Allu Arjun : జర్మనీ వెళ్లిన అల్లు అర్జున్ - ఎందుకో తెలుసా?
Allu Arjun : అల్లు అర్జున్ నేడు ఉదయం జర్మనీకి బయలుదేరారు. అక్కడ జరిగే ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డ్స్ లో బన్నీ పాల్గొననున్నట్లు తెలిసింది.
Allu Arjun jets off to Berlin : 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. అప్పటిదాకా స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ 'పుష్ప'తో ఐకాన్ స్టార్ ట్యాగ్ ఇచ్చారు. దాంతో ప్రజెంట్ అల్లు అర్జున్ క్రేజ్ ఎల్లలు దాటుతోంది. 'పుష్ప' సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఊహించని సక్సెస్ అందుకుంది. దాంతో హీరోగా అల్లు అర్జున్ క్రేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి చేరింది. 'పుష్ప' దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాతో అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోని పలు ఫిలిం ఫెస్టివల్స్ లో 'పుష్ప' మూవీకి గుర్తింపు లభించింది. తాజాగా మరో ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘పుష్ప’ మూవీకి అరుదైన గుర్తింపు దక్కింది. దీంతో ఆ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనేందుకు అల్లు అర్జున్ బయలుదేరారు.
జర్మనీకి బయలుదేరిన బన్నీ
జర్మనీలోని బెర్లిన్ లో జరిగే ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు అల్లు అర్జున్ నేడు ఉదయం హైదరాబాద్ నుంచి జర్మనీకి బయలుదేరారు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈరోజు ఉదయమే బన్నీ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. జర్మనీలోని బెర్లిన్ లో జరిగే ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ టాలీవుడ్ తరపున వెళ్తున్న ఏకైక హీరో అల్లు అర్జున్ కావడం విశేషం.
Icon star 🌟 @alluarjun is en route to Germany 🇩🇪 to represent the richness of Indian cinema at a prestigious film festival in Berlin.#AlluArjun #Pushpa2TheRule #Pushpa #Berlinale pic.twitter.com/0hHRZjdMks
— Allu Arjun Official (@TeamAAOfficial) February 15, 2024
'పుష్ప2' అంతకుమించి ఉంటుంది - సుకుమార్
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుకుమార్ 'పుష్ప 2' గురించి మాట్లాడుతూ.." ఫ్యాన్స్‌కి ప్రామిస్ చేస్తున్నా. 'పుష్ప' కంటే 'పుష్ప 2' అంతకుమించి ఉంటుంది. పార్ట్ 2 సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా వచ్చింది. 'భన్వర్ సింగ్ షెకావత్, పుష్పల మధ్య జరిగే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ చాలా ఇంటెన్స్‌గా ఉండబోతున్నాయి. అలాగే పుష్పరాజ్‌కు ఎదురయ్యే సమస్యలు.. దాన్ని అతను ఎదుర్కొన్న తీరు అద్భుతంగా ఉంటుంది. అలాగే 'పుష్ప 2' సినిమాటోగ్రఫీపై నాకు చాలా నమ్మకం ఉంది ఖచ్చితంగా పార్ట్ 2 ప్రేక్షకుల అంచాలను మించి ఉంటుంది" అని చెప్పాడు. సుకుమార్ కామెంట్స్ తో మూవీపై అంచనాలు నెక్ట్స్ లెవల్ కు చేరుకున్నాయి.
'పుష్ప' పార్ట్-3 కూడా
'పుష్ప 2' తో పాటూ పార్ట్-3 కూడా తీయాలని అల్లు అర్జున్, సుకుమార్ డిసైడ్ అయ్యారట.అంతేకాదు పార్ట్-3 కి 'పుష్ప: ది రోర్' టైటిల్ ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. టైటిల్ ఇంకా అఫీషియల్ గా ఫిక్స్ చేయలేదు గానీ సీక్వెల్ తీయాలని అనుకుంటున్న మాట నిజమేనని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే 'పుష్ప3' ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. అందుకు మరింత సమయం పడుతుందని అంటున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నారు. ఆ మధ్య 'పుష్ప 2' విడుదల వాయిదా పడొచ్చని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని టీమ్ కన్ఫర్మ్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : ‘ఓయ్’ ఇప్పుడు చేస్తే చూస్తారా? అవార్డులు ఇవ్వకపోతే వెళ్లిపోతాడులే అనుకున్నారేమో: సిద్ధార్థ్