Allari Naresh: మొహమాటంతో కొన్ని సినిమాలు ఒప్పుకొని తప్పు చేశా: అల్లరి నరేశ్
Allari Naresh: అల్లరి నరేశ్.. లెజెండరీ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ కొడుకు. మొదట్లో కామెడీ సినిమాలు చేసినా.. తర్వాత పూర్తిగా స్టైల్ మార్చేశారు. ఇప్పుడిక ఆ ఒక్కటి ఆడక్కు అంటున్నాడు.
Allari Naresh About AA Okkati Adagaku Title: అల్లరి నరేశ్, ఫరాయ అబ్దుల్లా జంటగా నటించిన సినిమా 'ఆ ఒక్కటీ ఆడక్కు'. ఈ మధ్య ఈ సినిమా ట్రైలర్ రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సమాజంలో ఎంతోమంది యువత ఎదుర్కొంటున్న సమస్య పెళ్లి కాకపోవడం. దానిపై సినిమాని తెరకెక్కించారు. కాగా.. ఆ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి విశేషాలు పంచుకున్నారు హీరో అల్లరి నరేశ్.
నాన్నికి ట్రిబ్యూట్..
'ఆ ఒక్కటి అడక్కు' టైటిల్ తో ఈవీవీ సత్యనారాయణ ఒక సినిమా చేశారు. గతంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో టైటిల్‌కు వెయిట్ ఉంది కదా? భయంగా ఉందా? అని అడిగితే.. నరేశ్ ఇలా చెప్పారు. "తప్పకుండా ఉంటుంది. ఒక హిట్ సినిమా టైటిల్ ని తీసుకున్నప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది. గతంలో ‘ఆహా నా పెళ్లంట’ సినిమా టైటిల్ తీసుకున్నప్పుడు కూడా నేను నాయుడు గారి దగ్గరికి వెళ్లి ఇది మా బ్యానర్ లో మంచి హిట్ సినిమా. కచ్చితంగా హిట్ అవుతుదంటేనే తీసుకుందాము అన్నాను. హిట్ అవ్వదు అనుకుంటే.. వదిలేద్దాం అండి అన్నాను. ఆ సినిమాకి ఈ సినిమాకి పెద్ద తేడా ఏం లేదు. దాంట్లో సెటిల్ అవ్వని వాడికి పెళ్లి అవుతుంది. దీంట్లో సెటిల్ అయినా పెళ్లి అవ్వదు. ఈ సినిమాలో నా పేరు ధన. వాడికి.. జీవితంలో అన్ని ప్లజంట్ గా జరుగుతాయి. అంతా బాగుంటుంది. కానీ, ప్రతి ఒక్కరు పెళ్లి ఎప్పుడు అంటే మండిపోతుంది. అలాంటి వాళ్లకి ఆ ఒక్కటి అడక్కు. అదే ఇప్పుడు టైటిల్. జనరల్ గా అందరికీ ఎదురయ్యేదే ఈ సమస్య. చదువు అయిన వెంటనే ఉద్యోగం ఎప్పుడొస్తుంది అంటారు. వెంటనే పెళ్లెప్పుడు అని అడుగుతారు. అది కామన్. తెలియకుండా నేనేదో మిస్ అయిపోతున్నాను అనే టెన్షన్ మొదలవుతుంది. ఎక్కువగా 30 - 35 దాటిన తర్వాత ఇలాంటివి ఎక్కువ అవుతాయి. పిల్లను ఇవ్వరురా లాంటివి ఎక్కువగా వినిపిస్తాయి. అవన్నీ ఇబ్బందిగా ఉంటాయి. ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఉంటుంది. లవ్ ఆఫ్ ది లైఫ్.. పెళ్లి చేసుకోవాలనేది కూడా డ్రీమ్. అంతేకాని మీరు చెప్పారని, ఇంకొకరు చెప్పారని ఎవరిని బడితే వాళ్లను చేసేసుకోకూడదు. మీకు అవతలి వాళ్లకు వేవ్ లెంత్ సెట్ అవ్వాలి. చేసేసుకుందాం.. చేసేసుకుందాం అనే ఫీలింగ్ తో చేసుకోకూడదు. అలాంటి కాన్పెప్ట్. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో హీరో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లిలు చేస్తుంటాడు. 100 పెళ్లిల్లు చేస్తాడు కానీ.. అతనికి పెళ్లి అవ్వదు. సో ఇంకా ప్రెజర్ ఉంటుంది. సో ఫన్ ఫిలిమ్ కాబట్టి నాన్నగారి టైటిల్ తీసుకుందాం అనుకున్నాం. సినిమా వచ్చి దాదాపు 30 ఏళ్లు అవుతుంది. ఈ జనరేషన్ వాళ్లు ఆ సినిమా చూసుండరు కూడా. నాన్నగారికి ట్రిబ్యూట్ లా ఉంటుందని అని కూడా తీసుకున్నాం" అని టైటిల్ గురించి చెప్పారు అల్లరి నరేశ్.
మొహమాటానికి పోయి..
"నేను యావరేజ్ గా 10 - 15 కథలు వింటాను. నా స్టోరీలు నేనే వింటాను. వేరేవాళ్లు వినడం నాకు నచ్చదు. ఒక అరగంట వింటాను అంతే.. ముందే చెప్తాను 45 నిమిషాల్లో లైన్ చెప్పండి అని. నచ్చిందంటే మిగతాది వింటాను అని. కొన్ని నచ్చుతాయి. కొన్ని నచ్చవు. కొన్ని ఇంకా డెప్త్‌గా ఉంటే బాగుంటుంది. కథ క్రియేట్ చేయడం కష్టం. అందుకే వాళ్లను కష్టపెట్టొద్దు అని వింటాను. ఎలాగైనా ఒప్పించాలని వస్తారు చాలామంది. ఏ కథైనా మిమ్మల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తే మనం కనెక్ట్ అవుతాం. నో చెప్పడం చాలా కష్టం. ఇబ్బందిగా ఉంటుంది. మేనేజర్ ఉంటే చెప్పేయొచ్చు. కానీ, డైరెక్ట్ గా నాకే చెప్తారు కదా. మొహమాటంతో కొన్ని సినిమాలు ఒప్పుకొని తప్పు చేశా. ఆ తర్వాత అలా మానేశాను. స్టోరీ నాకు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా నా మైండ్ లో ఏదైతే తిరుగుతూ ఉంటుందో అదే చేయాలని చేస్తాను. అబ్లిగేషన్స్ ఎక్కువగా ఉండేవి. దాంతో కొన్ని సినిమాలు ఒప్పుకుని కెరీర్ చాలా స్పాయిల్ చేసుకున్నాను. ఎవరూ బలవంత పెట్టలేదు. కానీ, అలా అయిపోయింది. ఇప్పుడు మాత్రం అలా కాదు" అని చెప్పారు అల్లరి నరేశ్.
Also Read: బాల్యంలో విలాసవంతమైన జీవితం గడపలేదు, రోజూ 6 గంటలే నిద్ర: సమంత