అన్వేషించండి

Pushpa 2 Release Plans : వేసవికి 'పుష్ప 2' విడుదల డౌటే - అల్లు అర్జున్ & సుకుమార్ ఏం చేస్తారో?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సూపర్ హిట్ 'పుష్ప'కు సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా 'పుష్ప 2'. తొలుత వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'పుష్ప 2' (Pushpa 2 Movie). దీనికి క్రియేటివ్ జీనియస్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్నారు. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన పాన్ ఇండియా హిట్ 'పుష్ప'కు సీక్వెల్ ఇది. 

డిసెంబర్ 17, 2021న 'పుష్ప' విడుదల అయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ మరో సినిమా చేయలేదు. అప్పటి నుంచి 'పుష్ప 2' మీద మాత్రమే ఉన్నారు. సుమారు ఏడాదిన్నరగా ఈ సినిమా చేస్తున్నారు. మరి, 'పుష్ప 2' ప్రోగ్రెస్ ఏమిటి? అనేది చిత్ర బృందానికి మాత్రమే తెలుసు. అప్డేట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు నిరసనలు, సోషల్ మీడియాలో నేషనల్ ట్రెండ్స్ చేసే వరకు వెళ్ళారు. ఫిల్మ్ నగర్ వర్గాల్లో కొత్తగా వినబడుతున్న ఓ విషయం వాళ్ళకు కొంచెం కోపం తెప్పించవచ్చు. 

2024 వేసవిలో 'పుష్ప 2' విడుదల డౌటే!
Pushpa 2 Release Date : తొలుత 2024 సమ్మర్ సీజన్ టార్గెట్ చేస్తూ 'పుష్ప 2'ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... ప్రస్తుతం జరుగుతున్న చిత్రీకరణ స్పీడ్ చూస్తే... వేసవికి సినిమా రావడం కష్టం అని వినపడుతోంది. ఇప్పటి వరకు 40 శాతం చిత్రీకరణ మాత్రమే పూర్తి అయ్యిందని గుసగుస. ముందుగా అనుకున్న విధంగా కాకుండా కథలో సుకుమార్ కాస్త మార్పులు, చేర్పులు చేశారట. యాక్షన్ డోస్ పెంచారట. త్వరలో థాయ్‌లాండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని సమాచారం. షూటింగ్ అంతా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ & సుకుమార్ విడుదలపై ఓ నిర్ణయం తీసుకుంటారట.

Also Read : 'సలార్' నటీనటులకు హోంబలే ఆ కండిషన్ పెట్టిందా? - ఆ ఒక్కటీ లీక్ కాకూడదని!

'పుష్ప 2' టీమ్... మేలుకోండి!
అప్డేట్... ఒక్క అప్డేట్... 'పుష్ప 2' నుంచి ఒక్క అప్డేట్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఆ అప్డేట్ కోసమే 'పుష్ప 2' టీమ్ మీద ట్విట్టర్ వేదికగా ఎటాక్ చేశారు. 'పుష్ప 2' అప్డేట్ ఇవ్వడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ఇతర యూనిట్ సభ్యులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. #WakeUpTeamPushpa అంటూ ట్వీట్స్ చేశారు. నేషనల్ లెవల్ ట్రెండ్ చేశారు. 

Also Read 'జైలర్' థియేట్రికల్ బిజినెస్ ఎంత? రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?

ట్విట్టర్ ట్రెండ్ కంటే ముందు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో 'మాకు పుష్ప అప్డేట్ కావాలి' (We Want Pushpa 2 Update) అంటూ బ్యానర్లు పట్టుకుని, స్లోగన్స్ వినిపిస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖ, అనంతపురం, ఆసిఫాబాద్, కాకినాడతో పాటు కేరళలోని త్రిసూర్, ఒడిశాలోని గోపాలపూర్, దుబాయ్ తదితర ప్రాంతాల్లో కూడా అల్లు అర్జున్ అభిమానులు బ్యానర్లతో నిరసన తెలిపారు.

'పుష్ప 2'లో విలన్, భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర చేస్తున్న ఫహాద్ ఫాజిల్ లుక్ ఈ రోజు విడుదల చేశారు. ఆయన బర్త్ డే సందర్భంగా అభిమానులకు కానుక ఇచ్చారు. అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ తదితరులు ఇతర ప్రధాన తారాగణం.  

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada: కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
Hathras Stampede: హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Hathras Stampede: బాబాలను నమ్ముతున్న భక్తులదా, నమ్మేలా చేస్తున్న పేదరికానిదా - ఎవరిది తప్పు?
బాబాలను నమ్ముతున్న భక్తులదా, నమ్మేలా చేస్తున్న పేదరికానిదా - ఎవరిది తప్పు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada: కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
Hathras Stampede: హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Hathras Stampede: బాబాలను నమ్ముతున్న భక్తులదా, నమ్మేలా చేస్తున్న పేదరికానిదా - ఎవరిది తప్పు?
బాబాలను నమ్ముతున్న భక్తులదా, నమ్మేలా చేస్తున్న పేదరికానిదా - ఎవరిది తప్పు?
AP Intelligence Chief: ఢిల్లీ నుంచి తీసుకొచ్చి లడ్హాకు నిఘా పని ఎందుకు అప్పగించినట్టు?బాబులా ఆయన కూడా మృత్యువు అంచుల దాకా వెళ్లి వచ్చారని తెలుసా?
ఢిల్లీ నుంచి తీసుకొచ్చి లడ్హాకు నిఘా పని ఎందుకు అప్పగించినట్టు?బాబులా ఆయన కూడా మృత్యువు అంచుల దాకా వెళ్లి వచ్చారని తెలుసా?
Andhra Pradesh News: వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
Embed widget