు. మైండ్ బ్లోయింగ్ అన్నారు. అంతే కాదు... అంతకు ముందు ఓ సందర్భంలోనూ సినిమా గురించి గొప్పగా చెప్పారు.
ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సునీల్ తదితరులు 'పుష్ప 2'లో కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులోనూ రష్మిక హీరోయిన్. 'పుష్ప' విడుదలైన తర్వాత 'తగ్గేదే లే' పాపులర్ అయ్యింది. ఇప్పుడు 'అస్సలు తగ్గేదే లే' అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : ఐదేళ్ళ తర్వాత ఇండియన్ సినిమాలో అమీ జాక్సన్ - యాక్షన్ రోల్‌తో రీ ఎంట్రీ