By: Satya Pulagam | Updated at : 04 Apr 2023 04:13 PM (IST)
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలో అనుష్క
అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఇందులో ఆమెకు జోడీగా యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మేశారు.
'జీ' చేతికి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'
అనుష్క సినిమా శాటిలైట్ & డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ జీ చేతికి వెళ్లాయి. అవును... 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' డిజిటల్ రైట్స్‌ను 'జీ' గ్రూప్ కొనుకోలు చేసింది. సినిమా విడుదలైన కొన్ని రోజులకు 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు జీ గ్రూప్ ఛానళ్లలో టెలికాస్ట్ చేస్తారు.
అనుష్క సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన 'భాగమతి' హిందీ, తమిళ వెర్షన్స్ 'జీ 5'లో ఉన్నాయి. 'సైజ్ జీరో' తెలుగు వెర్షన్ కూడా 'జీ 5'లో వీక్షకులకు అందుబాటులో ఉంది. ఆమె నటించిన మరికొన్ని సినిమాలూ ఉన్నాయి.
సుమారు ఐదేళ్ళ తర్వాత అనుష్క శెట్టి నుంచి థియేటర్లలోకి వస్తున్న సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. 'భాగమతి' తర్వాత అనుష్క 'నిశ్శబ్దం' సినిమా చేశారు. అయితే, ఆ సినిమా ఓటీటీలో విడుదల అయ్యింది. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన హిస్టారికల్ సినిమా 'సైరా నరసింహా రెడ్డి'లో ఝాన్సీ లక్ష్మీ బాయి రోల్ చేశారు. అందువల్ల, ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. మరో విశేషం ఏమిటంటే... 'జాతి రత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి వస్తున్న సినిమా కూడా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'యే. అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్... యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ ఇమేజ్... అన్నీ కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాపై క్రేజ్ పెంచాయి. అందుకని, విడుదల తేదీ ఖరారు కావడానికి ముందు డిజిటల్, శాటిలైట్ హక్కులను ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసి మరీ జీ 5, తెలుగు సంస్థలు తీసుకున్నాయి. ఆల్రెడీ విడుదలైన 'నో నో...' పాటకు మంచి స్పందన లభిస్తోంది.
Also Read : ఐదేళ్ళ తర్వాత ఇండియన్ సినిమాలో అమీ జాక్సన్ - యాక్షన్ రోల్‌తో రీ ఎంట్రీ
వంటలక్క... అనుష్క!
ఈ సినిమాలో అనుష్క షెఫ్ రోల్ చేస్తున్నారు. అదీ ఇంటర్నేషనల్ షెఫ్! ఆమె బర్త్ డే సందర్భంగా అన్విత రవళి శెట్టి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. అలాగే, అనుష్క వంట చేస్తున్న స్టిల్ కూడా విడుదల చేశారు. టైటిల్ రివీల్ చేసిన సందర్భంగా విడుదల చేసిన స్టిల్ గమనిస్తే... లండన్ సిటీలో అనుష్క శెట్టి, హైదరాబాద్ సిటీలో నవీన్ పోలిశెట్టి ఉన్నట్లు అర్థం అవుతోంది. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయనున్నట్లు యూవీ క్రియేషన్స్ సంస్థ పేర్కొంది.
అనుష్కకు 48వ చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. వాటి తర్వాత ఆ సంస్థలో అనుష్క నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. త్వరలో సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం... నాలుగు దక్షిణాది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హిందీలో విడుదల చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం.
Also Read : పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చిన పూర్ణ
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!
Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?
Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!
Flautist Naveen Kumar: ఏఆర్ రెహ్మాన్ ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్‌కి బైడెన్ ప్రశంసలు, లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్‌తో సత్కారం
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్
MP Arvnid: కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నరు: ఎంపీ అర్వింద్