By: ABP Desam | Updated at : 17 Apr 2023 01:59 PM (IST)
Image Credit: Allu Arjun/Nani/Instagram
Allu Arjun: న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుంతో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్చి 30 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను అందుకుంది. తొలి వారం రోజుల్లోనే రూ.వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది ‘దసరా’ సినిమా. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమాలోని పాటలు, ఫైట్స్, డైలాగ్స్, విజువల్స్ అన్నీ కొత్తగా ఉండటంతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టారు. దీంతో ఈ మూవీపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ‘దసరా’ మూవీ టీమ్ ను ప్రశంసించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం బన్నీ చేసిని పోస్ట్ వైరల్ అవుతోంది.
‘దసరా’ మూవీ విడుదలకు ముందు నుంచీ మంచి హైప్ ను తీసుకొచ్చారు. సినిమా ప్రమోషన్స్ ను కూడా అంతే స్థాయిలో చేశారు మేకర్స్. మూవీ థియేటర్లలో విడుదల అయ్యాక ఊహించిన దానికంటే భారీ స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా సినిమాలో హీరో ఎలివేషన్, ఫైట్ సీన్లకు థియేటర్లు దద్దరిల్లాయనే చెప్పాలి. ఇప్పటి వరకూ నాని కెరీర్ లోనే ‘దసరా’ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో మూవీ టీమ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో స్టార్ హీరో అల్లు అర్జున్ ‘దసరా’ సినిమాపై తన స్పందనను తెలియజేశారు. మూవీ టీమ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు బన్నీ. దసరా టీమ్ మొత్తానికి అభినందనలు తెలుపుతున్నాను అన్నారు అల్లు అర్జున్. సినిమాలో నాని, కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉందన్నారు. అలాగే మిగతా యూనిట్ సభ్యుల నటన కూడా బాగుందని చెప్పారు. ముఖ్యంగా సంతోష్ నారాయన్ అందించిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయని పేర్కొన్నారు. సత్యన్ కెమెరా పనితీరు బాగుందన్నారు. ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డెబ్యూ డైరెక్టర్ గా అదరగొట్టాడని కితాబిచ్చారు. అలాగే సినిమా నిర్మాతలకు ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు బన్నీ.
Read Also: ఓటీటీలోకి రవితేజ ‘రావణాసుర’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ సినిమా పట్ల అల్లు అర్జున్ స్పందనను చూసి చిత్ర యూనిట్ మురిసిపోతుంది. ఇక శ్రీకాంత్ ఒదెల దర్శకుడు సుకుమార్ కు శిష్యుడు అని అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య సుకుమార్ శిష్యులు దర్శకులుగా మారి డెబ్యూ సినిమాలతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకుంటున్నారు. ఇప్పుడా జాబితాలోకి శ్రీకాంత్ కూడా వచ్చి చేరారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ టేకింగ్ లో ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తున్నారు. వీరి కాంబోలో వచ్చిన ‘పుష్ప’ సినిమా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ పార్ట్ 2 పై ప్రత్యేక శ్రద్ద పెట్టారు మేకర్స్. ‘పుష్ప 2’ నుంచి ఇటీవలే విడుదలైన బన్నీ లుక్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అలాంటిది ‘పుష్ప 2’ సినిమాతో సుకుమార్, బన్నీ కాంబో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Big Congratulations to the entire team of #Dasara . Brilliantly made film . Finest performance my brother @NameisNani . Candid performances by @KeerthyOfficial and all the other cast . Wonderful songs & B.Score by @Music_Santhosh garu & excellent camera work by Sathyan garu . The…
— Allu Arjun (@alluarjun) April 17, 2023
Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?
Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ
Sharwanand Marriage : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో
Shiva Balaji Madhumitha : మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?
NTR Back To India : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - ఈ వారమే 'దేవర' సెట్స్‌కు...
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి
Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!