Mission Chapter 1 Movie : ఐదేళ్ళ తర్వాత ఇండియన్ సినిమాలో అమీ జాక్సన్ - యాక్షన్ రోల్‌తో రీఎంట్రీ
Amy Jackson In Mission : అరుణ్ విజయ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'మిషన్ చాప్టర్ 1'. ఇందులో అమీ జాక్సన్ హీరోయిన్. ఐదేళ్ల తర్వాత ఆమె నటించిన ఇండియన్ సినిమా ఇది.
భారతీయ సినిమాకు బ్రిటిష్ భామ అమీ జాక్సన్ (Amy Jackson) తిరిగి వచ్చింది. ఓ పాన్ ఇండియా సినిమాలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ చేస్తున్నారామె. కథానాయికగా 'మదరాసు పట్టణం'తో అమీని తమిళ చలన చిత్ర పరిశ్రమకు దర్శకుడు ఏఎల్ విజయ్ పరిచయం చేశారు. ఆమె రీ ఎంట్రీ సినిమాకూ ఆయనే దర్శకుడు కావడం విశేషం. అసలు వివరాల్లోకి వెళితే...
రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'బ్రూస్ లీ' సినిమాల్లో నటించిన అరుణ్ విజయ్ (Arun Vijay) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'మిషన్ చాప్టర్ 1' (Mission Chapter 1 Movie). యాక్షన్ థ్రిల్లర్, ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇందులో అమీ జాక్సన్ నటిస్తున్నారు. హీరోతో పాటు సమానంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆమె ఇరగదీశారట!
ఏప్రిల్ 5న ట్రైలర్ రిలీజ్!
Mission Chapter 1 Trailer : ఏప్రిల్ 5న... అనగా రేపు (మంగళవారం) 'మిషన్ చాప్టర్ 1' ట్రైలర్ విడుదల కానుంది. చెన్నైలో అభిమానుల సమక్షంలో వేడుకగా ట్రైలర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భాగస్వామి అయ్యింది. ఈ విషయాన్ని అమీ జాక్సన్ ఓ వీడియోలో వెల్లడించారు. విక్రమ్ 'ఐ', తెలుగులో రామ్ చరణ్ 'ఎవడు' సినిమాల్లో కూడా అమీ జాక్సన్ నటించారు. రజనీకాంత్ '2.0' (2018) తర్వాత ఆమె నటించిన ఇండియా సినిమా ఇదే.
Also Read : సల్మాన్, వెంకీతో రామ్ చరణ్ లుంగీ డ్యాన్స్ - కుమ్మేశారంతే!
View this post on Instagram
భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్... లైకా!
Lyca Productions : తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెలుసు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ '2.0'... విక్రమ్, 'జయం' రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ తదితర భారీ తారాగణంతో మణిరత్నం రూపొందించిన విజువల్ వండర్ 'పొన్నియిన్ సెల్వన్'తో పాటు ఎన్నో భారీ చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న కమల్ హాసన్ 'ఇండియన్ 2' సినిమానూ ఆ సంస్థే నిర్మిస్తోంది.
'మిషన్ చాప్టర్ 1' రషెష్ చూసిన లైకా ప్రతినిథులు... తమ సంస్థ ద్వారా సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. టోటల్ నెగిటివ్ రైట్స్ కొనేశారు. నిర్మాతలు ఎం. రాజశేఖర్, ఎస్. స్వాతితో కలిసి దక్షిణాది భాషలు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల లైకా ప్రొడక్షన్స్ సంస్థ 'మిషన్' సినిమాను విడుదల చేయనుంది.
డూప్ లేకుండా స్టంట్స్ చేసిన అరుణ్ విజయ్!
'మిషన్ చాప్టర్' కోసం లండన్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీగా ఖర్చుతో ఓ జైలు సెట్ వేశారు. స్టంట్ సిల్వ యాక్షన్ కొరియోగ్రఫీలో భారీ ఫైట్స్ తీశారు. డూప్ లేకుండా రిస్కీ యాక్షన్ సన్నివేశాలను హీరో అరుణ్ విజయ్ చేశారని యూనిట్ సభ్యులు చెప్పారు. నిమిషా సజయన్, అబి హాసన్, భరత్ బొపన్న, బేబి ఇయల్, విరాజ్ ఎస్, జాసన్ షా తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
Also Read : నేనెప్పుడు అన్నాను? - శోభితతో చైతూ డేటింగ్ మీద సమంత క్లారిటీ
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets