News
News
X

Allu Arjun: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో అన్నీ అద్భుతాలే - AAA ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అంటారు

అల్లు అర్జున్ తో కలిసి ఏషియన్ సినిమాస్ వారు నిర్మిస్తున్న అత్యాధునిక మల్టీప్లెక్స్ AAA సినిమాస్ నిర్మాణం పూర్తి కావచ్చింది. మూడు నెలల్లో ఈ థియేటర్ ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు

FOLLOW US: 
Share:
ల్టీప్లెక్స్ రంగంలో అగ్రగామి అయిన ఏషియన్ సినిమాస్ హైదరాబాద్ లో ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాల విందు అందించేందుకు టాలీవుడ్ స్టార్స్ తో జత కలుస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబుతో కలిసి ఏఎంబీ మల్టీ పెక్స్ ను ఏర్పాటు చేసి సక్సెస్‌ సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ కు ఏఎంబీ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలతో ఏఎంబీ ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేసిన మల్టీ పెక్స్ గా ఏఎంబీ ఖ్యాతి గడించింది. అలాంటి ఏఎంబీ మల్టీ ప్లెక్స్‌కు మించిన హంగులతో అల్లు అర్జున్‌, ఏషియన్‌ సినిమాస్ కలయికలో AAA సినిమాస్‌ రాబోతుంది. ఏషియన్స్ అల్లు అర్జున్‌(AAA) సినిమాస్‌ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా అత్యాధునిక వసతులతో, టెక్నాలజీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 
 
AAA మరో మూడు నెలల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది. దక్షిణ భారతంలోనే మొదటిసారిగా పూర్తి స్థాయి ఏల్‌ఈడీ డిస్‌ప్లే‌స్‌ను ఈ మల్టీ‌ప్లెక్స్‌లో అమర్చుతున్నారు. ఇలాంటి పూర్తి స్థాయి ఎల్‌ఈడీ డిస్‌ ప్లే ఇప్పటి వరకు సౌత్‌ ఇండియాలో ఒకే ఒక్క మల్టీ ప్లెక్స్ లో ఉంది. ఇప్పుడు ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ లో ఏర్పాటు చేయబోతున్నారు. రెగ్యులర్‌ ప్రొజెక్టర్ లకు బదులుగా ఈ స్క్రీన్‌‌ను ఉపయోగిస్తారు.  దీంతో అద్భుతమైన విజువల్‌ ట్రీట్‌ ప్రేక్షకులకు దక్కుతుందని ఏషియన్ సినిమాస్ నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి స్క్రీన్‌ తో ప్రారంభం కాబోతున్న మొదటి థియేటర్ ఇదే కావడం విశేషం.
 
AAAలో అల్లు అర్జున్‌ వర్చువల్‌ ఇమేజ్‌
 
అమీర్ పేట సత్యం థియేటర్‌ చాలా మంది సినీ ప్రేమికులకు తెలిసిందే. ఆ స్థానంలోనే ఇప్పుడు అల్లు అర్జున్‌ AAA సినిమాస్‌ నిర్మాణం జరుగుతోంది. గత కొన్ని నెలలుగా ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం చివరి దశకు వచ్చింది. కానీ, ఇప్పటి వరకు ప్రేక్షకులకు అందుబాటులోకి లేదు.  అత్యాధునిక హంగులతో నిర్మాణం జరుగుతున్న కారణంగా ఎప్పుడెప్పుడు AAAలో సినిమాను చూడాలా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. AAA మల్టీప్లెక్స్ లో AA లాంజ్‌ను చాలా విశాలంగా ఏర్పాటు చేశారు. విశాలవంతమైన సీటింగ్ నిర్మాణంతో పాటు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండే లాస్పేస్ ను ఏర్పాటు చేశారట. ఇక థియేటర్‌ లో అడుగు పెట్టిన వెంటనే అల్లు అర్జున్‌ వర్చువల్ ఇమేజ్ కనిపించేలా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారట. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. 
 
అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే 'పుష్ప 2' ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ‘పుష్ప’ పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా 'పుష్ప 2' పై సాధారణంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అనుకున్న తేదీలో ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేది మాత్రం అనుమానమే. ఈ మూవీ కోసం ఇప్పటికే బన్నీ చాలా మూవీస్‌ను పెండింగులో పెట్టారు. చివరికి ‘జవాన్’లోని కీలక పాత్రను సైతం వదులుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  
Published at : 08 Mar 2023 06:28 PM (IST) Tags: Allu Arjun Pushpa 2 Asian Cinemas AAA Cinemas

సంబంధిత కథనాలు

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Ravanasura – Sushanth: సుశాంత్‌కు ‘రావణాసుర’ టీమ్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, విలన్ పాత్రలో అదుర్స్ అనిపించాడుగా!

Ravanasura – Sushanth: సుశాంత్‌కు ‘రావణాసుర’ టీమ్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, విలన్ పాత్రలో అదుర్స్ అనిపించాడుగా!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !